టాలీవుడ్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌తో కలిసి చేసిన ‘మైన్ చలా’ అనే తన తాజా పాటను ఆస్వాదిస్తోంది. ఇది గత వారాంతంలో విడుదలైంది. అయితే ఈ పాట ఇటీవల విడుదలైన సల్మాన్ “యాంటిమ్ : ది ఫైనల్ ట్రూత్” సినిమాలో భాగంగా ఉండాల్సింది. ముందుగా మేకర్స్ బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్, ప్రగ్యా జైస్వాల్ మధ్య ఈ చిత్రంలో రొమాంటిక్ ట్రాక్‌ని పెట్టాలని అనుకున్నట్లు సమాచారం. ఈ మేరకు షూటింగ్ కూడా పూర్తయింది.…
“పుష్ప : ది రైజ్” విజయం తర్వాత అల్లు అర్జున్ దక్షిణాదిలోనే కాకుండా హిందీ ప్రేక్షకులలో కూడా మోస్ట్ వాంటెడ్ నటులలో ఒకరిగా మారారు. ప్రస్తుతం అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అందరి దృష్టి ఉంది. ఇంకేముంది ‘పుష్ప-2’… కానీ ఆ తరువాత బన్నీ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో చర్చ నడుస్తోంది. దర్శకుడు అట్లీతో ఒక చిత్రం కోసం అల్లు అర్జున్‌కు భారీ మొత్తంలో ఆఫర్ వచ్చిందని ప్రచారం జరుగుతోంది. ‘పుష్ప’…
(జనవరి 24న నటి కృష్ణకుమారి వర్ధంతి)అందాల రాజకుమారి పాత్రల్లో అలరించిన నాయికలు ఎందరో ఉన్నారు. కానీ, కృష్ణకుమారిలా మురిపించిన వారు అరుదనే చెప్పాలి. జానపద కథానాయకులుగా యన్టీఆర్, కాంతారావు రాజ్యమేలుతున్న రోజుల్లో వారి సరసన కృష్ణకుమారి పలు చిత్రాలలో నాయికగా నటించి మురిపించారు. ముఖ్యంగా బి.విఠలాచార్య జానపద చిత్రాల్లో అనేక సార్లు రాజకుమారిగా నటించి మురిపించారు కృష్ణకుమారి. అందుకే ఈ నాటికీ అందాల రాజకుమారిగా జనం మదిలో నిలచిపోయారు కృష్ణకుమారి. కృష్ణకుమారి 1933 మార్చి 6న జన్మించారు.…
ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు…
టాలీవుడ్ సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో బుధవారం మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కొంచాడ శ్రీనివాస్ కన్నుమూశాడు. అతడు సుమారు 40కి పైగా సినిమాలు, 10కిపైగా టీవీ సీరియళ్లలో నటించాడు. గతంలో షూటింగ్ సమయంలో పడిపోవడంతో శ్రీనివాస్‌కు ఛాతీపై దెబ్బ తగిలిందని, తర్వాత గుండె సమస్యలు వచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. Read Also: మూతి మీద ముద్దు… టాలీవుడ్ లో ముద్దుల హోరు కాగా…
విశాఖ జిల్లాలో సినిమా హాళ్ళలో కోవిడ్ ఆంక్షలు కఠినంగా అమలవుతున్నాయి. 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా థియేటర్లు నడుస్తున్నాయి. దీంతో యజమానులు ఆదాయం లేక ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు వివిధ నిబంధనల పేరుతో థియేటర్లకు అధికారులు నోటీసులు జారీచేయడం కలకలం రేపుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో తాము థియేటర్లను నడపలేం అంటున్నారు యజమానులు. ఇప్పటికే కరోనా వల్ల దివాలా తీశామని, ప్రభుత్వం విధించే ఆంక్షలతో థియేటర్లు మూసివేయడమే శరణ్యం అంటున్నారు.
కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మరో హీరోయిన్ కు కోవిడ్-19 సోకింది. ప్రస్తుతం రవితేజతో “ఖిలాడీ” చేస్తున్న సౌత్ ఇండియన్ నటి డింపుల్ హయాతీకి కోవిడ్-19 పాజిటివ్ అని తేలింది. అదే విషయాన్ని డింపుల్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ లో ప్రకటించింది. అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తాను కరోనా వైరస్ బారిన పడ్డానని డింపుల్ హయాతి తన పోస్ట్‌లో రాశారు.…
ప్రముఖ దర్శకుడు కళ్యాణ్ కృష్ణ 2022 సంక్రాంతి విజేతగా నిలిచాడు. ఆయన దర్శకత్వంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన చిత్రం “బంగార్రాజు” థియేటర్లలో దూసుకుపోతోంది. ఇదిలా ఉండగా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణకు ఇప్పుడు మరో బిగ్ ఆఫర్ వచ్చింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు మేకర్స్. ప్రముఖ తమిళ ప్రొడక్షన్ హౌస్ స్టూడియో గ్రీన్ లో కళ్యాణ్ కృష్ణ బిగ్ వెంచర్ రూపొందబోతోంది. ఈ సందర్భంగా కళ్యాణ్ కృష్ణను కలిసిన కెఇ…
(ఎల్వీ ప్రసాద్ జయంతి జనవరి 17న)తెలుగు చిత్రపరిశ్రమకు ఓ వెలుగును తీసుకు వచ్చారు దర్శకనిర్మాత నటుడు ఎల్వీ ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర సీమలో ఎల్.వి. ప్రసాద్ పేరు తెలియని వారుండరు. ఈ తరం వారికి ఆయన స్థాపించిన ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ తప్పకుండా గుర్తుంటుంది. భారతదేశంలోని ప్రధాన…
సినిమా టికెట్ల ధరల వివాదం ఆంధ్రప్రదేశ్‌లో కాక రేపింది.. ఓవైపు సినిమా పరిశ్రమకు చెందినవారి కామెంట్లు.. మరోవైపు.. అధికార వైసీపీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు చేసిన వ్యాఖ్యలు.. క్రమంగా ఏపీ సర్కార్, సినీ పరిశ్రమకు మధ్య గ్యాప్ పెంచుతున్నాయనే విమర్శలు వినిపించాయి.. ఇప్పట్లో ఈ సమస్య పరిష్కారం కాదేమో అనే అనుమానాలు కూడా కలిగాయి.. అయితే, సినీ పెద్దలు వివాదానికి తెరదింపే ప్రయత్నాలు చేశారు.. ఇదే సమయంలో.. ఏపీ సీఎం వైఎస్ జగన్.. మెగాస్టార్ చిరంజీవిని…