రంజాన్ సందర్భంగా షబ్బీర్ అలీ ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి రంజాన్ వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఆహ్వానం మేరకు ఆయన నివాసానికి సీఎం వెళ్లారు. హైదరాబాద్లో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. పుష్ప గుచ్చాలు అందిస్తూ వెల్కమ్ చెప్పారు. షబ్బీర్ అలీ కుటుంబ సభ్యులతో కలిసి…
త్వరలో బండి సంజయ్ అవినీతిని బయటపెడతాం.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందాలని ఆంజనేయ స్వామిని దర్శించుకున్నామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయ స్వామిని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, ఆది శ్రీనివాస్, కవ్వంపెల్లి సత్యనారాయణలు దర్శించుకున్నారు. అనంతరం పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. బండి సంజయ్ రాముని ఫోటోలు పెట్టి రాజకీయం చేయడం సరికాదని.. బండి…
సిద్ధరామయ్యకు ఊహించని పరిమాణం.. తుపాకీతో వ్యక్తి హల్చల్ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం ఎదురైంది. వాహనం పైనుంచి కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ వెళ్తున్న సిద్ధరామయ్య దగ్గరకు ఓ వ్యక్తి నడుముకు తుపాకీ పెట్టుకుని వెళ్లి పూల దండ వేశాడు. ఈ దృశ్యాన్ని చూసిన కార్యకర్తలంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. వాహనంపై ఉన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు, పార్టీ అభ్యర్థులకు పూలదండలు వేసి హల్చల్ చేశాడు. అనంతరం ఆ వ్యక్తి వాహనం దిగి కిందికి వెళ్తుండగా…
చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారు.. చచ్చిన శవాలకు బీజేపీ టాక్స్ వసూల్ చేసారని మంత్రి సీతక్క అన్నారు. భవిష్యత్ బాగుండాలంటే కాంగ్రెస్ ను ఆదరించాలని సూచించారు. పెండింగ్ పనులను అన్నీ పూర్తి చేస్తామన్నారు. జిల్లాను అభివృద్దిలో అగ్రబాగంలో ఉంచుతామన్నారు. దేహాలు ముక్కలు అయినా పర్వాలేదు అని దేశం కోసం పని చేసింది ఇందిరా గాంధీ కుటుంబం అని తెలిపారు. బీజేపి మతాల గురించి తప్ప పనుల గురించి చెప్పరని అన్నారు. మోడీ వచ్చి ఆదిలాబాద్…
నా ప్రత్యర్థి ఎవరో నాకు ఇప్పటికీ తెలియడం లేదు.. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలంలో చేవెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజా ఆశీర్వాద యాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది 5 గ్యారంటీలు కాదు ఐదు మోసాలు, ఐదు అబద్ధాలు అని విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగతంగా లాభ పడి తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అంటూ ఆగ్రహం వ్యక్తం…
అప్పుడు బీఆర్ఎస్ చేసింది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా..! అప్పుడు బీఆర్ఎస్ చేస్తే సరైంది.. ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే తప్పా? స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐసీసీ ప్రతినిధుల పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరామన్నారు. వరంగల్ నుంచి కడియం కావ్యకి పోటీ చేసే అవకాశం కల్పించిన సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలిపారు. మాపై ఉంచిన నమ్మకాన్ని మమ్ము చేయకుండా కాంగ్రెస్…
కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తాం..! కడియం శ్రీహరి, కావ్య ఏక్కడ పోటీ చేసిన డిపాజిట్ రాకుండా చేస్తామని ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వెళ్ళే ఈ కుట్ర ఇవ్వాల్టిది కాదని, అసెంబ్లీ సమావేశంలోనే ఈ కుట్రకు బీజం పడిందన్నారు. మూడు నెలల క్రితమే ఈ కుట్రకు తెర లేసిందన్నారు. రేవంత్ రెడ్డి, కడియం శ్రీహరి భుజం పైనా…
రాష్ట్రంలో నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క నీటి సమస్యే కాదు కరెంట్ సమస్య కూడా నడుస్తుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కేసిఆర్ అంటేనే కాలువలు, చెరువులు నదులు ఆయన లేకపోతే నీటి ఎద్దడి వస్తుందని కేవలం 4 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం నిరూపించిందన్నారు. ప్రభుత్వ చేతగాని తనం వల్ల వచ్చిన కరువుగా దీనిని గుర్తించాలన్నారు. మన…
రంగారెడ్డిలో దారుణం.. ఇద్దరిపై పిచ్చికుక్కల దాడి..! రంగారెడ్డి జిల్లాలో పిచ్చికుక్కల స్వైర విహారం రోజు రోజుకూ ఎక్కువగా మారుతుంది. మంచాల మండలంలో చిన్నపిల్లలపై, మహిళలపై విచక్షణా రహితంగా కుక్కలు దాడి చేస్తున్నాయి. ఉదయం నడుకుంటూ పోతున్న ఓ మహిళ, ఓ బాలుడి పై దాడి చేసి వారిపై కండలు పీక్కుతిన్నాయి. వారిద్దరూ గట్టిగా కేకలు వేయడంతో అక్కడకు స్థానికులు చేరుకుని కుక్కను తరుముతున్న కుక్కలు దాడి మాత్రం ఆపలేదు. ఓ బాలుడి చేతికి, మహిళలకు కాళ్ల కండరాలను…
నేను పార్టీ మారడం లేదు.. క్లారిటీ ఇచ్చిన మాలోత్ కవిత పార్టీ మారడం లేదని మహబూబాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత క్లారిటీ ఇచ్చారు. తనపైన రాజకీయ అత్యర్థులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీ మారను… పోటీలోనే ఉంటానని స్పష్టం చేశారు మాలోతు కవిత. పార్టీ గెలిచే స్థానాల్లో మహబూబాబాద్ ఒకటి అని.. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తానని ఆమె అన్నారు.…