Pawan Kalyan: కాన్వాయ్ వల్ల జేఈఈ పరీక్ష విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడలేదు.. అవన్నీ తప్పుడు కథనాలే
- డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ జేఈఈ పరీక్ష విద్యార్థులు ఎవరు ఇబ్బంది పడలేదు..
- అవన్నీ తప్పుడు కథనాలే
- ట్రాఫిక్ అధికారుల వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pawan Kalyan: తాజాగా విశాఖపట్నంలో జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష సందర్భంగా ట్రాఫిక్ కారణంగా విద్యార్థులు పరీక్షకు ఆలస్యం అయినట్టు సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలను ట్రాఫిక్ అధికారులు ఖండించారు. ఈ సందర్బంగా ట్రాఫిక్ ADCP ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జేఈఈ పరీక్ష సమయంలో ట్రాఫిక్ అంతరాయం జరిగిందన్న వార్తలు అసత్యం అని ఆయన తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ 8:45కి పరీక్ష కేంద్రం ప్రాంతాన్ని దాటి వెళ్లిందని.. పరీక్ష కేంద్రాల వద్దకు విద్యార్థులు 8:30 కల్లా చేరాల్సి ఉండగా ఆ సమయంలో ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం జరగలేదని స్పష్టం చేశారు.
Read Also: Srinivasa Reddy: ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కోసం కేవలం BRTS రోడ్‌నే ఉపయోగించామని, ఎన్ఏడి నుంచి పెందుర్తి వరకు విద్యార్థులకు ఎక్కడా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ముందస్తుగా సున్నితంగా ప్లాన్ చేసినట్లు ట్రాఫిక్ అధికారులు పేర్కొన్నారు. అలాగే, ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వార్తలు ప్రచారం చేయడం తగదని, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. మొత్తంగా పవన్ కళ్యాణ్ కాన్వాయ్ వల్ల పరీక్షలపై ఎలాంటి ప్రభావం చూపలేదని, ట్రాఫిక్ సమర్ధవంతంగా నిర్వహించామని అధికారులు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!