మోడీ, రాహుల్‌లకు ఎన్నికల సంఘం నోటీసులు
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించిన నేపథ్యంలో ఈసీ విచారణ చేపట్టింది. మతం, కులం, వర్గం లేదా భాష ప్రాతిపదికన ఆయన విద్వేషం, విభజన సృష్టిస్తున్నారని బీజేపీ, కాంగ్రెస్‌లు ఆరోపించాయి. కమిషన్ ఏప్రిల్ 29 ఉదయం 11 గంటలలోపు సమాధానం కోరింది.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ, రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా నుంచి ఎన్నికల సంఘం సమాధానాలు కోరింది. మోడీ, రాహుల్ ప్రసంగాలపై వచ్చిన ఫిర్యాదులపై కమిషన్ ఈ నోటీసులు పంపింది. ఈ ఫిర్యాదులలో ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. మతం, కులం, వర్గం, భాషల ప్రాతిపదికన ప్రజల మధ్య విద్వేషాలు, చీలికలు పెంచేలా ఈ నేతలు పనిచేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుంది..
కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని బీజేపీ రాజ్యసభ ఎంపీ డా.లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గెలుపు ఖాయం.. మెజార్టీ కోసం పోటీ చేస్తున్నామన్నారు. ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డు సాధించి మాట నిలబెట్టుకుంటున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ముస్లిం ల ఓట్ల కోసం మైనారిటీ జపం చేస్తున్నారని మండిపడ్డారు.
ముస్లింలకు ఉద్యోగాల్లో 15శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ చెప్పింది నిజం కాదా? అని ప్రశ్నించారు. మోడీ వాస్తవం మాట్లాడుతుంటే.. రాజకీయంగా ఎదురు దాడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తుందన్నారు. మోడీ సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటే కాంగ్రెస్ సహించ లేక కర్ణాటకలో ముస్లింలను బీసీలో చేరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత కు బెయిల్ ఎందుకు ఇవ్వరు అని మాజీ సీఎం న్యాయ స్థానాలను ప్రశ్నించడం అంటే ఎంత నిరాశలో ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు.
డిసెంబర్ 9న రెండు లక్షల రైతు రుణమాఫీ అన్నారు ఏది? డీకే అరుణ ఫైర్
గెలలిచిన వెంటనే డిసెంబర్ 9న అమలు చేస్తామన్న రెండు లక్షల రైతు రుణమాఫీ ఏమైంది? అని బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే.అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణపేట జిల్లా మాగనూరు మండలం అడవిసత్యారం గ్రామంలో ఎన్నికల ప్రచారంలో డీకే.అరుణ మాట్లాడుతూ.. అచ్చంపేట నుండి వచ్చిన రేవంత్ రెడ్డిని కొడంగల్ లో గెలిపించారు మన జిల్లా ప్రజలని తెలిపారు. మీ ఆడబిడ్డనైన నన్ను ఒక్కసారి గెలిపించి ఈ ప్రాంత అభివృదికి అవకాశం కల్పించాలన్నారు. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారేంటిలో ఒక్క గ్యారెంటీ కూడా అమలుపర్చలేదన్నారు. రైతులు పండించిన వరి ధాన్యానికి సంచికి అదనంగా ఇస్తానన్న ఐదు వందల బోనస్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోకు భయపడి బీజేపీ అబద్ధాలు చెబుతుంది..
కాంగ్రెస్ మేనిఫెస్టోను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత పి.చిదంబరం ఇవాళ (గురువారం) అన్నారు. మోడీ హామీల జాడ ఎక్కడా లేదని, బీజేపీ అబద్ధాలు చెప్పడం, వక్రీకరించడం, దుర్వినియోగం చేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీకి పి చిదంబరం ఛైర్మన్‌గా ఉన్నారు. ఈ సందర్భంగా పి.చిదంబరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ మేనిఫెస్టో దళితులు, గిరిజనులు, వెనుకబడిన తరగతులు, యువత, మహిళల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోందని పేర్కొన్నారు. ఇక, మా మేనిఫేస్టోలో అసలు ఆస్తి పంపిణీ, వారసత్వ పన్ను గురించి ప్రస్తావించలేదన్నారు. 1985లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్టేట్ డ్యూటీని రద్దు చేసిందని వివరించారు.
