Top Gear: తుపాకీ పట్టిన టాక్సీ డ్రైవర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Top Gear: వరుస సినిమాలతో ప్రామిసింగ్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు ఆది సాయికుమార్. ప్రస్తుతం వివిధ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్న ఆది మరికొద్ది రోజుల్లో ‘టాప్ గేర్’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఆదిత్య మూవీస్ & ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో కె.వి. రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ టచ్ చేస్తూ రూపొందిస్తున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్ టాక్సీ డ్రైవర్‌గా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాతో ఆది సాయి కుమార్ కెరీర్ టాప్ గేర్ పడినట్లేనని, ఇందులో అతను చేసే యాక్షన్స్ సీన్స్ సైతం మాస్ ను అలరిస్తాయని మేకర్స్ చెబుతున్నారు.
Chiranjeevi : ఆయన లేకుంటే.. ఇదంతా సాధ్యమయ్యేది కాదు..
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, ”ఇప్పటికే మా సినిమా నుంచి విడుదలైన టైటిల్ లుక్, ఫస్ట్ లుక్ పోస్టర్ లకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మోషన్ పోస్టర్ లో ఆది సాయి కుమార్ కారు నడుపుతున్నట్లు చూపించి యాక్షన్ మోడ్ తో ఆకట్టుకున్నాం. ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్, విజువల్స్ హైలైట్ అయ్యాయి. మూవీ ప్రమోషన్స్ భిన్నంగా చేయాలనే, తొలిసారి త్రీడీ వర్షన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందాం” అని అన్నారు. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశలో ఉన్నాయి. అతి త్వరలో ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు మేకర్స్. రియా సుమన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ మూవీస్ కు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయన” లాంటి సూపర్ హిట్ మూవీస్ కు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ చిత్రానికి కూర్పరి. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, చమ్మక్ చంద్ర, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ఇందులో ఇతర పాత్రలు పోషిస్తున్నారు.

తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!