ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్.. ఎందుకు ప్రశ్నించడం లేదు! జనసేన పార్టీ స్థాపించిందే ప్రశ్నించడానికి అని చెప్పిన పవన్ కళ్యాణ్.. డిప్యూటీ సీఎం అయ్యాక కూడా ప్రశ్నించకుండా ముసిముసి నవ్వులు నవ్వుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ నేత బుగ్గన రాజేంద్రనాథ్ విమర్శించారు. గ్రామాల్లోకి వెళ్ళి చూడండని.. కూల్ డ్రింక్స్ ఎలా దొరుకుతాయో మందు అలానే దొరుకుతుందని ఎద్దేవా చేశారు. ఇంత మద్యం అమ్మిన మూడు శాతమే ఆదాయం ఎందుకు పెరిగిందని.. పది శాతం పెరగాల్సిన ఆదాయం…
జాగ్రత్త! న్యూఇయర్ వేడుకలపై హైదరాబాద్ పోలీసుల ఆంక్షలు.. న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ పోలీసులు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు… డిసెంబర్ 31 అర్ధరాత్రి నుంచి జనవరి 1 వరకు జరిగే వేడుకలపై ఆంక్షలు విధించారు.. వేడుకల కోసం 3 స్టార్ హోటళ్లు, క్లబ్బులు, పబ్లు ముందుగానే అనుమతి తీసుకోవలని పోలీసులు తెలిపారు. వేడుకల నిర్వహణలో సీసీ కెమెరాలు, భద్రతా సిబ్బంది, ట్రాఫిక్ నియంత్రణ తప్పనిసరి అని వెల్లడించారు.. పోలీసులు ప్రకటన ప్రకారం.. రాత్రి 10 గంటల…
గుడ్ న్యూస్.. శబరిమల ప్రసాదం నేరుగా మీ ఇంటికే.. ఎలా బుక్ చేసుకోవాలంటే..? శబరిమలలో మకరవిళక్కు పూజా సీజన్ ప్రారంభం కావడంతో రోజురోజుకూ భక్తుల రద్దీ పెరుగుతోంది. అయ్యప్ప భక్తుల రద్దీని నియంత్రించడానికి ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు వివిధ చర్యలు తీసుకుంటోంది. అలాగే భక్తుల రద్దీకి అనుగుణంగా స్పాట్ బుకింగ్ టోకెన్లను తగ్గిస్తూ, పెంచుతూ వస్తోంది. ఇకపోతే కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అరవణ పాయసం, అప్పం ప్రసాదంగా ఇస్తారు. అయితే ఇప్పుడు ఈ అయ్యప్ప స్వామి…
పేదలకు ఇళ్లు ఇవ్వని కేసీఆర్.. 2 వేల కోట్లతో గడీ మాత్రం కట్టుకున్నాడు.. దేవరకొండలో నిర్వహించిన ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పేదలకు ఇళ్లు ఇవ్వకుండా రూ.2 వేల కోట్లతో గడీ కట్టుకున్నారని కేసీఆర్పై ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంక్షేమం, అభివృద్ధి రెండూ రెండు కళ్లంటూ సీఎం వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కనీసం అనేక పేదల పేర్లు రేషన్…
మరోసారి వైభవ్ సూర్యవంశీ విధ్వంసం.. చరిత్ర సృష్టించిన యువ సంచలనం! భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ మరో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడాడు. సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2025లో బీహార్ తరపున ఆడుతున్న వైభవ్.. ఈరోజు ఈడెన్ గార్డెన్స్లో మహారాష్ట్రపై సెంచరీ చేశాడు. 58 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 100 పరుగులు పూర్తి చేశాడు. అర్షిన్ కులకర్ణి వేసిన 20వ ఓవర్ తొలి బంతికి సిక్స్ కొట్టడం ద్వారా వైభవ్ తన…
