ప్రముఖ తెలుగు సింగర్ రేవంత్ వివాహ జీవితంలోకి అడుగు పెట్టి, ఒక ఇంటివాడయ్యాడు. రేవంత్ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. తెలుగు సినీ గాయకుడు, ఇండియన్ ఐడిల్-9 విజేత రేవంత్ పెళ్లి కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. కరోనా కారణంగా ఈ వేడుకకు చాలా తక్కువ మంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
Read Also : నిజమైన జోక్… RIP అంటే అవమానకరం… : ఆర్జీవీ
రేవంత్, అన్వితల నిశ్చితార్థం డిసెంబర్ 24న జరగ్గా ఆ ఫొటోలను రేవంత్ సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసిన విషయం తెలిసిందే. గుంటూరుకు చెందిన అన్విత అనే అమ్మాయిని రేవంత్ ఫిబ్రవరి 6న పెద్దల ఆశీర్వాదంతో వివాహం చేసుకున్నారు. కరోనా పరిస్థితుల దృష్ట్యా కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం గుంటూరులోని ఓ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. సినీ ఇండస్ట్రీకి చెందిన పలువురు గాయనీ గాయకులు ఈ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.