కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు.. తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం చేయకుండా కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం బాగుపడింది అని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. అందుకే వారి కుటుంబానికి తగిలే దెబ్బలు ప్రజలందరూ స్వీకరిస్తున్నారు. కవితను అరెస్టు చేయడంతో ప్రజలు సంతోషంగా ఉన్నారు అని తెలిపారు. అలాగే, కాళేశ్వరం, మేడిగడ్డ విషయంలో కూడా బీజేపీ ప్రభుత్వం మాట్లాడకుండా ఉంది అంటే ఆరోజు మెగా వాళ్ళు కోట్ల రూపాయలు ఇస్తున్నారన్నారు. ఇక, వరంగల్ నగరంలో గతంలో…
టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభకోణంలో బెంగాల్ మంత్రికి ఈడీ నోటీసులు.. టీచర్స్ రిక్రూట్మెంట్ కుంభ కోణంలో పశ్చిమ బెంగాల్ మంత్రి చంద్రనాథ్ సిన్హాకు ఎన్ ఫోర్స్మెంట్ (ఈడీ) ఇవాళ (మంగళవారం) నోటీసులు జారీ చేసింది. మార్చి 22న సిన్హా నివాసంపై ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. అలాగే, మార్చి 27వ తేదీన దర్యాప్తు సంస్ధ ఎదుట విచారణకు హాజరు కావాలని సిన్హాకు సమన్లు ఇచ్చినట్లు ఈడీ తెలిపింది. ఇక, మంత్రి చంద్రనాథ్ సిన్హా ఇంట్లో దాడుల నేపధ్యంలో పలు…
మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు..! మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వనదేవతల దర్షనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో సమక్క సారాలమ్మ ఆలయం ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. మహాజాతర ముగిసిపోయి నెల గడిచినా భక్తుల రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఇవాళ గొర్రెల బలి, బంగార(బెల్లం) లతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో మునుగు జిల్లాలో రోడ్లన్నీ భక్తులతో కిటకిటలాడాయి. అమ్మవార్ల దర్శనానికి భక్తులు…
గజ్వేల్లో పట్టుబడ్డ నగదు.. రూ.50 లక్షలు సీజ్..! గజ్వేల్ పట్టణంలో పెద్ద మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు పట్టుబడింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో గజ్వేల్లోని అంబేద్కర్ చౌరస్తాలో పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బచ్చు రత్నాకర్కు చెందిన కారు (టీఎస్36సీ 0198)లో రూ.50 లక్షల నగదును పోలీసులు గుర్తించారు. నగదుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు స్వాధీనం చేసుకోలేదు. ఈ సందర్భంగా గజ్వేల్ సీపీ అనురాధ మాట్లాడుతూ రూ.50 వేలకు మించి నగదు తీసుకెళ్లరాదని సూచించారు.…
యర్లగడ్డ సమక్షంలో టీడీపీలో చేరిన మాజీ న్యాయవాది కేవీ రమణ.. గన్నవరంలో ప్రముఖ న్యాయవాది కేవీ రమణ నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి టీడీపీలోకి టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఆహ్వానించారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి యార్లగడ్డ వెంకట్రావ్ సమక్షంలో తెలుగు దేశం పార్టీలో న్యాయవాది కేవీ రమణ జాయిన్ అయ్యారు. అంతకు ముందు వైసీపీ అరాచక పాలనను అంతమొందించాలంటే టీడీపీ-…
విద్యార్థులకు ఆ సినిమా చూపించండి.. సీఎం రేవంత్ కు బండి సంజయ్ లేఖ రజాకార్ సినిమాకు వినోదపు పన్ను నుండి మినహాయింపు ఇవ్వాలని, పాఠశాల, కళాశాల విద్యార్థులకు ఈ సినిమా చూపించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కి ఎంపీ బండి సంజయ్ కుమార్ లేక రాశారు. రజాకార్ల రాక్షస పాలనలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధలను కళ్లకు కట్టినట్లు చూపిన సినిమా రజాకార్ అన్నారు. నిజాం పాలన నుండి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించి…
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 శాతం సీట్లు.. లోక్ సభ, అసెంబ్లీ స్థానాలకు అధికార వైసీపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇడుపులపాయ వేదికగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, మహిళా నేతలకు జగన్ పెద్ద ఎత్తున అవకాశం కల్పించారు. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 ఎంపీ సీట్లకు వైసీపీ అభ్యర్థులను ఆయన ప్రకటించారు. సామాజిక…
టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందే.. బాపట్ల జిల్లా మేదరమెట్ల వద్ద చివరి సిద్ధం సభ గురించి మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్ అవుతుందని ఆయన అన్నారు. 15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిదన్నారు. గత సభలకు మించి ప్రజల స్పందన ఉందన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందేనని వ్యాఖ్యానించారు. ఏపీలో 90 శాతం…
కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ! తెలంగాణలోని జగిత్యాలలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా సాగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ప్రోటోకాల్ వివాదంపై ఇరు వర్గాల మధ్య గొడవ జరిగింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సముదయించారు. పోలీసులు కూడా ఇరు వర్గాలను చెదరగొట్టారు. శనివారం ఉదయం జగిత్యాల స్థానిక తహసీల్దార్ కార్యాయలంలో కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్…