పెద్దపల్లి జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. బరువుదెరువు కోసం వచ్చిన కొందరు ఒరిస్సాకు చెందిన కార్మికులు కలుషిత ఆహారం తిని బలయ్యారు. గౌరెడ్డి పేటలోని ఎమ్మెస్సార్ ఇటుకబట్టిలో పనిచేస్తున్న కార్మికులు కలుషిత ఆహారం తిని 20 మంది అస్వస్థత గురయ్యారు. దీంతో వెంటనే వారిని కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కార్మికులు మృతి చెందారు. అయితే చికిత్స పొందుతున్న 14 మంది కార్మికుల పరిస్థితి విషమంగా ఉండడంతో ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read Also: Kishan Reddy: బడ్జెట్ పై కేంద్రమంత్రి విమర్శలు.. ఏమన్నారంటే..?
కాగా.. అస్వస్థకు గురైన వారిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. మరోవైపు.. నలుగురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఏఎంసీ ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారించారు. ఇటుక బట్టీలో పనిచేస్తున్న సూపర్వైజర్ మల్లేశంని వివరణ అడిగారు. అయితే.. అస్వస్థతకు గురైన వారు కోడి పేగులు, కోడి కాళ్లు తిన్నారని దీంతో అస్వస్థకు గురయ్యారని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పెద్దపల్లి పోలీసులు.. విచారణ చేపట్టారు.
Read Also: Etela Rajender: ఈ ఏడాదిలో రుణమాఫీ చేస్తారా లేదా చెప్పాలి..