హైదరాబాద్‌లో వాహనదారుల్లో చాలామందికి ట్రాఫిక్ నిబంధనలు తెలియవు. దీంతో వాళ్లు ఎలా పడితే అలా వాహనాన్ని నడిపేస్తుంటారు. రోడ్డు బాగుంది కదా అని 80 లేదా 100 కిలోమీటర్ల స్పీడ్‌లో వెళ్తుంటారు. అయితే హైదరాబాద్ సిటీలో ఎంవీ యాక్ట్ ప్రకారం బైకర్లు గంటలకు 60 కి.మీ. స్పీడ్‌తో మాత్రమే వెళ్లాలి. అయితే గత ఏడాది లంగర్‌హౌస్‌కు చెందిన ఓ బైకర్ 66 కి.మీ. వేగంతో వెళ్లడంతో ట్రాఫిక్ పోలీసులు రూ.వెయ్యి ఛలానా విధించారు. దీంతో సదరు వాహనదారుడు…
తెలంగాణలో ట్రాఫిక్ ఉల్లంఘనలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ ఏడాది జరిమానాల రూపంలో ప్రభుత్వానికి భారీ స్థాయిలో ఆదాయం సమకూరింది. తెలంగాణ వ్యాప్తంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఈ ఏడాదిలో ఇప్పటిరకు రూ.533కోట్ల జరిమనాను పోలీసులు విధించారు. అంటే రోజుకు రూ. కోటిన్నర చొప్పున వసూలు చేశారు. Read Also: అంకుల్ అని పిలిచిన యువతి.. కోపంతో ఆ వ్యక్తి చేసిన పనికి… అయితే ట్రాఫిక్ ఛలానాలలో ఎక్కువగా హెల్మెట్ ధరించనందుకు విధించిన జరిమానాలే ఉన్నాయి. హెల్మెట్‌లు…
ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న ఓ నిండు ప్రాణాన్ని కాపాడి మానవత్వాన్ని చాటుకున్నారు కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు. అయితే హైదరాబాద్ చాదర్ ఘాట్ సిగ్నల్ వద్ద టూ వీలర్ పై ఓ వ్యక్తికి హార్టెటాక్ వచ్చింది. దాంతో ఒకసారిగా గుండెపోటుతో కుప్పకూలి పడిపోతున్న వ్యక్తిని గమనించిన కాచిగూడ ట్రాఫిక్ పోలీసులు… ఆయా వ్యక్తిని సమీప హాస్పిటల్ తరలించారు. వెంటనే ఆ వ్యక్తి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకొని.. వారికీ సమాచారం అందించారు పోలీసులు. అయితే సకాలంలో స్పందించి…
హైదరాబాద్‌లో రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. జూబ్లీహిల్స్‌లో అదుపు తప్పిందో బీఎండబ్ల్యూ కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టింది కారు. బెలూన్లు తెరుచుకోవడంతో ఘోర ముప్పు తప్పింది. గాయపడ్డ వ్యక్తిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ఫిలింనగర్ రామానాయుడు స్టూడియో నుంచి వేగంగా వెళుతున్న సమయంలో అదుపు తప్పింది బిఎండబ్ల్యు కారు. రామానాయుడు స్టూడియో వద్ద ఉన్న మూలమలుపు వద్ద ఒక్కసారిగా బోల్తా కొట్టిందా కారు. అతివేగం వల్ల రోడ్డు మధ్యలో…
హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. వాహనదారుల పెండింగ్ చలాన్లపై 50 శాతం రాయితీ ఆఫర్ తీసుకొచ్చారనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఏకంగా ఒకేసారి 50 శాతం డిస్కౌంట్ అంటూ చూసిన హైదరాబాదీలు.. దానిని విపరీతంగా షేర్ చేస్తూ, లైక్‌లతో వైరల్ చేశారు.. అక్టోబర్ 4వ తేదీ నుంచి 7వ తేదీ వరకు హైదరాబాద్‌లోని గోషామహల్ స్టేడియంలో ప్రత్యేక లోక్ అదాలత్ ద్వారా పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని కేటుగాళ్లు క్రియేట్ చేసిన వార్తపై క్లారిటీ ఇచ్చారు హైదరాబాద్…