యంగ్ హీరో అల్లు శిరీష్ హోమ్ ఐసొలేషన్ సందర్భంగా తన ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి జిమ్ లో రెగ్యులర్ గా కఠినమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో కండలు తిరిగిన దేహాన్ని సిద్ధం చేస్తున్నాడు. దీనికి సంబంధించిన కొన్ని పిక్స్ సోషల్ మీడియాలో పోస్ల్ చేశాడు. ఇతగాడి బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దీని కోసం వర్క్ఔట్స్ చేయడమే కాకుండా పర్ఫెక్ట్ డైట్ మెయింటైన్ చేస్తున్నాడు అల్లు శిరీష్. ‘గౌరవం’ సినిమాతో హీరోగా…
కరోనా మహమ్మారి టాలీవుడ్లో విషాదం నింపుతోంది. తాజాగా ప్రముఖ మేకప్ మెన్ గంగాధర్ కరోనా బారిన పడి మరణించారు. దాదాపు పాతికేళ్లకు పైగా ఇండస్ట్రీలో ఉంటూ ఎన్నో సినిమాలకు మేకప్ మేన్‌గా పని చేసిన గంగాధర్ మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హీరో శివాజీకి వ్యక్తిగత మేకప్ మెన్ గా, లక్కీ మీడియా నిర్మాణ సంస్థలో చీఫ్ మేకప్ మెన్ గానూ పనిచేసిన ఆయన.. నంది అవార్డు కూడా అందుకున్నాడు. తెలుగు, తమిళం, కన్నడతో…
మన స్టార్ హీరోలు తమ తదుపరి సినిమాలను కమిట్ అయ్యే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కరోనా తర్వాత ఎక్కువ శాతం మంది పాన్ ఇండియా సినిమాలపై ఫోకస్ పెంచుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ సైతం దానికి అనుగుణంగా పావులు కదుపుతున్నాడు. ప్రస్తుతం రాజమౌళితో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్న ఎన్టీఆర్ ఆ తర్వాత కొరటాల శివ సినిమా చేయబోతున్నాడు. అంతే కాదు ఆ తర్వాత కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా స్థాయి సినిమా కమిట్…
‘క్రాక్’తో ఈ ఏడాది హిట్ కొట్టాడు దర్శకడు మలినేని గోపీచంద్. రవితేజ నటించిన ఈ సినిమా కరోనా ఫస్ట్ వేవ్ తర్వాత టాలీవుడ్ కి మంచి ఊపును ఇచ్చింది. అందులో హీరోయిన్ శ్రుతిహాసన్. తన తాజా చిత్రం లోనూ శ్రుతిహాసన్ నే రిపీట్ చేయబోతున్నాడట మలినేని గోపీచంద్. ‘క్రాక్’ హిట్ తో ఏకంగా బాలకృష్ణతో సినిమా చేసే ఛాన్స్ పట్టేశాడు గోపి. మైత్రీమూవీస్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. సినిమాను లాంఛనంగా అరంభించారు కూడా. ‘డాన్ శీను,…
నటుడు, జర్నలిస్టు టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు. మెగాస్టార్ చిరంజీవి అంటే అభిమానంతో సినిమా రంగానికి వచ్చిన టీఎన్ఆర్ తనదైన మార్గాన్ని ఎంచుకుని ఎదిగారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్టార్ చిరంజీవి తన దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం టీఎన్ఆర్ భార్యా పిల్లలకు ఫోన్ చేసి పరామర్శించారు. దాంతోపాటు లక్షరూపాయల తక్షణ ఖర్చుల కోసం సాయం అందజేశారు.టీఎన్ఆర్ చేసిన ఎన్నో ఇంటర్వ్యూలు తాను చూశానని, తను…
ప్రముఖ నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇటీవల కరోనా పాజిటీవ్ రావటంతో పవన్ ఐసోలేషన్ లోకి వెళ్ళి ఫామ్ హౌస్ కే పరిమితం అయ్యారు. మూడు రోజుల క్రితం పవన్ ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్స్ బృందం ఆర్.టి.పి.సి.ఆర్ పరీక్షలు నిర్వహించింది. అందులో నెగెటీవ్ వచ్చిందని అయితే కరోనా తర్వాత పవన్ కొద్దిగా వీక్ గా ఉన్నారని ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని డాక్టర్ల బృదం తెలిపింది. అయితే…