Bhadradri : శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాచలంలో జరిగిన రాముల వారి కళ్యాణ మహోత్సవానికి హాజరయ్యేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ నేపధ్యంలో భద్రాచలం పట్టణం వాహనాలతో కిక్కిరిసిపోయింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, మూడు గంటలకుపైగా వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అభిజిత్ లగ్నం సమయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. దీన్ని వీక్షించేందుకు టెంపోలుగా, బస్సులుగా, కార్లుగా, ద్విచక్ర వాహనాలుగా భక్తులు సమీప ప్రాంతాల నుండి పెద్దఎత్తున భద్రాచలానికి వచ్చారు. దీంతో ట్రాఫిక్ జాం ఏర్పడి భద్రాచలం ప్రధాన రహదారులు మొత్తం నిలిచిపోయినట్టయ్యాయి.
సారపాక గోదావరి బ్రిడ్జి నుంచి కూనవరం రోడ్డులోని జూనియర్ కాలేజీ గ్రౌండ్ వరకు వాహనాలు కదలకుండా నిలిచిపోయాయి. అలాగే బ్రిడ్జి సెంటర్, బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్, జూనియర్ కాలేజీ సెంటర్ వద్ద అన్నివైపులా ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించింది.
వైద్యులు, అత్యవసర సేవలకు వెళ్లే వాహనాలు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుపోవడంతో పరిస్థితి మరింత కఠినంగా మారింది. ట్రాఫిక్ పోలీసు సిబ్బంది రంగంలోకి దిగి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి తీవ్రంగా శ్రమించారు. ముఖ్యంగా భద్రాచలం టౌన్ ట్రాఫిక్ విభాగం, సీఐ స్థాయి అధికారులు ట్రాఫిక్‌ను క్రమబద్ధం చేయడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కళ్యాణోత్సవం ముగిసిన తర్వాత భక్తులు తిరుగు ప్రయాణం ఆరంభించడంతో ట్రాఫిక్ మరింతగా పెరిగింది అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుతున్నారు.
Sambhal: సంభాల్ మసీదు వద్ద పోలీస్ అవుట్‌పోస్ట్.. ప్రారంభించిన 8 ఏళ్ల బాలిక..