ములుగు జిల్లాలో విషాదం.. నదిలో మునిగి బాలిక మృతి
ములుగు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఎండలు తాళలేక తండ్రి, కూతురు గోదావరి స్నానానికి వెళ్లారు. స్నానం చేస్తుండగా తండ్రి నదిలో మునిగిపో సాగాడు. దీంతో భయాందోళన చెందిన కుమార్తె నిఖిత (14) సాయం చేసేందుకు.. తన తండ్రికి చెయ్యి అందించబోయింది. అంతే ప్రమాదశాత్తు గోదావరిలో మునిగిపోయి ప్రాణాలు వదిలింది. తండ్రి రాజేందర్ మాత్రం ప్రాణాలతో క్షేమంగా బయటపడ్డాడు. మంగపేట (మం) కమలాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ పరిణామంతో తండ్రి షాక్‌కు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు. కళ్లముందే కూతురు చనిపోవడంతో తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ సభ్యులు కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు జగన్..
ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అంటూ ప్రశంసలు కురపించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి.. ఈ రోజు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.. ఈ ప్రచారంలో వైసీపీ లోక్‌సభ అభ్యర్థి విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ప్రతాప్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు. నెల్లూరు పార్లమెంట్ సమన్వయకర్త.. మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్ పై జరిగిన దాడులకు కారకుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడే అని ఆరోపణలు గుప్పించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచిన దగ్గర నుంచి అన్నీ నేర సంస్కృతిలే చంద్రబాబులో ఉన్నాయన్న ఆయన.. రాష్ట్రంలో జరిగిన చాలా హత్యలకు కారణం చంద్రబాబే అని ఆరోపించారు. ఆయన ప్రభుత్వంలో ఎంతమందిని హత్య చేయించాడో అందరికీ తెలుసన్నారు. కానీ, రాజకీయాల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రమే అంటూ ప్రశంసలు కురిపించారు నెల్లూరు లోక్‌సభ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయసాయిరెడ్డి..
పొన్నం వ్యవహారంతో కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారు
పొన్నం వ్యవహార శైలిని చూసి కాంగ్రెస్ నేతలే బెంబేలెత్తుతున్నారని కరీంనగర్ బీజేపీ జాతీయ ప్రధాన కార్మదర్శి ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వేములవాడలో బండి సంజయ్ మాట్లాడుతూ.. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ బండారాన్ని ప్రజలు గమనించారన్నారు. ఎన్నికల్లో ఆ పార్టీ నేతలను నిలదీస్తున్నారని తెలిపారు. అందుకే 6 గ్యారంటీలపై అడిగితే మాట్లాడలేనని సీఎం చెబుతున్నారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చన్నారు. దొంగ వీడియోలతో బీజేపీ ప్రతిష్ట దెబ్బతీసే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. ఓడిపోతామనే భయంతో కాంగ్రెస్ నీచానికి దిగజారుతోందన్నారు. కరీంనగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో కూడా తెల్వదన్నారు. రైతులు, నిరుద్యోగులతో సహా ప్రజలు అల్లాడుతుంటే కనీసం స్పందించని నేత వినోద్ కుమార్ అంటూ మండిపడ్డారు. నాపై పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాని పొన్నం ప్రభాకర్ నా గురించి అవాకులు పేలుతుండటం సిగ్గు చేటన్నారు.
ల్యాండ్ టైటిల్ యాక్ట్‌పై తప్పుడు ప్రచారం.. చట్టపరమైన చర్యలు తీసుకుంటాం..
ల్యాండ్ టైటిల్ యాక్ట్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచనలలతో తీసుకొచ్చిన మోడల్ యాక్ట్ పై అభిప్రాయ సేకరణ మాత్రమే జరుగుతుంది.. ఈ యాక్ట్ అమలు విషయం ఇంకా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. సినీ నటులతో ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారు.. ప్రజల ఆస్తులను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాజేసే ప్రయత్నం చేస్తున్నట్లు చేస్తున్న ప్రచారంపై ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఇక, తప్పడు ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం అమలు చేసే యాక్ట్ పై కూటమిలో ఉన్న టీడీపీ-జనసేన నేతలు.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని సలహా ఇచ్చారు. ఇక, అబద్దాలను ప్రజలకు చెప్పడంలో చంద్రబాబు దిట్టా అంటూ దుయ్యబట్టారు. తణుకు టీడీపీ అభ్యర్థి కూడా సోషల్ మీడియాలో దుర్మర్గమైన రితిలో వ్యవహరిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు.. దున్నపోతూ ఈనీంది అంటే దూడను కట్టేయండి అన్నవిధంగా చంద్రబాబు, అరిమిల్లి రాధాకృష్ణ వ్యవహరిస్తూన్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..
ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం ది.. రాజయ్య కీలక వ్యాఖ్యలు
ఎన్ కౌంటర్ లు చేయించిన చరిత్ర కడియం శ్రీహరి ది అంటూ మాజీ ఎమ్మెల్యే రాజయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. జనగామ జిల్లా జాఫర్ ఘడ్ మండలం కునూర్ లో రాజయ్య మాట్లాడుతూ.. కడియం పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి కుటుంబం శాస్వత రాజకీయ సమాధి కాబోతుందని అన్నారు. ఆ సమాధికి ప్రజలు రాళ్ళు తయారు చేస్తున్నారని తెలిపారు. కడియం శ్రీహరి రాజకీయ ద్రోహి, దళిత ద్రోహి, నకిలీ దళితుడు అంటూ పేర్కొన్నారు. తన బిడ్డకు టికెట్ కోసం ఊసరవెల్లి లా రంగులు మార్చారన్నారు. అభివృద్ది కోసం కాంగ్రెస్ లోకి వెళ్ళిన అని చెప్పడానికి సిగ్గుండాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, బీఆర్ఎస్ లో పది, పది యేండ్ల మంత్రిగా పనిచేసి ఏం అభివృద్ధి చేశావు? అని ప్రశ్నించారు.
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని
రాహుల్ గాంధీ దేశానికి కాబోయే ప్రధాని అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా..మోడీల ఆదేశాల మేరకు గాంధీ భవన్ కి ఢిల్లీ పోలీసులు అని, రాజస్థాన్ లో మోడీ మాట్లాడిన మాటలు ఆధారాలు చూపెట్టాలి..లేదంటే ముక్కు నేలకు రాయాలన్నారు జగ్గా రెడ్డి. ఎన్నికల కమిషన్ బీజేపీ జేబు సంస్థగా వ్యవహరిస్తోందని, మోడీకి ఎందుకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఇవ్వలేదన్నారు జగ్గారెడ్డి. రేవంత్ ని తిడితేనే హరీష్ ని టివి లో చూపిస్తరని .. మట్లాడుతున్నారని, రాహుల్ ప్రధాని అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ల జీవితాల్లో వెలుగులు వస్తాయన్నారు జగ్గారెడ్డి.
చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటి?.. ఒక్కటైనా గుర్తుందా?
ప్రస్తుతం ఉన్న పథకాలన్నీ కొనసాగిస్తామని.. చంద్రబాబుకు ఓటేస్తే నష్టమని.. పథకాలన్నీ ఆపేస్తాడని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు నాయుడు వయసు 75 దాటింది, ఈ జీవితంలో వెన్నుపోట్లు మోసాలతో జీవితం గడిచిపోయిందని.. ఇప్పటికైనా ఆయన జీవితంలో పశ్చాతాపం లేదని జగన్ వ్యాఖ్యానించారు. ఒక్క మంచి లక్షణం కూడా చంద్రబాబులో లేదని విమర్శలు గుప్పించారు. కడప జిల్లాలోని మైదుకూరు ప్రచార సభలో సీఎం జగన్ ప్రసంగించారు. వైసీపీ స్కీముల లిస్టు చదువుతూ ఉంటే చంద్రబాబుకు పిచ్చి కోపం వస్తోందన్నారు. “అవ్వ తాతలకు ఇంటి వద్దకే పెన్షన్ల పంపిణీ… అక్కా చెల్లెమ్మలకు ఆసరా, సున్నా వడ్డీ ఇస్తున్నాం…మహిళలకు రక్షణగా దిశ యాప్… మహిళలకు 50% రిజర్వేషన్…రైతన్నలకు పగటిపూట తొమ్మిది గంటల ఉచిత అందించాం.” అని సీఎం జగన్ తెలిపారు. చంద్రబాబు నీ స్కీమ్‌లు ఏమిటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ స్కాంల మీదగా నడిచే పార్టీ
కాంగ్రెస్ పార్టీ స్కాంల మీదగా నడిచే పార్టీ అని విమర్శించారు బీజేపీఎల్పీ మహేశ్వర్ రెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పథకాల పైన నడిచే పార్టీ బీజేపీ అని ఆయన అన్నారు. 