పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త లుక్ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వెకేషన్ నుంచి తిరిగొచ్చిన పవన్ తాజాగా హైదరాబాద్ కు తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టులో ఆయన వస్తున్న వీడియోను తీసిన ఓ అభిమాని ట్విట్టర్ షేర్ చేయగా, ఇప్పుడది ట్రెండ్ అవుతోంది. అందులో పవన్ బ్లాక్ కలర్ టీ షర్ట్, జీన్స్ ధరించారు. ఇక పవన్ వెకేషన్ విషయానికొస్తే… ‘భీమ్లా నాయక్’ వాయిదా పడడంతో రష్యా విహారయాత్రకు వెళ్లారు పవన్. అక్కడ ఆయన…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ తన భార్యపై చేసిన ‘నెగెటివ్’ కామెంట్స్ కు సంబంధించి ఓ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. నితిన్ తన తాజా పోస్ట్ లో కేక్ కోస్తూ మొదటిసారి తన భార్య నెగెటివ్ కావాలని కోరుకుంటున్నాను అంటూ వీడియోను పోస్ట్ చేశాడు. అయితే నితిన్ కింద కేక్ కోస్తూ ఉండగా, ఆయన భార్య పైన ఇంట్లో ఉన్న కిటికీ దగ్గర నిలబడి చూస్తోంది. అలా ఎందుకంటే నితిన్ భార్యకు కరోనా పాజిటివ్ గా…
వివాదాస్పద దర్శకుడు తాజాగా సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న సమస్యలపై తనదైన శైలిలో స్పందించి సంచలనం సృష్టించారు. గత కొన్ని రోజులుగా ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయమై నెలకొన్న అనిశ్చితిపై ఆర్జీవీ స్పందించిన తీరు వార్తల్లో నిలిచింది. ఆంధ్రా పెద్దలతో సినీ పెద్దలు కలవడానికి, సమస్యలను విన్నవించుకోవడానికి చేసిన ప్రయత్నాలు విఫలం కాగా, ఆర్జీవీ ఎంట్రీతో వివాదం మరింత ముదిరింది. సిఎంమా టికెట్ రేట్ల విషయంలో మీ జోక్యం ఏంటి ? అంటూ లైవ్ లో ఆంధ్రప్రదేశ్…
రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ రాక్ చేస్తోంది. ‘పుష్ప’తో మరోమారు బాలీవుడ్ లోనూ మన మ్యూజిక్ డైరెక్టర్ దుమ్ము రేపుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రీమేక్ లపై అభిప్రాయాలను పంచుకున్నాడు దేవిశ్రీ. అయితే బాలీవుడ్ లో సంగీత స్వరకర్తలకు తగిన క్రెడిట్ లభించలేదని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రీమేక్‌ల మధ్య హిందీ సంగీత పరిశ్రమ శోభను కోల్పోయిందా ? అని ఇంటర్వ్యూలో దేవిశ్రీ ప్రసాద్ కు ప్రశ్న ఎదురైంది. ఈ విషయంపై…
గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ ధరల విషయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్జీవీ ధైర్యం చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రికి, ఆర్జీవికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. తాజా ట్వీట్ లో ఆర్జీవీ మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది. Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్”…
ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం ముదురుతోంది. నిన్నటి నుంచి సినిమా ఇండస్ట్రీ తరపున ఆర్జీవీ, ప్రభుత్వం తరపున మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్జీవీ ప్రభుత్వానికి ప్రశ్నలతో ముంచెత్తుతుంటే, నాని కూడా తగ్గేదే లే అన్నట్టుగా సమాధానాలతో పాటు మరిన్ని ప్రశ్నల వర్షం కురిపించారు. వీరిద్దరి మధ్య సాగుతున్న ట్విట్టర్ వార్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాని వంటి కొంతమంది హీరోలు…
సినిమా టిక్కెట్ల విషయమై వివాదం రానురానూ మరింత ముదురుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి ఆయన సంధించిన పది లాజికల్ ప్రశ్నలు సంధించడం సంచలనం రేపింది. అయితే ఆయన ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ పేర్ని…
సినిమా టిక్కెట్ల ధరల వివాదంపై వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ చేస్తున్న ప్రతీ కామెంట్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. వైసీపీ ప్రభుత్వంపై తన స్వరం పెంచుతున్న ఆర్జీవీ నిన్న సాయంత్రం యూట్యూబ్‌లో సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి పది లాజికల్ ప్రశ్నలు వేస్తూ యూట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేశారు. ఆ ప్రశ్నలకు సమాధానమిస్తూ తాజాగా పేర్ని నాని వరుస ట్వీట్లు చేయడం విశేషం. “గౌరవనీయులైన ఆర్జీవీ గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు…
ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారంపై ఇంకా ఎటూ తేలలేదు. పేదలకు సహాయం చేయడానికే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ప్రభుత్వం తమ పనిని సమర్థించుకుంటుంటే, పలువురు సినీ ప్రముఖులు మాత్రం ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమ పట్ల, ఎగ్జిబిషన్ రంగం పట్ల వ్యవహరిస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినిమా పెద్దలు కోర్టుకు కూడా వెళ్లిన విషయం తెలిసిందే. తాజాగా సినిమా టికెట్ ధరల నియంత్రణను సవాలు చేస్తూ…
తెలుగు చిత్రసీమలో పి.సి.రెడ్డిగా సుప్రసిద్ధులు పందిళ్ళపల్లి చంద్రశేఖర రెడ్డి. ఆయన సినిమా అంటే చాలు అందులో తెలుగు వాతావరణం కొట్టొచ్చినట్టు కనిపించేది. ముఖ్యంగా పల్లెసీమల పచ్చదనం నడుమ పి.సి.రెడ్డి సినిమాలు నాట్యం చేశాయని చెప్పవచ్చు. వాటిలో కుటుంబకథలే మిన్నగా తెరకెక్కించారు. అందువల్లే పి.సి.రెడ్డి సినిమా అనగానే ఓ చక్కని కుటుంబ కథను చూడవచ్చునని ప్రేక్షకులు సైతం భావించేవారు. సదా నిర్మాత శ్రేయస్సు కాంక్షిస్తూ, తన నిర్మాతకు తన వల్ల ఓ రూపాయి ఆదాయం రావాలనే అభిలాషతోనే పి.సి.రెడ్డి…