తెలుగులో త్వరలో రాబోతున్న సినిమాలను, సెట్స్ పైకి వెళ్ళబోతున్న చిత్రాలను ఒకసారి గమనించండి… మీకో యూనిక్ పాయింట్ కనిపిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి నుండి నవతరం హీరోల వరకూ అందరూ పరభాషా దర్శకులవైపు మొగ్గు చూపుతున్నారు. మాతృకను డైరెక్ట్ చేశారనే కారణంగా కొందరికి ఇక్కడ అవకాశం ఇస్తుంటే… మన హీరోలను భిన్నంగా తెరపై ప్రజెంట్ చేస్తారనే నమ్మకంతో మరికొందరు ఛాన్స్ పొందుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ తర్వాత చేయబోతున్న సినిమా ‘లూసిఫర్’. నిజానికి మలయాళంలో దీనిని నటుడు పృథ్వీరాజ్…
సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. వర్ధమాన సినీ దర్శకుడు వట్టి కుమార్(38) కోవిడ్ తో మృతి చెందారు. రాగోలు జెమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి వట్టి కుమార్ మరణించారు. కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడ్డ వట్టి కుమార్.. ఇటీవల ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆయన పరిస్థితి విషమించడంతో ఇవాళ తుదిశ్వాస విడిచాడు వట్టి కుమార్. వట్టి కుమార్ స్వస్థం శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట. ఇది ఇలా ఉండగా…‘మా అబ్బాయి’ చిత్రానికి దర్శకత్వం వహించిన…
సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ఇప్పటికే చాలా మంది ప్రముఖులను కోల్పోయిన సినీ పరిశ్రమ.. తాజాగా మరో దర్శకున్ని కోల్పోయింది. టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ దర్శకుడు కెవి ఆనంద్ మృతి చెందారు. ఇవాళ ఉదయం 3:30 సమయంలో హార్ట్ ఎటాక్ కారణంగా ఆయన మరణించారు. ఒక్క క్షణం, ఎక్కడికి పొతావు చిన్న వాడా, డిస్కో రాజా లాంటి సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించారు కెవి ఆనంద్. కెవి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన…
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రముఖ నటుడు పొట్టి వీరయ్య ఆదివారం సాయంత్రం గుండెపోటుతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో కన్నుమూశారు. దక్షిణాది భాషల్లో దాదాపు 500 చిత్రాలలో ఆయన నటించారు. సోమవారం పొట్టి వీరయ్య అంత్యక్రియలు మహాప్రస్థానంలో జరుగబోతున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. నల్గొండ జిల్లా సూర్యాపేట తాలూకా తిరమలగిరి మండలం ఫణిగిరి ఆయన స్వగ్రామం. గట్టు సింహాద్రయ్య, నరసమ్మలకు జన్మించిన వీరయ్య హెచ్.ఎస్.సి. వరకూ చదువుకున్నారు. హైస్కూల్ రోజుల నుండే నటనమీద మక్కువతో నాటకాలు…
ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే థియేటర్ల ఆక్యుపెన్సీని 50 శాతానికి కుదించారు. తెలంగాణాలో రాత్రి కర్ఫ్యూ ఉన్న కారణంగా సెకండ్ షోస్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో పలు చిత్రాల విడుదల వాయిదా పడింది. దాంతో తెలంగాణలో థియేటర్లను ఈ నెలాఖరు వరకూ మూసేయాలనే నిర్ణయం వాటి యాజమాన్యం స్వచ్ఛందంగా తీసుకుందని, అయితే ‘వకీల్ సాబ్’ మాత్రం రెండు రోజులు ప్రదర్శిస్తారని వార్తలు వచ్చాయి. కానీ ఈ నిర్ణయంతో కొందరు థియేటర్ల యజమానులు విభేదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే……
గత యేడాది మార్చిలో కరోనా వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వమే లాక్ డౌన్ ప్రకటించడంతో కాస్తంత త్వరగా మేలుకున్న సినిమా రంగం థియేటర్లను, షూటింగ్స్ ను ఆపేసింది. ప్రభుత్వమే పరిస్థితులు కొంతమేరకు చక్కబడ్డాక అన్ లాక్ పేరుతో ఒక్కో రంగానికీ వెసులు బాటు కల్పించింది. ఆ రకంగా జూలైలో పలు జాగ్రత్తలతో షూటింగ్స్ మొదలు కాగా, డిసెంబర్ లో థియేటర్లు తెరుచుకున్నాయి. ఇక ఫిబ్రవరి మొదటివారంలో నూరు శాతం ఆక్యుపెన్సీకి అనుమతి లభించింది. కానీ ఈ తతంగం అంతా…
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ ఈ వైరస్ విలయం కొనసాగుతూనే ఉంది. అటు ఇప్పటికే రాజకీయ నాయకులకు, సినిమా స్టార్లకు, ప్రముఖులకు కరోనా సోకింది. ముఖ్యంగా సినిమా పరిశ్రమలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. దీంతో షూటింగ్ లు ఆగిపోతున్నాయి. తాజాగా స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడికి కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన…
మన స్టార్ హీరోయిన్స్ సినిమాల్లోనే కాదు ఓటీటీలలోనూ దుమ్ము రేపటానికి సిద్ధం అయ్యారు. పలువురు తారలు డిజిటల్ ఎంట్రీ ఇచ్చేశారు. వారిలో కొందరు సక్సెస్ అయితే మరి కొందరు ఫెయిల్ అయ్యారు. ఇంకొందరు రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. మన దక్షిణాది తారలను తీసుకుంటే సమంత, కాజల్, తమన్నా, శ్రుతిహాసన్, నిత్యామీనన్, ప్రియమణి, అమలాపాల్, పాయల్, ఇషా రెబ్బ, అషిమా వంటి తారలు వెబ్ ఎంట్రీ ఇచ్చారు. కాజల్ ‘లైవ్ టెలికాస్ట్’ అనే వెబ్ సీరీస్ లో నటించింది.…
ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి కుమారుడు శివ కందుకూరి ‘చూసి చూడంగానే’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అతను కీలక పాత్ర పోషించిన ‘గమనం’ పాన్ ఇండియా మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘మనుచరిత్ర’, ‘చేతక్ శీను’ చిత్రాలలో కథానాయకుడిగా శివ కందుకూరి నటిస్తున్నాడు. తాజాగా అతనితో సినిమాను నిర్మించబోతున్నట్టు యువ వ్యాపారవేత్త సురేశ్ రెడ్డి కొవ్వూరి ప్రకటించారు. పి19 ఎంటర్ టైన్ మెంట్ లో ప్రొడక్షన్ నంబర్ 1గా తెరకెక్కుతోన్న ఈ…
ఎన్టీయార్ 30వ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రాగానే ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఈ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నిజానికి హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ లో ఎన్టీయార్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఈ సినిమా రావాల్సింది. కథానుగుణంగా ఈ చిత్రానికి ‘అయిననూ పోయి రావలె హస్తినకు’ అనే టైటిల్ పెట్టబోతున్నారనీ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ఎన్టీయార్ 30వ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నట్టు తాజా ప్రకటన వెలువడింది.…