100 రోజుల్లో అరు పథకాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక పథకంమైన అమలు చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రజలకు మోసం చేసి గద్దె నెక్కిన నాయకుడు రేవంత్ అని, ఎన్నికల్లో ప్రజలకు పథకాల ఇస్తామని ఓట్లు దండుకున్నారని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం పై వ్యతిరేకంగా పోరాటం చేసి రైతులకు అండగా ఉంటామన్నారు మహేశ్వర్ రెడ్డి. ఇచ్చిన మాటలకు కట్టుబడే ఉండే పార్టీ బీజేపీ పార్టీ అని, కేంద్రంలో మూడవ సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరం.. – భైంసా లో జరిగిన కుభీర్, భైంసా మండలాల కార్యకర్తల విస్త్రతస్థాయి సమావేశంలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. రిజర్వేషన్ ల విషయంలో కాంగ్రెస్ నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని, కాని మహిళా రిజర్వేషన్ తో పాటు ఉన్నత వర్గాలలో ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం EWS రిజర్వేషన్ ను అమలు పరిచిన ఘన చరిత్ర బీజేపీ పార్టీదే అన్నారు మహేశ్వర్ రెడ్డి. అమిత్ షా వీడియోను మార్ఫింగ్ చేస్తూ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు.
జగనన్న చెప్పిందే చేస్తారు.. చేసేదే చెబుతారు..
ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంలా భావించి ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ జనరంజక పాలన సాగించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని మార్కాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. సోమవారం కొనకనమిట్ల మండలంలోని వింజవర్తిపాడు, దేవిరెడ్డిపల్లి, తూర్పుపల్లె, నాగంపల్లి, నాగంపల్లి ఎస్సీ మాదిగ పాలెం, ఎస్సీ మాల పాలెం, గాజులపల్లి, గాజులపల్లి ఎస్సీ మాదిగపాలెం, ఎస్సీ మాలపాలెం, చినమనగుండం, చినమనగుండం ఎస్సీకాలనీ, బ్రాహ్మణపల్లి, గొట్లగట్టు, నాయుడుపేట, నాయుడుపేట ఎస్సీకాలనీ, వెలుగొండరాయునిపల్లె, బుడంకాయలపాడు గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా రాంబాబు ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో ఏపీఐఐసీ చైర్మన్ జంకే వెంకట రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయా గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం లో ప్రతి కుటుంబానికి లబ్ది చేకూరిందని వివరించి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను అభ్యర్థించారు. మార్కాపురం నియోజకవర్గ అసెంబ్లీ వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అన్నా రాంబాబును, ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఫ్యాన్ గుర్త పై ఓటు వేసి గెలిపించాలన్నారు.
గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయి
ఈ ఎన్నికల్లో మోడీకే వేస్తామని ప్రజలు అంటున్నారు… దేశ భవిష్యత్, మా భవిష్యత్ ముఖ్యం అని అంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ జహీరాబాద్‌లో నిర్వహించిన బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామాలకు గ్రామాలు తీర్మానం చేసుకుంటున్నాయని, బీజేపీ బలపడుతుంటే కాంగ్రెస్, BRS గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయన్నారు కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి మీ పార్టీ వల్ల బీసీ లకు అన్యాయం జరుగుతుంది… గ్రేటర్ కార్పొరేషన్ లో బీసీ లకు 50 సీట్లు ఉంటే అందులో 31 మంది నాన్ బీసీ గెలిచారని ఆయన అన్నారు. ముస్లిం రిజర్వేషన్ ల వల్ల బీసీ లకు అన్యాయం జరిగిందని, తెలంగాణ మీ వెనక ఉందని మోడీ కి తెలుపుదామన్నారు కిషన్ రెడ్డి. దేశంలో, రాష్ట్రంలో ప్రధాని మోడీ హవా కొనసాగుతుందని.. తాము చేసిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయన్నారు.