ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ తన 96వ చిత్రాన్ని మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ తో చేస్తోంది. ‘టాప్ గేర్’ అనే పేరుతో ఈ సినిమాను సుధీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్ పోస్టర్ నూ చిత్ర నిర్మాతలు విడుదల చేశారు. అందులో ఫహద్ లుంగీ కట్టుకుని జీపుపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ కనిపించాడు. ఈ పోస్టర్ బట్టీ ఇది మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ అనే భావన కలుగుతోంది. ఆర్.బి.
చౌదరి సమర్పణలో అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితం కానున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ శుక్రవారం నుండి మొదలు కానుంది. ఇప్పటికే పలు అనువాద చిత్రాలతో తెలుగులోనూ తనకంటూ ఓ క్రేజ్ ను సంపాదించుకున్న ఫహద్ కు ‘పుష్ప’ మూవీ తర్వాత అభిమానులు మరింత పెరిగారు