Adi Saikumar: కెరీర్ ను ‘టాప్ గేర్’లో వేస్తున్న యంగ్ హీరో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘అతిథి దేవో భవ’, ‘బ్లాక్’ చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా మరో నాలుగైదు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే ఆది సాయి కుమార్ తాజాగా మరో సినిమాను లైన్‌లో పెట్టేశాడు. ఈ సినిమా పేరే ‘టాప్ గేర్’. తాజాగా ఈ సినిమా టైటిల్ లాంచ్ హైదరాబాద్ లోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో ఘనంగా నిర్వహించారు. వేలాది మంది స్టూడెంట్స్ నడుమ ఈ టైటిల్ లోగో లాంచ్ చేయడం విశేషం. టైటిల్ లుక్ చూస్తుంటే ఈ సినిమాలో అన్ని వర్గాల ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే ఓ డిఫరెంట్ పాయింట్ చూపించబోతున్నారని స్పష్టమవుతోంది. ఈ సినిమా తన కెరీర్ లో ఎంతో ప్రత్యేకం కానుందని హీరో ఆది సాయి కుమార్ చెప్పడం సినిమాపై అంచనాలు పెంచేసింది.
Also Read

ఆదిత్య మూవీస్ &ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అన్ని హంగులతో ఈ ‘టాప్ గేర్’ సినిమా రాబోతోంది. రియా సుమన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శశికాంత్ దర్శకత్వంలో కె. వి. శ్రీధర్ రెడ్డి నిర్మిస్తున్నారు. గిరిధర్ మామిడిపల్లి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. పలు సూపర్ హిట్ సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా సేవలందించిన సాయి శ్రీరామ్ ఈ సినిమా కోసం పని చేస్తున్నారు. హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్నారు. ”జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, మనం, సోగ్గాడే చిన్నినాయనా” లాంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పని చేసిన ప్రవీణ్ పూడి ఈ మూవీ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. బ్రహ్మాజీ, సత్యం రాజేష్, మైమ్ గోపి, నర్రా, శత్రు, బెనర్జీ, గిరిధర్, రేడియో మిర్చి హేమంత్ తదితరులు ‘టాప్ గేర్’ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజావార్తలు
-
CJP vs Congress: ‘‘బీజేపీ కన్నా దారుణం’’.. సీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం.!
-
RC 17: సుకుమార్ ట్రాక్ రికార్డ్.. చరణ్ ఫాన్స్ కి కొత్త టెన్షన్!
-
Harish Rao : సీఎం రేవంత్‌పై హరీశ్ రావు ఫైర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై సవాల్
-
CJP: ‘‘రక్షణ కవచాలు’’గా మైనర్లు.. CJP నిరసనలపై NHRC నోటీసులు..
-
Flydubai Terror Attack: ‘‘ఇది టెర్రర్ అటాక్’’.. ఫ్లైదుబాయ్ ఘటనపై యూఏఈ కీలక ప్రకటన!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!