ఆర్య, ఆండ్రియా, రాశీఖన్నా హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘అరణ్మనై-3’. ఈ సినిమా మొదటి రెండు భాగాలు తెలుగులోనూ డబ్ అయ్యి విడుదలయ్యాయి. సుందర్ సి దర్శకత్వంలో ఆయన భార్య ఖుష్బూ నిర్మించిన ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికెట్ పొందింది. ‘అరణ్మనై-3’ షూటింగ్ చాలా కాలం క్రితమే పూర్తయినా, కరోనా పేండమిక్ సిట్యుయేషన్ కారణంగా దీని విడుదలను దర్శక నిర్మాతలు…
డ్రగ్స్ కేసులో సినీ నటులను ప్రశ్నిస్తున్న ఈడీ ఏం తేల్చింది? గంటలకొద్దీ సాగుతున్న క్వశ్చన్ అవర్లో ఎలాంటి సిత్రాలు జరుగుతున్నాయి? వందల కొద్దీ ప్రశ్నలకు జవాబులు లభిస్తున్నాయా? చివర్లో నటీనటులను ఏ విషయంలో ఈడీ అధికారులు ప్రత్యేకంగా రిక్వస్ట్ చేస్తున్నారు? ఈడీ అధికారుల అనుమానాలకు ఆధారాలు దొరికాయా? డ్రగ్స్ కేసులో హైదరాబాద్లోని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కార్యాలయానికి హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు క్యూ కట్టారు. విచారణ పేరుతో గంటల కొద్దీ కబడ్డీ ఆడుతోంది ఈడీ. నోటీసులు అందుకున్నవారు ఇప్పటి…
‘జాతిరత్నాలు’తో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నవీన్ పొలిశెట్టి తరువాత ప్రాజెక్ట్ పై అఫిషియల్ గా ప్రకటన వచ్చింది. ఆయన ఇప్పటికే యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉండగా, అది ఇంత వరకూ పట్టాలెక్కలేదు. తాజాగా నవీన్ పోలిశెట్టి, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో సినిమా రూపొందనున్నట్టు ఓ వీడియో ద్వారా తెలియజేశారు. అయితే త్రివిక్రమ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం లేదు. ఆయన నిర్మాత మాత్రమే. Read Also…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా టిక్కెట్ల అమ్మకాలు ప్రభుత్వ నేతృత్వంలోనే జరగాలనే విషయంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చాలా స్పష్టమైన వైఖరిని అవలంబించబోతున్నారు. దానికి ఉదాహరణంగా నిన్న రాష్ట్ర సమాచార, రోడ్డు రవాణా శాఖా మంత్రి పేర్ని నాని నిర్వహించిన మీడియా సమావేశాన్ని పేర్కొవచ్చు. ఐ అండ్ పీఆర్ కమీషనర్ విజయ్ కుమార్ రెడ్డితో కలిసి పేర్ని నాని మీడియాతో మాట్లాడిన విషయాలను కూలంకషంగా పరిశీలిస్తే, సినిమా పరిశ్రమ కోరుకున్నదే జగన్ చేయబోతున్నారన్న భావన ఎవరికైనా కలుగుతుంది.…
ఇటీవల తన రెండో ఒలంపిక్ పతకంతో రికార్డ్ క్రియేట్ చేసింది తెలుగమ్మాయి పి.వి. సింధు. గతంలో సింధు బయోపిక్ పలుమార్లు చర్చలోకి వచ్చింది. స్వయంగా పి.వి. సింధు తన బయోపిక్ లో నటించటానికి దీపికా పడుకొనే అయితే బాగుంటుందని కూడా చెప్పింది. ఇప్పుడు సింధు కోరిక నెరవేరబోతోంది. ఊహించినట్లుగానే దీపికా పదుకొనే సింధు పాత్రను పోషించటానికి రెడీ అవుతోంది. అంతే కాదు ఈ సినిమా దీపికనే స్వయంగా నిర్మించబోతోందట. ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. బాడ్మింటన్…
సైదాబాద్, సింగరేణి కాలనీలో ఆరేళ్ళ చిన్నారి హత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటనకు పాల్పడ్డ మృగాన్ని చంపేయాలంటూ చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అభం శుభం తెలియని చిన్న వయసులోనే ఆ చిన్నారి హత్యాచారానికి గురవ్వడం పాప కుటుంబ సభ్యులతో పాటు అందరినీ కలచి వేసింది. తాజాగా చిన్నారి కుటుంబ సభ్యులను మంచు మనోజ్ పరామర్శించారు. చిన్నారి మరణంతో తీరని శోకంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను మనోజ్ ఓదార్చారు. Read…
‘అఖండ’ సినిమాతో బిజీగా ఉన్న బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ‘క్రాక్’ హిట్ తో ఊపుమీదున్న గోపీచంద్ మలినేని బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే కథాంశంతో ఈ సినిమాని తీయనున్నారు. మైత్రీ మూవీస్ సంస్థ ఈ మూవీ నిర్మించనుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనికి ‘రౌడీయిజం’ అనే పేరు పెట్టబోతున్నట్లు వినిపిస్తోంది. ఆ మేరకు నిర్మాణ సంస్థ…
చిరంజీవి, నాగార్జున, దిల్ రాజు, దగ్గుబాటి సురేష్ బాబు మరియు ఇతరులతో సహా టాలీవుడ్ ప్రముఖుల బృందం త్వరలో ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలవనున్న విషయం తెలిసిందే. ఈ సమావేశం గత వారం ఆగస్టులో జరగాల్సి ఉన్నప్పటికీ, తెలియని కారణాల వల్ల పోస్ట్ పోన్ అయ్యింది. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే ఏపీ సిఎం ఆఫీస్ ఎట్టకేలకు సినీ పెద్దలకు అపాయింట్మెంట్ ఇచ్చింది. ఈ అత్యున్నత సమావేశం సెప్టెంబర్ 20న జరుగుతుంది. అదే విధంగా…
తమిళ నటుడు ధనుష్ తెలుగులోనూ బిజీ అవుతున్నాడు. తమిళంలో అగ్రహీరోగా చెలామణిలో ఉన్న ధనుష్ బాలీవుడ్ తో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేశాడు. తాజాగా టాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎల్ఎల్ఎల్ పి వెంకటేశ్వర సినిమాస్ పతాంకై ఈ చిత్రం నిర్మితం కానుంది. ఇదిలా ఉంటే ధనుష్ టాలీవుడ్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టబోతున్నాడట. వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించే సినిమా, అజయ్ భూపతితో…
ముస్కాన్ సేథీ పరిచయం అక్కర్లేని పేరు. తెలుగులో బాలకృష్ట పైసా వసూల్ సినిమాలో నటించింది. అదే విధంగా రాగల 24 గంటల్లో సినిమాలో కూడా నటించి మెప్పించిన నటి ముస్కాన్ సేథి. తెలుగు సినిమాలతో పాటుగా అటు బాలివుడ్ చిత్రాల్లో కూడా నటించి మెప్పిస్తోంది. బాలివుడ్ వెబ్ సీరిస్లలో నటించిన ఈ అమ్మడు ప్రస్తుతం మరోప్రస్థానం మూవీలో నటిస్తోంది. తనీష్ హీరోగా నటించిన ఈ సినిమాను యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కించారు. ఇందులో వరుడు ఫేం భానుశ్రీ…