Tragedy: విషాదంగా మారిన వివాదం.. తల్లి కోపానికి ఇద్దరు పిల్లలు బలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tragedy: కుటుంబంలో రేగిన కలతలు చివరకు రెండు నిండు ప్రాణాలను బలి తీసుకున్నాయి పల్నాడు జిల్లాలో ఓ కుటుంబంలో రేగిన వివాదం విషాదంగా మారింది. మాచర్ల మండలం నారాయణపురం తండాలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు పిల్లలు కన్న తల్లి కోపానికి బలైయ్యారు…. కుటుంబ కలహాలతో కన్నతల్లి, తన ముగ్గురు పిల్లలకు, భర్తకు కూడా టీలో ఎలుకల మందు కలిపి ఇచ్చింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అయితే ఈ ఘటనలో చికిత్స పొందుతూ ఇప్పటి వరకు ఇద్దరు పిల్లలు మృతి చెందారు. భార్యాభర్తలు మరో బిడ్డతో కలిసి మృత్యువుతో పోరాడుతున్నారు. మరో ముగ్గురు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
Read Also: Chandigarh: బయటపడ్డ చండీగఢ్ రిటర్నింగ్ అధికారి బండారం
Also Read
- Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
- Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
- Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
మాచర్ల మండలం నారాయణపురం తండా చెందిన రవి నాయక్, తన అక్క కూతురినే పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు సంతానం.. కాగావృత్తి రీత్యా రవి నాయక్ హైదరాబాద్‌లో ఆటో నడుపుతున్నారని, వారానికో, పది రోజులకు, వచ్చి కుటుంబంతో గడిపే వారిని సమాచారం. ఈ నేపథ్యంలో తరచూ భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో తాను పుట్టింటికి వెళ్తానని చెప్పింది భార్య వసంత. దీన్ని వ్యతిరేకించాడు భర్త రవి నాయక్. దీంతో భర్తతో తీవ్రవాగ్వదానికి దిగింది వసంత. ఆగ్రహం తట్టుకోలేక తాగుతున్న టీలో ఎలుకల మందు కలిపించింది. ఈ ఘటనలో అభం శుభం తెలియని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డారు. కాగా టీ రుచిలో తేడా రావటంతో టీ తాగిన రవి నాయక్ ఆ టీని పక్కన పడేశాడు. దీంతో రవి నాయక్‌కు ప్రస్తుతం ప్రమాదం తప్పినట్లేనని డాక్టర్లు చెప్పారు.
Read Also: Indore: మాట్లాడటం లేదని మహిళ ఇంటికి నిప్పు అంటించిన ఓ వ్యక్తి..
అయితే కన్నతల్లి కోపంతో టీలో ఎలుకల మందు కలిపించిందన్న విషయాన్ని తెలుసుకోలేని ఆ చిన్నారులు టీని సేవించడం, ఆ తర్వాత తీవ్రమైనటువంటి అనారోగ్యంతో హాస్పిటల్లో చేరటం అక్కడ ఒక్కొక్కరుగా చికిత్స పొందుతూ మృత్యువాత పట్టడం జరిగింది. ప్రస్తుతానికి ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు రమావత్ భాను ప్రకాష్, రమావత్ ఈశ్వర్‌లు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలో రెండేళ్ల వయస్సు ఉన్న ఈశ్వర్ మృతిచెందగా, సోమవారం రామావత్ భాను ప్రకాష్‌ను చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యలో, మిర్యాలగూడ సమీపంలో మృతి చెందినట్లు సమాచారం. భర్త రవి నాయక్ భార్య వసంతతో పాటు మరొక చిన్నారి ఈశ్వర్ నాయక్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. క్షణికాలం ఆవేశంతో ఇద్దరు బిడ్డల ఉసురు తీసిన కన్నతల్లి పరిస్థితి కూడా విషమంగానే ఉందని , క్షణికాల కోపంతో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవటం వల్ల కుటుంబాలను కోలుకోలేని విధంగా దెబ్బతీస్తున్నాయని ఆవేదన చెందుతున్నారు మృతుల బంధువులు..
తాజావార్తలు
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
Volkswagen ID.Tiguan EV: 600 కి.మీ. రేంజ్‌తో కొత్త ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!