ఏపీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కృష్ణానదిలో మునిగి ముగ్గురు విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణానదిలో చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి దిగడం కోసమని నదిలో దిగడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులు పటమటకు చెందిన నడుపల్లి నాగ సాయి కార్తికేయ, కత్తి ప్రశాంత్ (13), ఇంటర్మీడియెట్ విద్యార్ది గగన్ గా గుర్తించారు. కాగా నదిలో స్నానానికి నలుగురు వెళ్లగా.. ఒకరు ప్రాణాలతో బయటపడ్డాడు. ముగ్గురు మృతి చెందారు.
Read Also: IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్ల బదిలీలు..
స్నానానికి వెళ్లకుండా నది ఒడ్డుపై ఉన్న కానూరు సనత్ నగర్ చెందిన షేక్ షారుక్ ప్రాణాలు దక్కించుకోగలిగాడు. కాగా.. నదిలో చనిపోయిన ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మృతులందరూ పడమట హైస్కూల్ రోడ్డులోని నారాయణ స్కూల్ లో ఎనిమిదో తరగతి చదువుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న తాడేపల్లి పోలీసులు.. విచారణ చేపట్టారు.
Read Also: MLC Kavitha : కేసీఆర్ ఉద్యమాలు అందరికీ స్పూర్తిదాయకం