‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ ను సంపాదించుకున్నాడు యష్. ఆఒక్క చిత్రంతో రాకీభాయ్ క్రేజ్ పెరిగిపోయింది. కాగా అమధ్యే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి చేసి నెలలు గడుస్తున్న రాకీభాయ్ చేయబోయే తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ రావడంతో పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేశాడు యష్. అయితే రీసెంట్ గా టాలీవుడ్ అగ్ర నిర్మాతతో యష్ చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. దర్శకుడు ఎవరనేది క్లారిటీ లేకున్నా యష్ తో మరోసారి పాన్ ఇండియా సినిమా ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడట. మరోవైపు శాండల్ వుడ్ లోనే యాష్ సినిమా వుండనుందని.. పూర్తి స్థాయి యాక్షన్ థ్రిల్లర్ మూవీగా రానుందని సమాచారం. మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటించనుందనే ప్రచారం కూడా జరుగుతోంది.