మా ఎన్నికల పూర్తి ఫలితాలు ఇవే…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా కు నిన్నటి రోజున ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. 28 ఏళ్ల చరిత్ర కలిగిన మూవీ ఆర్టిస్ అసోసియేషన్‌లో 883 మందికి ఓట్లు ఉన్నాయి. ఇందులో 605 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 54 మంది పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు. మా ఎన్నికల్లో విష్ణు, ప్రకాష్ రాజ్ ప్యానల్లు పోటీ చేయగా, మంచు విష్ణు మా అధ్యక్షుడిగా విజయం సాధించారు. కాగా, ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి ఫలితాలను ఈరోజు ప్రకటించారు. ఫలితాల ప్రకారం ఎగ్జిక్యూటీవ్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, జనరల్ సెక్రటరీగా రఘుబాబు, ట్రెజరర్‌గా శివబాలాజీ ఎంపికయ్యారు. జాయింట్ సెక్రటరీలుగా ఉత్తేజ్, గౌతమ్ రాజ్‌లు ఎంపికవ్వగా, వైస్ ప్రెసిడెంట్స్‌గా మాదాల రవి, బెనర్జీలు ఎంపికయ్యారు. ఇక ఇదిలా ఉంటే మొత్తం 18 మంది ఈసీ మెంబర్లుగా గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇందులో 10 మంది మంచు విష్ణు ప్యానల్ నుంచి ఎంపికవ్వగా, ప్రకాష్‌రాజ్ ప్యానల్ నుంచి 8 మంది ఎంపికయ్యారు. శివారెడ్డి, గీతాసింగ్, అశోక్ కుమార్, బ్రహ్మాజీ, శ్రీలక్ష్మి, మానిక్, ప్రభాకర్, తనీష్, శ్రీనివాసులు, హరినాథ్ బాబు, సురేష్ కొండేటి, శివనారాయణ, సంపూర్నేష్‌బాబు, శశాంక, సమీర్, సుడిగాలి సుధీర్, బొప్పాల విష్ణు, కౌశిక్ లు ఈసీ మెంబర్లుగా విజయం సాధించారు.
Read: బొగ్గు కొరత ప్రభావం: 13 విద్యుత్ ప్లాంట్లు మూసివేత…
Also Read
తాజావార్తలు
-
KVN : ‘టాక్సిక్’ మీ పల్స్ రేట్‌ను కూడా మారుస్తుంది!
-
Yash: తెలుగు ప్రేక్షకులు నాకు ఇచ్చిన బలం, సపోర్ట్‌కు నేను రెండింతలు తిరిగి ఇస్తాను
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
-
Huma Qureshi: ‘టాక్సిక్’ తర్వాత టాలీవుడ్లోకి హ్యూమా.. దిల్ రాజు ముందే మాట ఇచ్చేసిందా?
-
Rukmini Vasanth: యశ్‌తో పనిచేయడం బకెట్ లిస్ట్ మూమెంట్.. ‘టాక్సిక్’ హీరోయిన్ కామెంట్స్ వైరల్!
ట్రెండింగ్
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!
-
64MP కెమెరా, 5,700mAh బ్యాటరీతో వచ్చేసిన Philips S7221 5G ఫోన్.. ధర ఎంతంటే?
-
Crispy Veggie Fingers: బయట క్రిస్పీ.. లోపల సాఫ్ట్.! నోరూరించే ‘క్రిస్పీ వెజ్జీ ఫింగర్స్’ సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ చేసేయండి ఇలా.!
-
7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!