Actress Kasturi Gives Dirty Meaning on Anasuya Aunty Controversy: యాంకర్ అనసూయ ‘ఆంటీ’ వివాదం గురించి అందరికీ తెలిసిందే! ఓవైపు తనని ఆంటీ అని పిలిస్తే సహించలేనని అనసూయ చెప్తుంటే.. ఇద్దరు పిల్లల తల్లి కాబట్టి తాము ఆంటీ అనే పిలుస్తామంటూ కొందరు నెటిజన్లు పట్టుబడుతున్నారు. ఈ గొడవ చాలాకాలం నుంచి నడుస్తూ వస్తోంది. కొన్ని రోజుల క్రితం ‘ఆంటీ’ విషయంపై తాను కేసు పెడతానని అనసూయ చెప్పినప్పుడు.. ఈ వివాదం మరింత ముదిరింది. అప్పుడు కావాలనే చాలామంది సోషల్ మీడియాలో అనసూయని ఆంటీ అని పిలుస్తూ.. కొన్ని గంటలపాటు ఈ టాపిక్‌ని ట్రెండ్ చేశారు. అందుకు అనసూయ ఆ సమయంలోనే ధీటుగా బదులిచ్చింది కూడా!
Bopparaju Venkateswarlu: ఇప్పుడు ఉద్యమం చేయకపోతే.. భవిష్యత్తు తరాలు క్షమించవు
ఇప్పుడు ఈ అంశంపై లేటెస్ట్‌గా నటి కస్తూరి తనదైన శైలిలో స్పందించింది. చిన్న పిల్లలు ఆంటీ అని పిలవడానికి, దున్నపోతులాగా పెరిగిన వ్యక్తులు ఆంటీ అని అనడానికి చాలా తేడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు. అడల్ట్ అయితే మహిళల్ని ఆంటీ అని పిలవడం కరెక్ట్ కాదని, చిన్న పిల్లలు మాత్రమే ఆంటీ అనడం కరెక్ట్ అని చెప్పారు. ‘‘ఒక హీరోనో, నటుడినో అంకుల్ అని పిలుస్తారా? అనసూయ కంటే రెట్టింపు వయసున్న హీరోల్ని అంకుల్ అని పిలిచి చూడండి, అనరు కదా! మరి ఆడవాళ్లను మాత్రమే ఆంటీ అనడం దేనికి?’’ అని మండిపడ్డారు. ఆల్రెడీ ఈ ఆంటీ అనే పదానికి డర్టీ మీనింగ్ వచ్చేసిందని.. ఇతరుల మీద గౌరవం లేదంటేనో, మనసులో ఏదో చెడు ఆలోచనలు ఉంటేనో ‘ఆంటీ’ అని పిలుస్తారని వివరణ ఇచ్చారు. ఈ విషయంలో తాను అనసూయకి మద్దతుగా ఉంటానని స్పష్టం చేశారు.
Samantha :13 ఏళ్ల క్రితం సమంత ఇలా ఉండేది.. మీరు చూడండి..
ఇదే సమయంలో తన పొలిటికల్ ఎంట్రీ గురించి కస్తూరి మాట్లాడుతూ.. తాను తమిళనాడు రాజకీయాలపై అనాలసిస్ చేస్తుంటానని, తెలుగు పాలిటిక్స్ గురించి మాత్రం తెలియదని పేర్కొన్నారు. కానీ.. దివంగత నాయకుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డిగారికి తాను పెద్ద అభిమానినని తెలిపింది. తమిళనాడులో దాదాపు అన్ని పార్టీలు తనను ఆహ్వానించాయని.. కాకపోతే తాను నేను ఉన్నదున్నట్లుగా మాట్లాడతానని.. అప్పుడు ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ చేసే తప్పులను వేలెత్తి చూపలేమని అన్నారు. ఇప్పుడు ఖుష్బూ పరిస్థితి అలాగే ఉందన్నారు. అంతేకాదు.. పాలిటిక్స్‌లో రాణించాలంటే చాలా డబ్బు ఉండాలని, తన వద్ద అంత డబ్బు లేదు కాబట్టే రాజకీయాల్లోకి రాలేనని స్పష్టం చేశారు.