విజయవాడ నగరంలో ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది ట్రాఫిక్ నిబంధనలను పాటించకుండా వెళుతున్న వాహన చోదకులకు జరిమానాలు విధించడంతో సరిపెట్టకుండా సోషల్ మీడియాలో రీల్స్ చేయటం ఇప్పుడు వివాదానికి కారణమైంది సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ అవగాహన కల్పించడంలో తప్పేం లేనప్పటికీ అది హద్దులు దాటి అవతలి వాళ్ళని అవమానించే వరకు వెళ్లడంతో పోలీసులు అతి చేస్తున్నారని వరకు వ్యవహారం వెళ్లింది..
సాధారణంగా రోడ్లు వేసేటప్పుడు, పెద్ద పెద్ద భవంతులు నిర్మించే సమయంలో చెట్లు అడ్డుగా ఉంటే ఏం చేస్తారు? దాన్ని నరికి పక్కన పారేస్తారు. ఇదే సులభమైన పని కదా.. కానీ.. సికింద్రాబాద్ మారేడ్పల్లిలో మాత్రం ట్రాఫిక్ పోలీసులు చెట్టుకు ప్రాణప్రతిష్ట చేశారు. రోడ్డుపై ఉన్న భారీ వృక్షాన్ని వేళ్ళతో సహా పెకిలించి, మరోచోట నాటారు. భారీ క్రేన్ల సహాయంతో చెట్టును తరలించారు ట్రాఫిక్ పోలీసులు. ఈ వినూత్న ప్రయత్నం సఫలీకృతం కావడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. దీంతో…
Pawan Kalyan: తాజాగా విశాఖపట్నంలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సందర్భంగా ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అయినట్టు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ట్రాఫిక్ అధికారులు ఖండించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ADCP ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జేఈఈ పరీక్ష సమయంలో ట్రాఫిక్ అంతరాయం జరిగిందన్న వార్తలు అసత్యం అని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ 8:45కి పరీక్ష కేంద్రం ప్రాంతాన్ని దాటి వెళ్లిందని.. పరీక్ష కేంద్రాల వద్దకు…
Bhadradri : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి…
మీరు బైక్ మీద వెళ్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు కెమెరాలో ఫొటో తీశాడు. మీ పేరుతో ఓ చలాన్ జారీ అవుతుంది. ఈ చలాన్ రూ. 235 వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి లేదా రెండు వేలు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ.. ఏకంగా రూ. 10 లక్షల చలాన్ వస్తే.
Drunken Drive : హైదరాబాద్‌లో మద్యం మత్తులో వాహనం నడిపిన ఓ వాటర్ ట్యాంకర్ డ్రైవర్ ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. ఈ ఘటన పంజాగుట్ట ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళితే, ఉప్పల్ నుండి పంజాగుట్ట మీదుగా అమీర్‌పేట వైపు వెళ్తున్న ఓ వాటర్ ట్యాంకర్‌ను ట్రాఫిక్ పోలీసులు అనుమానంతో ఆపి తనిఖీ చేపట్టారు. పంజాగుట్ట ట్రాఫిక్ ఎస్‌ఐ ఆంజనేయులు ట్యాంకర్ డ్రైవర్ యాదగిరిపై బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించగా, 325 బ్లడ్ అల్కహాల్ కంటెంట్ (BAC) పాయింట్స్…
Ambulance Misuse: అత్యవసర పరిస్థితుల్లోనే అంబులెన్స్‌లు సైరన్ వాడాలనే నిబంధనలను ఉల్లంఘిస్తూ.. ఒక అంబులెన్స్ డ్రైవర్ తన పెంపుడు కుక్కకు ఆపరేషన్ కోసం సైరన్‌తో వెళ్లడం హైదరాబాద్ నగరంలో తీవ్ర సంచలనం రేపింది. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద ఈ విచిత్రమైన ఘటన చోటుచేసుకుంది. సైరన్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు.. ఈ క్రమంలో పంజాగుట్ట వద్ద అతి వేగంగా, సైరన్‌లు మోగిస్తూ వచ్చిన ఒక అంబులెన్స్‌ను పోలీసులు ఆపి తనిఖీ…
జవాడ పోలీసులకు వింత అనుభవం ఎదురైంది. ఓ వాహనదారుడు ట్రాఫిక్ సీఐ రామారావుతో వితండ వాదానికి దిగాడు. పోలీసులు తమ ఐడీ చూపించాలంటూ అతడు హల్చల్ చేశాడు.. నకిలీ పోలీసులు తిరుగుతున్నారంటూ నానా హంగామా సృష్టించాడు. దీంతో చివరకు తన ఐడీ కార్డు చూపించిన సీఐ రామారావు సదరు వాహనదారుడికి హెల్మెట్ లేకపోవడంతో ఫైన్ వేశాడు.
New Traffic Rules In AP: ఆంధ్రప్రదేశ్ లో ఈరోజు కొత్త మోటార్ వెహికల్ చట్టం అమలు చేసేందుకు అధికారులు రెడీ అయ్యారు. నూతన మోటారు వాహనాల చట్టం ప్రకారం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోతే భారీగా ఫైన్స్ వేయనున్నారు.
విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. విధులకు ఆటంకం కలిగిస్తే.. తర్వాత జరిగే పరిణామాల గురించి ఆలోచించడం లేదు. రాజకీయ నాయకులు, ప్రముఖుల అండతో పబ్లిక్‌లోనే పోలీసులపై చిందులేస్తున్నారు. ఇలాంటి ఘటనే తాజాగా హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. పంజాగుట్ట లో కారు ఓనర్ హల్చల్ సృష్టించాడు. పెండింగ్ చలానాలు చెక్ చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు కారు ఆపారు. నాలుగు వేల పెండింగ్ చలానాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.