కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ తో సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ కానున్నారు. రేపు మెగాస్టార్ చిరంజీవి, సినీ పెద్దలతో సీఎం భేటీ నేపథ్యంలో కీలక చర్చ జరగనుంది. దాదాపుగా ప్రతిపాదనలు సిద్ధం చేసింది ప్రభుత్వం టికెట్ల కమిటీ. రేపటి భేటీ అనంతరం కమిటి సిఫార్సుల్లో మార్పులు చేర్పులు చేసి తుది నివేదిక ఇచ్చే ఛాన్స్ వుంది.
జీవో 35 ప్రకారం గ్రామ పంచాయతీల్లో టికెట్ ధరలు-
నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 5 రూపాయలు- గరిష్టం 15
ఏసీ, ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 10 రూపాయలు- గరిష్టం 20
మల్టీప్లెక్స్ ల్లో కనీస టికెట్ ధర 30 రూపాయలు- గరిష్టం 80
నగర పంచాయితీల్లో –
నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 10 రూపాయలు- గరిష్టం 25
ఏసీ, ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 15 రూపాయలు- గరిష్టం 35
మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 40 రూపాయలు- గరిష్టం 120
మున్సిపాలిటీ ప్రాంతాల్లో –
నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 15 రూపాయలు- గరిష్టం 50
ఏసీ, ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 30 రూపాయలు- గరిష్టం 70
మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 60 రూపాయలు- గరిష్టం 150
Read Also Jai Bhim : సూర్య అభిమానులకు తీవ్ర నిరాశ… ‘జై భీమ్’కు ఆస్కార్ మిస్
మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంతాల్లో –
నాన్ ఏసీ థియేటర్ల కనీస టికెట్ ధర 20 రూపాయలు- గరిష్టం 60
ఏసీ, ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీస టికెట్ ధర 40 రూపాయలు- గరిష్టం 100
మల్టీప్లెక్సుల్లో కనీస టికెట్ ధర 75 రూపాయలు- గరిష్టం 250
ప్రభుత్వ టికెట్ల కమిటీ అనేక ప్రతిపాదనలు చేసింది. సెంటర్లతో నిమిత్తం లేకుండా ధరలు ఉండాలి. ప్రాంతం ఏదైనా ఏసీ లేదా మల్టీప్లెక్స్ థియేటర్లలో కనీస టికెట్ ధర 50 రూపాయలు, గరిష్టం 150 వుండాలంది. ఎయిర్ కూలర్ థియేటర్లలో కనీసం 40, గరిష్టం రూ.120గా నిర్దారించింది. నాన్ ఏసీ థియేటర్లలో కనీసం 30, గరిష్టం 70 రూపాయలుగా పేర్కొంది. రిక్లయినర్ క్లాస్ కు 250 రూపాయలు ధర నిర్ణయించింది కమిటీ.