ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల వ్యవహారం ఓ దశలో ప్రభుత్వం వర్సెస్ టాలీవుడ్‌గా మారింది.. అయితే, ఈ వ్యవహారం మరింత రచ్చగా మారకుండా సినీ పెద్దలు కొందరు రంగంలోకి దిగి ప్రభుత్వంలో చర్చలు జరపడం.. ప్రభుత్వం కమిటీ వేయడం.. ఆ కమిటీ వరుసగా సమావేశాలు అవుతూ.. వివిధ సమస్యలపై చర్చించడం జరుగుతోంది.. మరోవైపు.. ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టుగానే మాట్లాడే వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా ఈ వ్యవహారంలో ఎంట్రీ ఇచ్చాడు.. కొన్ని సందర్భాల్లో మైక్…
సినిమా టికెట్ల ధరల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్‌లో ఇంకా చర్చ హాట్ టాపిక్‌గానే సాగుతోంది.. ప్రభుత్వం, సినీ ఇండస్ట్రీ మధ్య నెలకొన్న వివాదానికి తెరదించేందుకు కమిటీని కూడా ఏర్పాటు చేసింది ప్రభుత్వం.. తాజాగా, సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు.. ప్రభుత్వంపై సెటైర్లు వేశారు.. రాంగోపాల్ వర్మను పిలిచి భోజనం పెట్టారు.. కానీ, విద్యార్ధుల కడుపు నింపే విషయాన్ని మాత్రం ఈ ప్రభుత్వం పట్టించుకోదు అని మండిపడ్డారు.. సినిమా టిక్కెట్ల అంశంలో ప్రభుత్వం…
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ హీరోగా నటిస్తున్న 91వ సినిమా ‘శేఖర్’. త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాలో రాజశేఖర్ పెద్ద కూతురు శివాని రాజశేఖర్ ఓ కీలక పాత్రలో నటించింది. ప్రామిసింగ్ థ్రిల్లర్‌లో ఆమె హీరో కూతురిగా నటించింది. రియల్ లైఫ్ తండ్రీకూతుళ్లు వెండితెర తండ్రీకూతుళ్లుగా నటించడం ఇదే తొలిసారి. తాజాగా ఈ స్టార్ తండ్రీకూతుళ్ళు కలిసి ఉన్న పిక్స్ ను మేకర్స్ విడుదల చేశారు. జీవితా రాజశేఖర్ ఈ సినిమాకి స్క్రీన్ ప్లే రాయడమే కాకుండా…
దాదాపు అందరు ప్రముఖ టాలీవుడ్ హీరోలు అందరితో స్క్రీన్ స్పేస్ షేర్ చేసుకున్న బ్యూటీ శ్రియా శరణ్. పెళ్ళి అయ్యి, ఒక కూతురు ఉన్న శ్రియా ఇప్పటికీ స్టార్ హీరోలతో జతకడుతూ ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఆమె రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో కనిపించబోతోంది. అయితే శ్రియా తాజాగా ఓ వీడియోను షేర్ చేస్తూ తన సీక్రెట్ కు ఏడాది పూర్తయినట్టు తెలిపింది. లాక్ డౌన్ లో భర్తతో పాటు విదేశాల్లో గడిపిన శ్రియ ఒకరోజు…
సినిమా వాళ్లపై వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. సినిమా వాళ్లను బలిసింది అనడం బాధాకరమని… నిజనిజాలు తెలియకుండా ఓ ప్రజాప్రతినిధి ఈ విధంగా మాట్లాడటం తెలుగు సినిమా పరిశ్రమ మొత్తాన్ని అవమానించినట్లేనని ఆవేదన వ్యక్తం చేసింది. మన తెలుగు సినిమా సక్సెస్ రేటు 2 నుంచి 5 శాతం మాత్రమేనని.. మిగతా సినిమాలు…
ఓటిటిలో కూడా పోటీనా ? తాజాగా విడుదలైన రెండు భారీ చిత్రాలు ఒకేరోజున ఓటిటి ప్రీమియర్ కు రెడీ అవుతున్నాయి. నాని వర్సెస్ బాలయ్య అనిపించేలా వీరిద్దరూ నటించిన రెండు తాజా చిత్రాలూ వేరు వేరు ఓటిటి ప్లాట్‌ఫామ్ లో ఒకేరోజు విడుదల అవుతుండడం గమనార్హం. Read Also : పరువానికి మించిన బరువులు మోస్తున్న సామ్… వీడియో వైరల్ నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన “శ్యామ్ సింగ రాయ్” డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు…
గత వారం రోజులుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలిచారు. న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని వరుస ట్వీట్లు కూడా పెట్టారు. ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. ఎట్టకేలకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్మెంట్ ఇచ్చారని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్లో ధృవీకరించారు. “జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన…
అగ్ర సంగీత దర్శకుడు థమన్ ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. ఏమాత్రం విరామం లేకుండా పెద్ద సినిమాలకు మంచి మ్యూజిక్ ఇచ్చి సంగీత ప్రియులను అలరించడానికి పని చేస్తున్నాడు. ప్రస్తుతం థమన్ భారీ ప్రాజెక్ట్‌ల కోసం పని చేస్తున్నాడు. ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట”, పవన్ కళ్యాణ్ “భీమ్లా నాయక్” సినిమాలపై దృష్టి పెట్టాడు. అయితే తాజాగా టాప్ కంపోజర్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఇప్పుడు థమన్ ఐసోలేషన్ లో ఉన్నాడు. మహమ్మారి…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం కొత్త మూవీ టైటిల్ ను అనౌన్స్ చేశారు మేకర్స్. ‘రాజావారు రాణిగారు’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం, సెకండ్ మూవీ ‘ఎస్. ఆర్. కళ్యాణ్ మండపం’తో గత యేడాది ఆగస్ట్ లో డీసెంట్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా తర్వాత కిరణ్ అబ్బవరంకు పెద్ద సంస్థల నుండి అవకాశాలు వస్తున్నాయి. రెండో సినిమా విడుదలకు ముందే కిరణ్ ‘సమ్మతమే, సబాస్టియన్’ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇక అవి…