తన స్టైలే వేరంటూ.. మెట్రో రైల్లో ప్రచారం చేస్తున్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల జోరు కొనసాగుతుంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల హడావిడి బాగానే జరుగుతుంది. తెలంగాణలో కేవలం లోక్ సభ స్థానాలకు మాత్రమే ఎన్నికలు జరుగుతుండగా.. ఆంధ్రప్రదేశ్లో లోక్ సభ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలకు కూడా ఎన్నికల జరుగుతున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో పోటీలో ఉన్న అభ్యర్థులు పెద్ద ఎత్తున ప్రచారాలను చేస్తూ ప్రజలను వారిపైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
ఇకపోతే తాజాగా తెలంగాణ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి హైదరాబాదులోని మెట్రో రైల్ లో ప్రయాణించి హల్చల్ చేశారు. నిజానికి ఎమ్మెల్యే మల్లారెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ జోష్ ఉంటుందన్న సంగతి మనకి తెలిసిందే. తనదైన తెలంగాణ యాసతో, జోకులు వేస్తూ ఆటపాటలతో ఆయన ఉన్న ప్రదేశాన్ని బాగా ఆనందంగా ఉంచేందుకు ప్రయత్నిస్తాడు.
సిద్దిపేటను 40 ఏళ్లుగా ఎకే కుటుంబం దోచుకుంది
బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై ఫైర్ అయ్యారు. సిద్దపేటను 40 ఏళ్లుగా ఒకే కుటుంబాన్ని దోచుకుంటుందని రఘునందన్ రావు ఆరోపించారు. ప్రజలు ఆ కుటుంబాన్ని వద్దనుకొని బీజేపీని కోరుకుంటున్నారని అన్నారు. సిద్దిపేటలో నిర్వహించిన విజయ సంకల్ప సభలో రఘునందన్ రావు మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ ముందు “నయవంచన” అని రాసిన బోర్డు పెట్టుని ధర్నా చేస్తున్నట్లు యాక్టింగ్ చేస్తున్నారన్నారు. దేశంలో నయవంచన అనే పదానికి పర్యాయ పదం కాంగ్రెస్ పార్టీ అని రఘునందన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ దేశంలో మెజార్టీ ప్రజలను వంచించిందని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చా.. దేశంలో రెండు జెండాలు, ఇద్దరు ప్రధానులు, రెండు రాజ్యాంగాలను తెచ్చిందన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నాలుగు నెలలైనా.. ఇంత వరకు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదని అడిగారు.
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై సీఈఓకు వినతిపత్రం
ప్రధాని మోడీ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని సీఈఓ వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకురాలు శోభారాణి మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ రెండు మూడు రోజులుగా మాజీ ప్రధాని పై చిల్లర మాటలు మాట్లాడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఎస్సి, ఎస్టీ, మైనార్టీ వర్గాల వారిని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. నరేంద్రమోడీ వ్యాఖ్యలు సరికాదు. నరేంద్రమోడీ వ్యాఖ్యలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మహిళల తాళిబొట్లు తెంచుతారని మాట్లాడటం సరికాదని శోభా రాణి హితవు పలికారు. మోడీ దేశ ప్రజలందరికి ప్రధాని కాదా? ముస్లిం మైనారిటీలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆమె ధ్వజమెత్తారు. మోడీకి తాళిబొట్టు విలువ తెలియదని, దేశం కోసం తాళిబొట్టును వదులుకున్న వ్యక్తి సోనియాగాంధీ అని ఆమె అన్నారు.
