Hyderabad: ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్ల ఆశ చూపి అత్యాచారం.. ఆపై హత్య..
- ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డ దుర్మార్గుడు..
- హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఘటన..
- చాక్లెట్లు ఇప్పిస్తానని చెప్పి వెంట తీసుకెళ్లాడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆరేళ్ల చిన్నారికి చాక్లెట్లు ఇప్పిస్తానని తీసుకెళ్లి… అత్యాచారం చేయడమే కాకుండా కిరాతకంగా హతమార్చాడు. బాలిక మృతదేహాన్ని ముళ్లపొదల్లో వేసి.. తనకేం తెలియనట్లు వెళ్లిపోయాడు. బాలిక మిస్సింగ్ కేసు దర్యాప్తు చేసిన పోలీసులు… కిరాతకుడిని పట్టుకున్నారు. బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టంకి తరలించారు పోలీసులు.
కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు.. .ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అత్యాచారం చేసి.. ఆపై దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగ్ పరిధిలో జరిగింది. ఇంటి సమీపంలోనే ఉన్న ఆరేళ్ల చిన్నారికి మాయమాటలు చెప్పాడు. తన వెంట వస్తే చాక్లెట్లు ఇప్పటిస్తానని చెప్పి… వెంట తీసుకెళ్లాడు. నిర్మానుష్యప్రదేశానికి తీసుకెళ్లి.. అత్యాచారం చేశాడు. తీవ్ర గాయాలపాలైన ఆ చిన్నారిని అత్యంత కర్కశంగా హతమార్చాడు ఆ నీచుడు.
Also Read
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
- Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
Also Read:Gas Discounts: గ్యాస్ వినియోగదారులకు డిస్కౌంట్లు.. మార్చి 31 వరకే అవకాశం..
నార్సింగ్ పరిధిలోని ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు భార్యభర్త. వీరికి ఆరేళ్ల చిన్నారి ఉంది. సాయంత్రం ఆడుకుంటూ కిందపడిన బాలిక మోకాలికి చిన్నగాయం అయ్యింది. ఏడుస్తూ ఉన్న బాలికను చూసిన కిరాతకుడు.. దగ్గరికి వెళ్లి మాయమాటలు చెప్పాడు. దెబ్బకి మందు రాస్తానని… తనతో వస్తే చాక్లెట్లు కూడా ఇస్తానని చెప్పాడు. ఆ చిన్నారి ఆ యువకుడి వెంట వెళ్లింది. సమీపంలోనే ఉన్న నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడటమే కాకుండా.. హత్య చేశాడు. మృతదేహాన్ని ముళ్లపొదల్లో వేసి.. తనకేం తెలియనట్లు ఇంటికి వెళ్లిపోయాడు.
తమ కూతురు కనిపించకపోవడంతో.. అంతటా వెతికిన తల్లిదండ్రులు.. నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… అక్కడి సీసీ ఫుటేజ్‌లను పరిశీలించారు. అదే ప్రాంతంలో ఉండే యువకుడు ఆ పాపను తీసుకెళ్లడం గమనించారు. యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. తనకేం తెలియదని ముందు బుకాయించే ప్రయత్నం చేసినా.. పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించడంతో అసలు నిజం ఒప్పుకున్నాడు. రాత్రి ఒంటి గంట ప్రాంతంలో.. ఆ చిన్నారిని హత్య చేసిన ప్రాంతాన్ని చూపించాడు. మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. పోస్ట్‌మార్టం కోసం తరలించారు. యువకుడిపై కేసు నమోదు చేసి.. రిమాండ్ కు తరలించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!