సర్పంచ్ పోరుకు కన్నతల్లితోనే పోటీ.. నామినేషన్ దాఖలు చేసిన తల్లీకూతుళ్లు జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం తిమ్మయ్యపల్లిలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. సర్పంచ్ స్థానానికి తల్లీకూతుళ్లు పోటీకి దిగారు. తల్లి గంగవ్వ, కూతురు పల్లెపు సుమ నామినేషన్ దాఖలు చేశారు. తిమ్మయ్యపల్లి సర్పంచ్ స్థానం బీసీ మహిళ రిజర్వ్ చేశారు. పల్లెపు సుమ అదే గ్రామానికి చెందిన అశోక్ను 2017లో ప్రేమ వివాహం చేసుకుంది. దీంతో ఇరు కుటుంబ మధ్య కలహాలు మొదలయ్యాయి. మొన్నటి వరకు…
టీటీడీ కల్తీ నెయ్యి కేసులో బిగ్ ట్విస్ట్.. టీటీడీ కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రారంభంలో ఫిర్యాదు చేసిన అధికారుల పేర్లు కూడా ఇప్పుడు నిందితుల జాబితాలో చేరాయి. ఈ సందర్భంగా సిట్ (SIT) మరో మెమో దాఖలు చేస్తూ మొత్తం 11 మందిని అదనంగా నిందితులుగా నమోదు చేసింది. అయితే, ఈస్ట్ పీఎస్లో కల్తీ నెయ్యి జరిగిందని ఫిర్యాదు చేసిన అప్పటి జీఎం మురళీకృష్ణపై కూడా కేసు నమోదు కావడం పెద్ద చర్చగా…
ప్రపంచానికి శాంతి, శ్రేయస్సును ఇచ్చిన ధ్వజం శిఖరమెక్కింది భారతీయులందరికీ ఈరోజు ముఖ్యమైన రోజు అని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. ప్రధాని మోడీతో కలిసి ఆయోధ్య రామాలయంపై కాషాయ జెండాను మోహన్ భగవత్ ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. ఈరోజు భారతీయుల కల నెరవేరిన రోజు అని పేర్కొన్నారు. రామ మందిరం కోసం ఎంతో మంది త్యాగాలు చేశారని.. ఈరోజు వారి ఆత్మలు సంతోషంగా ఉంటాయని చెప్పారు. మహంత్ రామచంద్ర దాస్ మహారాజ్, వీహెచ్పీ నేత దాల్మియా,…
మెగాస్టార్ చేతుల మీదుగా స్పిరిట్ ప్రారంభం ప్రభాస్ – డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా భారీ చిత్రం ‘స్పిరిట్’ రెగ్యులర్ షూట్ ఎట్టకేలకు ప్రారంభం అయ్యింది. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఎప్పుడెప్పుడు షూట్ మొదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. నేడు ఈ మూవీ భారీ ముహూర్త పూజ కార్యక్రమాలతో అధికారికంగా లాంచ్ అయింది. ఈ ఈవెంట్కు మెగాస్టార్ చిరంజీవి ప్రత్యేక అతిథిగా…
మెట్రో దగ్గర ఫేక్ దందా..పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నకిలీ సిబ్బంది.. ప్రజలను బురిడీ కొట్టించేందుకు.. నకిలీ రాయుళ్లు ఎక్కడిపడితే అక్కడ రెడీగా ఉంటున్నారు. ఢిల్లీలోని జనక్ పురి ఈస్ట్ మెట్రో స్టేషన్ వ్యక్తి.. వాహనదారులను ఆపి డబ్బులు వసూలు చేస్తున్నాడు. దీంతో నకిలీ వసూళ్ల పర్వం బయటపడిపోయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే.. ఇలాంటి బురీడీ రాయుళ్లు ప్రతినిత్యం మనకు ఎక్కడో ఓ చోట తారసపడుతుంటారు. ప్రతి ఒక్క…