జింబాబ్వే మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. తీవ్ర గాయాలు
భూమ్మీద నూకలు ఉన్నట్లు ఉంది.. అందుకే బతికి బయటపడ్డాడు. చిరుత దాడి చేసినా తీవ్ర గాయాలైనప్పటికీ సేఫ్ గానే ఉన్నాడు. జింబాబ్వే మాజీ క్రికెటర్ గయ్ విటల్.. ట్రెక్కింగ్ చేస్తున్న సమయంలో చిరుత దాడి చేసింది. ఈ ఘటన హరారే సమీపంలోని బఫెలో రేంజ్ లో జరిగింది. ఈ విషయాన్ని తన భార్య హన్నా సోషల్ మీడియా ద్వారా తెలిపింది. తీవ్ర గాయాలైన విటలో ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. విటల్ పై చిరుత దాడి చేయగానే.. వెంటనే హరారేలోని మిల్టన్ పార్క్ హాస్పిటల్ కు తరలించినట్లు హన్నా పేర్కొంది. కాగా.. చిరుత దాడిలో అతని రక్తం చాలా పోయిందని, డాక్టర్లు సర్జరీ చేసినట్లు తెలిపింది. దాడి విషయానికొస్తే.. విటల్ జింబాబ్వేలో సఫారీ నిర్వహిస్తున్నాడు. కాగా.. హ్యూమని ప్రాంతానికి గురువారం ట్రెక్కింగ్ కు వెళ్లిన సమయంలో చిరుత దాడి చేసింది. ట్రెక్కింగ్ కు వెళ్లినప్పుడు తన పెంపుడు కుక్కను కూడా తీసుకెళ్లాడు.
కొత్త రూల్స్ వచ్చేశాయ్.. ఫ్లైట్ క్యాన్సిల్ అయితే ఇకపై..!
విమాన ప్రయాణమన్నా.. ట్రైన్ ప్రయాణాలన్నా.. కొద్ది రోజులు ముందుగానే రిజర్వేషన్ చేయించుకోవాలి. లేదంటే ప్రయాణం సాఫీగా సాగదు. అయితే కొన్ని సార్లు రిజర్వేషన్ అయ్యాక కూడా విమానాలు, ట్రైన్స్ క్యాన్సిల్ అవుతుంటాయి. దీంతో టికెట్ డబ్బులు తిరిగి రావాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెడుతూ అమెరికా కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. ప్రయాణికులపై అదనపు రుసుముల భారాన్ని తగ్గించడం, అనవసర ఫీజుల నుంచి ఉపశమనం కల్పించడంలో భాగంగా అమెరికా కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. విమానాల రద్దు, దారి మళ్లింపు వంటి సమయాల్లో ప్రయాణికుల నుంచి ఎలాంటి అభ్యర్థన లేకుండానే.. సులభతరంగా డబ్బులు రిఫండ్ అయ్యేలా అమెరికా ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. కార్పొరేట్ల అనవసరపు రుసుముల బాదుడు నుంచి కస్టమర్లను రక్షించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ కార్యవర్గం తెలిపింది. కరోనా సమయంలో ఎయిర్‌లైన్స్ సంస్థలు మనీ రిఫండ్ చేసే విషయంలో ఇబ్బందులకు గురి చేశాయి. దీంతో పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. ఇకపై ఇలాంటి తలనొప్పులు రాకుండా ఉండేందుకు బైడెన్ సర్కార్ కొత్త రూల్స్ తీసుకుచ్చింది.
రేపు గన్ పార్క్ దగ్గర వస్తా.. నీకు దమ్ముంటే రా..? రేవంత్ కు హరీష్ రావు మరో సవాల్..
సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు మరో సవాల్ విసిరారు. రేపు ఉదయం 10 గంటలకు గన్ పార్క్ దగ్గర వస్తా అన్నారు. ఆగస్ట్ 15 లోగా రుణమాఫీ చేసేది నిజమైతే.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్నారు. మనమిద్దరం మన రాజీనామా లేఖలని మేధావులకి ఇద్దామన్నారు. నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేస్తే నా రాజీనామా లేఖని స్పీకర్ కి ఇస్తా అన్నారు. నువ్వు చెయ్యకపోతే నీ రాజీనామా లేఖని గవర్నర్ కి ఇస్తానని తెలిపారు. రేవంత్ రెడ్డి నువ్వు సిద్ధమా..నీకు దమ్ముంటే రా..! అని మరో సవాల్ విసిరారు. కొడంగల్ లో తోక ముడిచినట్టే తోక ముడుస్తావా అన్నారు.