సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలేవీ విడుదల కాలేదు. ఇటీవలి వారాల్లో విడుదలైన చిన్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా సందడి చేయలేకపోయాయి. కరోనా ఎఫెక్ట్ తో థియేటర్లు, ఎగ్జిబిషన్ పరిశ్రమ కూడా కష్టాలు ఎదుర్కొంది. అయితే ‘అఖండ’ ఇచ్చిన విజయోత్సాహంతో మళ్ళీ వరుసగా విడుదలకు సిద్ధమయ్యాయి సినిమాలు. ఇక ఈ శుక్ర, శనివారాల్లో నాలుగు సినిమాలు విడుదలవుతుండడంతో ఈ వారాంతంపై టాలీవుడ్ ఎన్నో ఆశలు పెట్టుకుంది.
Read Also : బాలయ్య షో రికార్డ్స్ ‘అన్‌స్టాపబుల్’
రవితేజ నటించిన ‘ఖిలాడీ’ ఈ శుక్రవారం విడుదలవుతుండగా, సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక డీజే టిల్లు, ఎఫ్‌ఐఆర్, సెహరి సినిమాలు శనివారం విడుదల కానున్నాయి. ‘డీజే టిల్లు’పై కూడా ప్రేక్షకుల్లో బాగానే అంచనాలు ఉన్నాయి. ఇందులో యూత్ అట్ట్రాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉండడంతో యూత్ బాగా ఆకర్షితులవుతారు. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమాలు మాత్రమే కాకుండా మూడు సినిమాలు ఓటీటీ విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రియమణి ‘భామాకలాపం’ శుక్రవారం నుండి ఆహాలో ప్రసారం కానుంది. కోలీవుడ్ స్టార్ విక్రమ్, ఆయన కుమారుడు ధృవ్ కలిసి నటించిన మొదటి చిత్రం ‘మహాన్’ ఈ నెల 10 నుండి అమెజాన్ ప్రైమ్‌లో ప్రసారం కానుంది. సుమంత్ రోమ్-కామ్ ‘మళ్లీ మొదలైంది’ కూడా ఈ వారాంతంలో Zee5లో ప్రసారం కానుంది. అంటే ఈ వారాంతంలో టాలీవుడ్ ప్రేక్షకులకు అలరించడానికి మొత్తం 7 సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.