ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల వివాదానికి తెర దించేందుకు రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి.. సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు.. సీఎం జగన్ ఆహ్వానం మేరకే ఆయనను కలిసినట్టు.. చాలా మంచి వాతావరణంలో సమావేశం జరిగింది.. సమస్యలు అన్నీ సమసిపోతాయనే నమ్మకాన్ని కూడా వ్యక్తం చేశారు చిరంజీవి.. ఇదే సమయంలో.. ఇది ఇద్దరి భేటీయే కావడంతో రకరకాల ప్రచారాలు తెరపైకి వచ్చాయి.. ఇక, ఈ భేటీపై తనదైన శైలిలో స్పందించారు సీపీఐ జాతీయ నేత నారాయణ.. చిరంజీవి,…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు అమరావతి వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి, సీఎం జగన్ భేటీ ముగిసింది. సినిమా రంగానికి సంబంధించిన పలు అంశాలపై గంటన్నర పాటు మెగాస్టార్ చిరంజీవి కి, సీఎం జగన్ కు మధ్య ఆసక్తికరమైన చర్చ జరిగినాట్లు తెలుస్తోంది. ఇక భేటీ అనంతరం చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ” జగన్ గారితో తో సమావేశం చాలా సంతృప్తిగా జరిగింది. సంక్రాంతి పండగ పూట ఆయన నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం…
(జనవరి 14న దర్శకనిర్మాత కె.బి.తిలక్ జయంతి)విలువలను వీడకుండా ఓ సంకల్పంతో సినిమాలు తెరకెక్కించినవారు అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో కొల్లిపర బాలగంగాధర తిలక్ ఒకరు. ఇలా అంటే ఎవరికీ తెలియదు కానీ, కె.బి.తిలక్ అనగానే సినీ అభిమానులు ఇట్టే గుర్తు పట్టేస్తారు. తన ప్రతి సినిమాలోనూ ఏదో ఓ వైవిధ్యం చూపించాలని తపించేవారు తిలక్. ఆ తపనే ఆయనను ప్రత్యేకంగా నిలిపింది. కె.బి.తిలక్ 1926 జనవరి 14న పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో జన్మించారు. ప్రఖ్యాత దర్శకనిర్మాత…
హిందీ వెబ్ సీరిస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’తో యావత్ భారతదేశంలోని అభిమానులను ఆకట్టుకుంది ప్రియమణి. దానికి ముందే కొన్ని హిందీ చిత్రాలలోనూ ఆమె నటించడంతో ఆ వెబ్ సీరిస్ కు ఆమె కారణంగా మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా ప్రియమణి తెలుగు వెబ్ మూవీలోనూ నటించి, మరోసారి నటిగా తన సత్తా చాటబోతోంది. అభిమన్యు తాడిమేటి తో కలిసి ‘డియర్ కామ్రేడ్’ ఫేమ్ భరత్ కమ్మ రూపొందించిన ‘భామా కలాపం’లో ప్రియమణి టైటిల్ రోల్ ప్లే చేసింది.…
ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని తెలుగు నిర్మాతలు ఎప్పటి నుండో కోరుతున్నారని, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు తెలంగాణ ప్రభుత్వం సైతం ఆన్ లైన్ టిక్కెటింగ్ విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రవేశ పెట్టాలని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కోరారు. ప్రస్తుతం ఉన్న బుక్ మై షో వంటి సంస్థలు దారుణంగా ప్రేక్షకుడిని దోచుకుంటున్నాయని ఆరోపించారు. ఒక్కో టిక్కెట్ కు 20 నుండి 30 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నాయని, అందులో కేవలం ఐదారు రూపాయలను మాత్రమే…
కోవూరు శాసన సభ్యుడు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి సినిమా రంగానికి చెందిన వ్యక్తులపై చేసిన వ్యాఖ్యలను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్ళు కష్టపడి డబ్బులు సంపాదిస్తారే కానీ ఎవరినీ దోచుకుని ఆస్తులు కూడగట్టుకోవడం లేదని అన్నారు. అదే భావనలో ఎవరైనా రాజకీయ నాయకులు ఉంటే… ప్రజా ప్రతినిధులు, సినిమా వాళ్ళ ఆస్తుల లెక్కలు తీద్దామా!? అంటూ ఆయన సవాల్ విసిరారు. సినిమా రంగానికి కులాన్ని, మతాన్ని ఆపాదించడం ఎంతమాత్రం…
సమంత నుండి విడిపోయినప్పటి నుండి అందరి దృష్టి అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యపైనే ఉంది. విడాకుల తర్వాత ఈ ఇద్దరి గురించి ఎలాంటి న్యూస్ వచ్చినా వైరల్ అవుతోంది. రీసెంట్ గా నటి దక్ష నాగార్కర్ చిలిపి చేష్టలకు నాగ చైతన్య సిగ్గుపడుతూ కన్పించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా అయ్యింది. ఈ వీడియోలో ఇంకా ట్రెండ్ అవుతుండగానే తాజాగా చైతన్య ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’ అంటూ సాంగ్ పాడిన మరో వీడియో…
తెలుగు చిత్రపరిశ్రమలో యూత్ లో చక్కటి ఫాలోయింగ్ ఉన్న యువహీరో నాగశౌర్య. ఈ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య, రీతూ వర్మ జంటగా నటించిన తాజా చిత్రం ‘వరుడు కావలెను’. ఈ మూవీ ద్వారా లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయం అయింది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా గత అక్టోబర్ 29న థియేటర్లలో విడుదలై చక్కటి రెస్పాన్స్ ను అందుకుంది. ఈ సినిమాకి విశాల్ చంద్ర శేఖర్ సంగీతం…
ఏపీలో థియేటర్ల సమస్య ఇంకా కొనసాగుతోంది. తాజాగా ఈ విషయంపై మంత్రి తలసాని కీలక వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని తాజాగా చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తలసాని మాట్లాడుతూ “అఖండ, పుష్ప చిత్రాలతో సినీ పరిశ్రమ పుంజుకుంది. తెలంగాణలో టికెట్ ధరలు పెంచాం. ఐదో ఆటకు అనుమతి ఇచ్చాం… సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుంది. సినీ పరిశ్రమకు హైదరాబాద్ హబ్ గా ఉండాలన్నది ముఖ్యమంత్రి…