Tollywood: తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కృష్ణంరాజు, కృష్ణ, చలపతిరావు వంటి ప్రముఖులు మృతి చెందారు. తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్ నిర్మాత ఎ. సూర్యనారాయణ కన్నుమూశారు. ఆయన సీనియర్ ఎన్టీఆర్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాను నిర్మించారు. అంతేకాకుండా పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. శ్రీ సత్యచిత్ర బ్యానర్పై తహసీల్దార్ గారి అమ్మాయి (1971), ప్రేమ బంధం (1976), అడవిరాముడు (1977), కుమార రాజా (1978),…
Varuntej Birthday: మెగా ఫ్యామిలీలో అసలైన ‘ఆరడుగుల బుల్లెట్’ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంతకు ముందు విజయపథంలో పయనించిన వరుణ్ తేజ్, గత ఏడాది ‘గని’తో నిరాశకు గురయ్యాడు, తరువాత వచ్చిన ‘ఎఫ్-3’తో కాసింత ఊరట చెందాడు. ప్రస్తుతం ప్రవీణ్…
NTR Death Anniversary: తెలుగువారి మదిలో ‘అన్న’గా నిలిచిన విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు అవనిని వీడి అప్పుడే 27 ఏళ్ళవుతోంది. అయినా ఆయన తలపులు తెలుగువారిని సదా వెన్నాడుతూనే ఉన్నాయి. ఎన్టీఆర్ మరణం తరువాత తరలివచ్చిన తరాలు సైతం యన్టీఆర్ నామస్మరణ చేస్తూనే ఉండడం విశేషం. అందుకు చలనచిత్రసీమలోనూ, రాజకీయ రంగంలోనూ ఎన్టీఆర్ సాగించిన అనితరసాధ్యమైన పయనమే కారణమని చెప్పక తప్పదు. ఎన్టీఆర్ అన్న మూడక్షరాలు వింటే చాలు తెలుగువారి మది పులకించి పోతుంది.…
తెలుగునాట పుట్టినా, భారతీయ చిత్రసీమలోనే తనదైన బాణీ పలికిస్తూ సాగిన ఘనులు దర్శకనిర్మాత నటులు ఎల్.వి.ప్రసాద్. ఆయన చిత్రాల ద్వారా మేటి నటులు చిత్రసీమలో తమ బాణీ పలికించారు. తెలుగు, తమిళ చిత్రరంగాల్లో ఎల్వీ ప్రసాద్ పేరు ఈ నాటికీ మారుమోగుతూనే ఉంది. భారతదేశంలోని ప్రధాన చిత్రపరిశ్రమల్లో ఎల్వీ ప్రసాద్ అన్నది ఓ బ్రాండ్ నేమ్. వారి ప్రసాద్ ల్యాబ్స్ , ఔట్ డోర్ యూనిట్స్ , ఇఎఫ్ఎక్స్ , ప్రసాద్ ఐమాక్స్ అన్నీ సినీజనానికి సుపరిచితాలు.…
Sankranthi: సంక్రాంతి వచ్చింది తుమ్మెద.. సరదాలు తెచ్చింది తుమ్మెద.. కొత్త ధాన్యాలతో కోడి పందేలతో ఊరే ఉప్పొంగుతోంది. ఇక సోషల్ మీడియా కూడా అచ్చ తెలుగు ఆడపడుచుల ఫొటోలతో కళకళలాడుతున్నాయి. అదేనండీ.. స్టార్ హీరోయిన్లు సంక్రాంతి పండుగ రోజు తెలుగుతనం ఉట్టిపడేలా హీరోయిన్లు చీరకట్టులో దర్శనమిస్తారు. మరి సోషల్ మీడియాలో అందమైన భామలు.. లేత మెరుపు తీగలు ఎలా ఉన్నారో మీరు ఓ లుక్ వెయ్యండి. View this post on Instagram A post shared…
Tollywood: సాధారణంగా పండుగ వచ్చిందంటే.. కుటుంబాలు బంధువులతో, పిల్లతో కళకళలాడుతూ ఉంటాయి. ఇంకోపక్క సినీ అభిమానులకు పండుగ వచ్చిందంటే.. చాలు. కొత్త సినిమాల అప్డేట్స్, పోస్టర్స్, హీరోల కొత్త కొత్త ఫొటోలతో కళకళలాడుతుండేవి. కానీ, ఈ ఏడాది మాత్రం ఆ సందడి ఎక్కడ కనిపించడం లేదు.
Tollywood: ప్రస్తుతం టాలీవుడ్లో సంక్రాంతి సినిమాల హడావిడి కనిపిస్తోంది. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, వారసుడు, తెగింపు, కళ్యాణం కమనీయం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి. అయితే తొలిరోజు బాలయ్య నటించిన వీరసింహారెడ్డికి ఎక్కువ థియేటర్లు లభించాయి. కానీ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్యకు మాత్రం తొలిరోజు బాలయ్య సినిమా కంటే తక్కువ థియేటర్లు దొరికాయి. దీంతో బాలయ్య కెరీర్లో మునుపెన్నడూ చూడనంత హయ్యెస్ట్ ఓపెనింగ్స్ వీరసింహారెడ్డి సినిమా సాధించింది. అయితే టాక్ మాత్రం వాల్తేరు వీరయ్యకు పాజిటివ్గా…