గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు టెలీవిజన్ రంగంలో ప్రముఖ యాంకర్స్ గా చెలామణిలో ఉన్న సుధీర్, రష్మిపై వచ్చినన్ని ప్రేమకథలు ఎవరి మీదా వచ్చిఉండవు. వీరి ప్రేమకథలను బేస్ చేసుకుని ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలు పలు ఛానెళ్లలో వచ్చాయి. ‘సుధీర్, రష్మి కళ్యాణం’ పేరుతో కూడా ఓ ప్రత్యేక ప్రోగ్రామ్ రూపొందింది. అయితే ఈ జంట ఎప్పటి కప్పుడు అవన్నీ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేటానికి మాత్రమేనని తమ మధ్య ఎలాంటి అనుబంధం లేదని అని స్పష్టం…
టాలీవుడ్ కు.. ఏపీ సీఎం జగన్ షాక్ ఇచ్చి 2 రోజులు దాటుతోంది. సినిమా టికెట్లకు వెబ్ సైట్ ను అందుబాటులోకి తెస్తామని ప్రభుత్వం ప్రకటన ఇచ్చేసింది. తమ అదుపులోకి టాలీవుడ్ ను రప్పించుకునే దిశగా ఈ అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టమవుతోంది. ఈ విధానంపై.. థియేటర్ల యజమానులు అయోమయంలో పడ్డారు. వారితో పాటు.. సినిమా టికెట్ల ఆదాయాన్ని పంచుకునే అన్ని విభాగాల ప్రతినిధులు.. టెన్షన్ పడుతున్నారు. వెబ్ సైట్ పెట్టినందుకు.. ప్రభుత్వానికి కూడా ఆదాయం సమకూరాల్సి ఉంటుంది.…
కథ, కథనాలు కొత్తగా ఉంటే సినిమాలు ఎప్పుడూ హిట్ అవుతుంటాయి. అలాంటి సినిమాలకు ఆదరణ లభిస్తుంది. అందుకే ఇప్పటి దర్శక నిర్మాతలు కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలను తీసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇలా వస్తున్న సినిమాల్లో వెరీ స్పెషల్‌గా చెప్పుకునే సినిమా ఒకటి రాబోతున్నది అదే మరో ప్రస్థానం. తనీష్ హీరోగా వస్తున్న ఈ సినిమా రియల్ టైమ్‌లోనే రీల్ టైమ్ ఉంటుంది. అంటే షాట్ టు షాట్ అన్నమాట. సినిమాలో కథ ఎంత టైమ్‌లో జరిగితే, సరిగ్గా…
ప్రతి బియ్యపుగింజపై తినేవాడి పేరు రాసి ఉంటుందట. అలాగే ఏ సినిమా ఏ హీరో ఖాతాలో పడాలనేది కూడా ఆ భగవంతుడు నిర్ణయించినట్లే జరుగుతుంది. ఎంతో మంది తారలు తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు. అందుకు ఉదాహరణలు కో కొల్లలు. నేచురల్ స్టార్ నానికి కూడా అలాంటి అనుభవాలు చాలా ఉన్నాయి. వాటిలో ‘ఎఫ్ 2’, ‘రాజా రాణి’ సినిమాలు ప్రత్యేకమైనవి. ఈ సినిమాల మేకర్స్ తమ…
నటి నివేదా థామస్ టాలీవుడ్ తో పాటు మలయాళ, తమిళ చిత్రపరిశ్రమల్లో పేరున్న నటి. తనకు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తను ఇటీవల ఇన్‌స్టాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ఆ వీడియోకు జంతువుల హక్కుల కార్యకర్తల నుంచి నిరసన వ్యక్తం అవుతోంది. ఈ వీడియోలో నివేదా ఆవు పాలు పితికి ఆ తర్వాత వాటితో కాఫీ తయారు చేశారు. దానికి ‘జాయ్’ అంటూ క్యాప్షన్ జోడించారు. ఇదే ఇప్పుడు వివాదానికి దారితీసింది.…
