మీరు బైక్ మీద వెళ్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు కెమెరాలో ఫొటో తీశాడు. మీ పేరుతో ఓ చలాన్ జారీ అవుతుంది. ఈ చలాన్ రూ. 235 వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి లేదా రెండు వేలు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ.. ఏకంగా రూ. 10 లక్షల చలాన్ వస్తే. ఇంత ఎందుకు వస్తుంది? అనుకుంటున్నారా? కొన్ని సార్లు జరగొచ్చు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా అహ్మదాబాద్‌లో చోటు చేసుకుంది. హెల్మెట్ ధరించనందుకు అతనికి విధించాల్సిన జరిమానా రూ. 500. కానీ.. తప్పు ఎంట్రీ కారణంగా రూ.10,00,500గా మారింది.
READ MORE: PM Modi: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యుడిగా సంజయ్ మిశ్రా నియామకం
గత ఏడాది ఏప్రిల్‌లో అహ్మదాబాద్‌లోని శాంతిపుర ట్రాఫిక్ సర్కిల్ వద్ద అనిల్ హదియా అనే విద్యార్థి హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు చలాన్ విధించారు. టైపింగ్ లోపం కారణంగా ఆ యువకుడి ఇబ్బందులు పెరిగాయి. ఈ విషయంలో పోలీసులు తమ తప్పును అంగీకరిస్తున్నారు. అనిల్ హడియా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. “పోలీసులు నా ఫోటో తీసుకొని లైసెన్స్ నంబర్‌ను నోట్ చేసుకున్నారు. చలాన్ జారీ చేశారు. రూ.10,00,500 చలాన్ విధించారు. నేను దాన్ని చూడలేదు. నేను శాంతిపుర సర్కిల్ ట్రాఫిక్ పోలీసులు ఆన్‌లైన్ చెల్లింపు చేయమని అడిగారు. కొన్ని రోజుల తర్వాత నేను దాని గురించి మర్చిపోయాను. ఇటీవల, నా బైక్‌కు సంబంధించిన ఓ పని కోసం ఆర్‌టీఓ వద్దకు వెళ్లాను. నా పేరు మీద నాలుగు చలాన్లు ఉన్నాయని తెలిసింది. మూడు ఆన్‌లైన్‌లో చెల్లించాను. నాల్గవ చలాన్ కట్టడానికి రాలేదు. కాగా.. మార్చి 8న, ఓధవ్ పోలీసుల ద్వారా కోర్టు సమన్లు వచ్చాయి. దీంతో నేను పోర్టల్‌లోకి వెళ్లి చెక్ చేశాను. కేవలం ₹500 చలాన్‌కు బదులుగా ₹10,00,500 చలాన్ చూపుతోంది. నేను లా విద్యార్థిని. నా తండ్రి ఒక చిన్న వ్యాపారవేత్త. కోర్టు మమ్మల్ని రూ.10 లక్షలు చెల్లించమని అడిగితే.. మేము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలి.” అని అనిల్ ప్రశ్నించాడు. బాధితుడు మెట్రోపాలిటన్ కోర్టును ఆశ్రయించాడు. కోర్టుకు పంపిన చలాన్‌లో ఏదో లోపం జరిగి ఉంటుందని.. తాము కోర్టుకు తెలియజేసి దాన్ని సరిదిద్దుతామని.. జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) ఎన్.ఎన్. చౌదరి చెప్పారు.