స్టార్ డైరెక్టర్ సుకుమార్‌కు మాజీ ఎంపీ హర్షకుమార్ ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన సొంతూరు దగ్గరలో ఉన్న రాజోలులో 40 లక్షల రూపాయలతో ఆక్సిజన్ ఉత్పాదన కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. తన తండ్రి బండ్రెడ్డి తిరుపతి నాయుడు జ్ఞాపకార్థం సుకుమార్ ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టిన డైరెక్టర్ సుకుమార్‌ను మాజీ ఎంపీ హర్షకుమార్ అభినందించారు. బుధవారం సాయంత్రం సుకుమార్‌కు ఫోన్ చేసి కృతజ్ఞతలు తెలిపారు. అంతేకాకుండా…
ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో వచ్చిన సినిమాలు, అది మరో బ్యానర్ తో కలిసి నిర్మించిన చిత్రాలు మంచి విజయాలను సాధించాయి. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ తీయడంలోనూ యూవీ క్రియేషన్స్ కు మంచి పేరే ఉంది. అలాంటి ఆ సంస్థ నుండి యూవీ కాన్సెప్ట్ పేరుతో మరో కొత్త బ్యానర్ పెట్టినప్పుడే జనాలకు ఇదేదో సమ్ థింగ్ స్పెషల్ అనే భావన కలిగింది. ఆ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రమే ‘ఏక్…
చిత్రసీమలో కొన్ని కాంబినేషన్స్ కు సూపర్ క్రేజ్ ఉంటుంది. వరుస విజయాలను పొందిన ఈ కాంబినేషన్స్ రిపీట్ అవుతుంటే ఇటు ప్రొడ్యూసర్స్ కు, అటు ఫ్యాన్స్ కూ కూడా ఆనందంగానే ఉంటుంది. పైగా ఒక ప్రాజెక్ట్ ను మించి మరో ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతుంటాయి. అలా బాలకృష్ణ – బోయపాటి శీనుది సూపర్ హిట్ కాంబినేషన్. బాలకృష్ణతో ‘సింహా’, ‘లెజెండ్’ లాంటి సూపర్ సెన్సేషనల్ మూవీస్ చేసిన బోయపాటి ఇప్పుడు ‘అఖండ’ మూవీ డైరెక్ట్ చేస్తున్నాడు.…
‘అంగుళం అదనంగా ఉంటే అందరినీ ఆడించేవాడు’ అంటూ చంద్రమోహన్ ను గురించి ఓ వేదికపై అక్కినేని నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అయితేనేమీ ‘మహా గట్టివాడు’ అంటూ కితాబునిచ్చారు.చంద్రమోహన్ అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర రావు. చదివింది అగ్రికల్చర్ బి.ఎస్సీ, చదువుకొనే రోజుల నుంచీ నాటకాలు వేయడంలో దిట్ట. అదే పట్టుతో చదివిన చదువుకు తగ్గ ఉద్యోగం చేయకుండా చిత్రసీమవైపు పరుగు తీశారు. ఆరంభంలోనే బి.యన్.రెడ్డి వంటి మేటి దర్శకుని దృష్టిలో పడ్డారు. ఆయనే చంద్రమోహన్ అని నామకరణం చేశారు.…
నేడు దర్శకేంద్రుడుగా జేజేలు అందుకుంటున్న కె.రాఘవేంద్రరావు తెరపై చేసిన చిత్రవిచిత్ర ఇంద్రజాలాన్ని ఎవరూ మరచిపోలేరు. తొలి చిత్రం ‘బాబు’ మొదలుకొని మొన్నటి ‘ఓం నమో వేంకటేశాయ’ వరకు రాఘవేంద్రుని చిత్రాల్లోని పాటలు పరవశింప చేశాయి. పాటల చిత్రీకరణలో రాఘవేంద్రుని జాలమే ఆయనను దర్శకేంద్రునిగా నిలిపిందని చెప్పవచ్చు. “కామికాని వాడు మోక్షగామి కాడు” అన్న సూత్రాన్ని రాఘవేంద్రరావు తు.చ.తప్పక అనుసరించారనిపిస్తుంది. ‘అన్నమయ్య’ చిత్రం తీసి జనాన్ని మెప్పించిన రాఘవేంద్రుడు ఆ కవిపుంగవునిలాగే ఓ వైపు శృంగారాన్ని, మరోవైపు ఆధ్యాత్మికతను…
‘ఆర్ఆర్ఆర్’… నిస్సందేహంగా ప్రస్తుతం దేశం మొత్తంలో సెట్స్ పై ఉన్న చిత్రాల్లో అత్యంత క్రేజీ ప్రాజెక్ట్! దర్శకుడు రాజమౌళి… హీరోలు ఎన్టీఆర్, చరణ్. హాలీవుడ్ బ్యూటీతో పాటూ ఆలియా లాంటి టాప్ బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్. అజయ్ దేవగణ్ లాంటి సీనియర్ స్టార్స్ కూడా ‘ఆర్ఆర్ఆర్’లో భాగం! ఇంత వ్యవహారం ఉంది కాబట్టే జక్కన్న మల్టీ స్టారర్ ఎప్పుడు వస్తుందా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, కరోనా, లాక్ డౌన్స్ అంతకంతకూ ఆలస్యం చేస్తున్నాయి. అయినా…
రశ్మిక సౌత్ నుంచీ నార్త్ వైపు రాకెట్ లా దూసుకుపోతోంది. కన్నడలో మొదలైన ఈ బెంగుళూరు బ్యూటీ పయనం ఇప్పుడు తెలుగు, తమిళం మీదుగా హిందీకి చేరింది. తమిళంలో కార్తి, తెలుగులో మహేశ్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోలతో రొమాన్స్ చేసిన మిస్ మందణ్ణా బాలీవుడ్ లోనూ క్రేజీ ఆఫర్లే కొట్టేస్తోంది. ఓ వీడియో సాంగ్ తో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఇప్పుడు ‘సరిలేరు నాకెవ్వరూ’ అన్నట్టుగా సినిమా ఆఫర్లతో దూసుకుపోతోంది! రశ్మిక శాండల్…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎ.ఎం. రత్నం నిర్మిస్తున్న హరి హర వీరమల్లు మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. క్రిష్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్. దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్న ఈ మూవీకి సంబంధించిన అనేక కీలక సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలోని సెట్స్ వేసి తీస్తున్నారు. దానికి తోడు ఇది పిరియాడికల్ డ్రామా కావడంతో పోర్ట్ సెట్స్ ను గ్రాఫిక్ తో డిజైన్ చేయబోతున్నారు.…