రైల్వే ఆన్ లైన్ టిక్కెట్స్ ను ఇష్యూ చేస్తున్న ఐ.ఆర్.సి.టి.సి. తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా సినిమా టిక్కెట్ల ఆన్ లైన్ విక్రయాలను జరపాలనే నిర్ణయం తీసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సెప్టెంబర్ 8న దీనికి సంబంధించిన జీవోను కూడా జగన్ ప్రభుత్వం విడుదల చేసింది. దాంతో థియేటర్లలో టిక్కెట్ ద్వారా వచ్చే మొత్తమంతా ప్రభుత్వ ఖజానాకు వెళ్ళిపోతుందేమోననే సందేహాన్ని కొందరు వ్యక్తం చేశారు. నిజానికి ఆన్ లైన్ ద్వారా టిక్కెట్ అమ్మకాలను మాత్రమే ప్రభుత్వం తన…
టాలీవుడ్ యంగ్ హీరో తనీష్ తాజాగా నటించిన సినిమా మరో ప్రస్థానం. ఈ సినిమాలో ముస్కాన్ సేథీ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రం సింగిల్ షాట్ ప్యాటర్న్ మూవీగా తెరకెక్కుతోంది. ఈ ప్యాటర్న్‌లో తెలుగులో వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ‘మరో ప్రస్థానం’ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రతి ఒక్కరు ఈ సినిమా ఎప్పుడెప్పుడు విగడుదలవుతుందా అని వేచి చూస్తున్నారు. ఈ సినిమా విడుదల కోసం తెలుగు ప్రేక్షులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వారి ఎదురుచూపులు…
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సమయంలో బండ్ల గణేష్ వ్యవహారం హాట్ టాపిక్‌గా మారిపోయింది.. ప్రకాష్ రాజ్ ప్యానల్ గుడ్‌బై చెప్పిన గణేష్.. ఆ ప్యానల్లో జనరల్ సెక్రటరీగా పోటీ చేస్తున్న జీవితను టార్గెట్ చేశారు.. ఆమెపైనే తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేయనున్నట్టు ప్రకటించాడు.. ఇక, జీవిత రాజశేఖర్-చిరంజీవి ఫ్యామిలీ పాత గొడవలతో పాటు.. జీవిత పలు పార్టీలో మారంటూ కామెంట్లు చేశాడు బండ్ల గణేష్.. మా ఎన్నికల ఎపిసోడ్‌తో పాటు.. బండ్ల గణేష్ విమర్శలపై…
మా అసోసియేషన్ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున ఎన్నికల బరిలోకి దిగిన బండ్ల గణేష్.. ఆ తర్వాత ప్రకాష్ రాజ్‌కు షాక్ ఇచ్చారు.. ప్యానల్ నుంచి బయటకు వచ్చి మా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ప్రకటించారు.. అంతే కాదు.. జీవిత రాజశేఖర్.. ప్రకాష్ రాజ్ ప్యానల్లోకి రావడం తనకు ఇష్టం లేదన్న బండ్ల.. అందుకే ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి కాక రేపారు.. జీవితపైనే తాను పోటీ చేస్తానని వెల్లడించారు.. ఆమె మెగా…
ఏపీలోని జగన్ సర్కార్… మరోసారి సినిమా రంగంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే సింగిల్ విండో పధకం ద్వారా టీవీ సీరియల్స్, సినిమాల చిత్రీకరణకు మార్గం సుగమం చేస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. ఆ మధ్య కరోనా సమయంలో టిక్కెట్ రేట్లను నియంత్రిస్తూ చర్యలు తీసుకున్న ప్రభుత్వం, తాజాగా ఆన్ లైన్ టిక్కెటింగ్ వ్యవస్థ పైనా ఫోకస్ పెట్టింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్స్ లో ఆన్ లైన్ బుకింగ్ పేరుతో మధ్యవర్తులు భారీ మొత్తాలను నొప్పి తెలియకుండా…