తొలి చిత్రం 'టాప్ గేర్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె. శశికాంత్ ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమౌతున్నాడు. ఓ ప్రముఖ కథానాయకుడి కోసం శశికాంత్ కథను తయారు చేస్తున్నాడు.
ఈ యేడాది లాస్ట్ వీకెండ్ లో ఏకంగా పది సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అందులో ఎనిమిది స్ట్రయిట్ సినిమాలు కాగా రెండు అనువాద చిత్రాలు. ఇందులో అనుపమా పరమేశ్వరన్ నటించిన 'బట్టర్ ఫ్లై' మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
విలక్షణ నటుడు ‘సాయి కుమార్’ కొడుకు ‘ఆది సాయి కుమార్’ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టాప్ గేర్’. శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో ‘రియా సుమన్’ హీరోయిన్ గా నటిస్తోంది. డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకి రానున్న ‘టాప్ గేర్’ ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, ఈ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. మాస్ మహారాజ రవితేజ రిలీజ్ చేసిన ‘టాప్ గేర్’ ట్రైలర్ యాక్షన్ మోడ్ లో ఉంది.…
సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రాలు ఈ యేడాది ఇప్పటికే నాలుగు జనం ముందుకు వచ్చాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో 'సి.ఎస్.ఐ. సనాతన్' రాబోతుండగా, 30వ తేదీ 'టాప్ గేర్' వస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ యేడాది ఆది నటించిన చిత్రాలు ఆరు విడుదలవుతున్నట్టు!
వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది మరికొద్ది రోజుల్లో 'టాప్ గేర్' అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘అతిథి దేవో భవ’, ‘బ్లాక్’ చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా మరో నాలుగైదు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు. ఈ సినిమా పేరే ‘టాప్ గేర్’. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని…