సాయికుమార్ తనయుడు ఆది హీరోగా శ్రీనివాస్ నాయుడు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శశి’. ఇందులో సురభి, రాశీసింగ్ హీరోయిన్స్. ఈ నెల 19న విడుదల కాబోతున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘ఒకే ఒక లోకం’ పాట విడుదలై సూపర్ హిట్ అయింది. ఈ సినిమా ట్రైలర్ ను 10 తేదీ ఉదయం పదిగంటల పది నిమిషాలకు పవన్ కళ్యాణ్ విడుదల చేయనున్నారు. రాజీవ్ కనకాల, అజయ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి అరుణ్…
మాస్ మహారాజ రవితేజ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్రాక్ సినిమాతో రవితేజ కెరీర్ హిట్ అందుకున్నారు. అదే జోరుతో తాజాగా ఖిలాడి సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో డింపుల్ హయాతి, అమృతా అయ్యర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే రవితేజ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా రవితేజ 68 గా ప్రచారం అవుతోంది. ఈ చిత్రాన్ని దర్వకుడు…
సూపర్ స్టార్ మహేష్ కొత్త సినిమాను విడుదల చేసి ఏడాది అవుతుంది. ఆ గ్యాప్‌ను కవర్ చేయాలని మహేష్ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. వరుస సినిమాలను ఓకే చేస్తూ మహేష్ దూకుడు కనబరుస్తున్నారు. ప్రస్తుతం మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమా బ్యాంక్ కుంభకోణం నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఈసినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్ తన సినిమాను రాజమౌళితో చేయనున్నారంట. వీరి కాంబోలో…
సంక్రాంతి తర్వాత మళ్ళీ బాక్సాఫీస్ బరిలో ఆసక్తికరమైన పోరుకు శివరాత్రి పండగ వేదిక కాబోతోంది. మార్చి 11న శివరాత్రి కానుకగా ఏకంగా 7 సినిమాలు విడుదల కాబోతున్నాయి. గడిచిన రెండు నెలల్లో కొన్ని వారాల్లో తొమ్మిది, పది సినిమాలు విడుదలైనా… ఒకటి రెండు మినహా అందులో మిగిలినవన్నీ చిన్న సినిమాలే ఉండేవి. కానీ రాబోయే శివరాత్రి రోజున మూడు మీడియం బడ్జెట్ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడబోతున్నాయి. వీటిని ప్రముఖ వ్యక్తులు నిర్మిస్తుండంతో అందరి దృష్టీ…
బాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాల హవా కనుమరుగవుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు ప్రతి సినిమాలో ఇద్దరు ముగ్గురు హీరోలు కలిసి చేశారు. కానీ ఇప్పుడు మాత్రం ఏడాదికి ఒక్కటి వస్తే గొప్ప. సరైన కథ కుదరకనో, హీరోల మధ్య విభేధాల కారణంగానో తెలియదు కానీ మల్టీస్టారర్ సినిమాలు రావడం మాత్రం తగ్గిపోయింది. అయితే మన ఇండస్ట్రీలో మాత్రం మళ్లీ మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కడం మొదలైంది. ఇద్దరు స్టార్ హీరోలతో భారీ సినిమా తెరకెక్కించేందుకు ఇక్కడి హీరోలు, దర్శకుడు, నిర్మాతలు అందరూ…
ప్రతి శుక్రవారం ఏదో ఒక కొత్త సినిమాతో తన వ్యూవర్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది ఆహా! తాజాగా అలా ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతున్న సినిమా ‘నారింజ మిఠాయి’. 2019 డిసెంబర్ లో ‘సిల్లు కరుప్పత్తి’ అనే తమిళ మూవీ రిలీజ్ అయ్యింది. ఆ తర్వాత అది నెట్ ఫ్లిక్స్ లోనూ స్ట్రీమింగ్ అయ్యింది. దాని తెలుగు వర్షనే ‘నారంజ మిఠాయి’. సహజంగా ఆంథాలజీ అనగానే ఎన్ని భాగాలు ఉంటే… అంతమంది దర్శకత్వం చేయడం మనం చూస్తున్నాం.…
మెగా ఫ్యామిలీ నుండి ఓ కొత్త హీరో వస్తున్నాడంటే భారీ అంచనాలు ఏర్పడటం సహజం. అది ‘ఉప్పెన’ విషయంలో భారీ నుండి అతి భారీకి చేరుకుంది. కారణం దానిని నిర్మిస్తోంది ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ కావడం, దర్శకత్వం వహించిన సానా బుచ్చిబాబు ప్రముఖ దర్శకుడు సుకుమార్ శిష్యుడు కావడం! అలానే బాల నటుడిగా చేసింది రెండు మూడు సినిమాలే అయినా క్యూట్ గా ఉండే వైష్ణవ్ ఫస్ట్ టైమ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడం,…
పేరుకు ముందు తొలి చిత్రం పేరు ‘అల్లరి’ని ఏ ముహూర్తాన పెట్టుకున్నాడో కానీ నరేశ్ కు అన్నీ అల్లరి చిల్లరి వినోదాత్మక చిత్రాలే వచ్చాయి. ఇంతవరకూ నరేశ్ నటించిన 57 సినిమాల్లో పై ఏడు సినిమాల్లో కొంత భిన్నమైన పాత్రలను నరేశ్ చేశాడనిపిస్తుంది. ఆ కోవలో వచ్చిన మరో చిత్రం ‘నాంది’. కామెడీ హీరోగా ముద్ర పడిన నరేశ్ లోకి నటుడిని వెలికి తీసిన చిత్రాల సరసన ‘నాంది’ సైతం నిలబడుతుంది. విజయ్ కనకమేడల ను దర్శకుడిగా…
కొన్ని రీమేక్స్ జోలికి పోకపోతే మంచింది. పైగా కన్నడ రీమేక్స్ ను టేకప్ చేయడం అంత రిస్క్ మరొకటి ఉండదు. అక్కడ విజయం సాధించిన చాలా చిత్రాల తెలుగు రీమేక్స్ లో పరాజయాల శాతమే ఎక్కువ. దానికి బోలెడు ఉదాహరణలున్నాయి. ఇక తాజాగా ‘కావలదారి’ కన్నడ చిత్రం రీమేక్ గా తెలుగులో ‘కపటధారి’గా రీమేక్ అయ్యింది. ఎలా ఉందో తెలుసుకుందాం. 1977వ సంవత్సరం వరంగల్ సమీపంలో జరిపిన తవ్వకాలలో ఆర్కియాలజీ డిపార్ట్ మెంట్ వారికి కాకతీయుల కాలం…
గత యేడాది ఇదే ఫిబ్రవరి నెల 21న విడుదలైన ‘భీష్మ’ మూవీ నితిన్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కించింది. ఆ తర్వాత కరోనా కారణంగా థియేటర్లు మూత పడటంతో ఆ సినిమా సూపర్ హిట్ రేంజ్ కు వెళ్ళకుండానే ఆగిపోయింది. అయితే దాని కంటే ముందే నితిన్ పలు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. నిజానికి అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే లాస్ట్ ఇయర్ నితిన్ నటించిన మూడు నాలుగు సినిమాలు విడుదలై ఉండేవి. కానీ కరోనా…