Rashmi Gautam: చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తా.. యాంకర్ రష్మీకి బెదిరింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Netigen Threatens Rashmi Gautam: సోషల్ మీడియాలో కొందరు నెటిజన్లు హద్దుమీరుతుంటారు. తారల్ని టార్గెట్ చేసి, వారిపై దారుణమైన కామెంట్స్ చేస్తుంటారు. మంచి విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించే విధంగా స్పందించినా సరే, ‘అవన్నీ నీకెందుకు’ అన్నట్టుగా ఘాటు వ్యాఖ్యలతో ఎగబడుతుంటారు. కొందరైతే బెదిరింపులకు కూడా దిగుతుంటారు. ఇలాంటి అనుభవాల్ని పెద్ద పెద్ద సినీ తారలు సైతం ఎదుర్కున్నారు. ఇప్పుడు రష్మీ గౌతమ్‌కి అలాంటి చేదు అనుభవం ఎదురైంది. ఓ నెటిజన్ చేతబడి చేస్తానని, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు.
David Miller: కోహ్లీ కన్నా బాబర్ బెటర్.. డేవిడ్ షాకింగ్ కామెంట్స్
Also Read
- Sharanya: 'లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి' ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
- Hanuman Ansh: ఎవడ్రా చిన్న సినిమా అన్నది? 'ధురంధర్' రికార్డును తుడిచిపెట్టేసిందిగా!
- Varanasi: మహేష్ బాబును అలా ఊహించుకున్నా, ప్రియాంకను అందుకే ఎంచుకున్నా.. రాజమౌళి ఆసక్తికర వ్యాఖ్యలు!
- Aasman Teaser: శ్రీహరి కొడుకు మేఘాంశ్ ‘ఆస్మాన్’ టీజర్ రిలీజ్.. ఆ అడవిలో అసలు ఏం జరుగుతోంది?
అసలేం జరిగిందంటే.. ఇటీవల వీధి కుక్కల దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన ఘటనపై రష్మీ గౌతమ్ తనదైన శైలిలో స్పందించింది. ఈ దాడిపై ఆవేదన వ్యక్తం చేస్తూనే.. శునకాలు కూడా మనలాగే ప్రాణులని, వాటికి ప్రత్యేకంగా వసతి కల్పించాలని ట్వీట్ చేసింది. దీనికితోడు.. గోసంరక్షణ మీద కూడా ట్వీట్ చేసింది. ఈ భూమ్మీద కేవలం మనుషులమే బతుకుతున్నామా? జంతువుల పట్ల మనం ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాం? మన స్వార్థం కోసం వాటిని ఇబ్బందులకు గురి చేస్తున్నామంటూ ట్వీటింది. ఈ ట్వీట్లపై కొందరు నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు మాత్రం నెగెటివ్‌గా రియాక్ట్ అయ్యారు. ఎప్పుడెలా మాట్లాడాలో తెలీదా? అంటూ ప్రశ్నించారు. అయితే.. ఓ నెటిజన్ మాత్రం హద్దు మీరి ప్రవర్తించాడు. బెదిరింపులకు పాల్పడ్డాడు.
Pakistan Economic Crisis: ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..
‘‘నీకు ఆల్రెడీ 40 సంవత్సరాలు వచ్చేశాయి. ఇక ఆలస్యం చేయకుండా వెంటనే పెళ్లి చేసుకో’’ అంటూ మొదట్లో ఓ మెసేజ్ పెట్టాడు. అనంతరం.. ‘‘నీ మీద చేతబడి చేయిస్తా పాపిష్టి దానా, నువ్వు రోడ్డు మీద తిరగకుండా ఇంట్లో ఉండు. ఆవుల వల్ల యాక్సిడెంట్ అవుతాయా? నీ మీద యాసిడ్ పోస్తా. వాటి గురించి నీలాంటి పాపిష్టి వాళ్లకి తెలియదు. నోరు మూసుకుని ఉండు. మొండిగా ప్రవర్తిస్తే కష్టాల్లో పడతావు’’ అంటూ మెసేజ్ పెట్టాడు. అది స్క్రీన్ షాట్ తీసి ట్వీటర్‌లో పోస్ట్ చేసిన రష్మీ.. ‘‘ఈ ఎకౌంట్ ఎవరిదో తెలీదు కానీ, చేతబడి చేస్తా, యాసిడ్ పోస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. మరి, ఇన్ని మాటలన్నందుకు నీపై పోలీసులకు ఫిర్యాదు చేయాలా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.
Naveen Case: నవీన్ హత్య కేసులో మరో ట్విస్ట్.. నిందితుడు కృష్ణ మిస్సింగ్?
This acc sometime back had a problem with my age nd marriage now he /she wants to do black magic on me and pour acid on me
Shud I be filing a complaint now ??? pic.twitter.com/a6SaQO6Tu4— rashmi gautam (@rashmigautam27) February 25, 2023
తాజావార్తలు
-
CM Revanth Reddy : భూ సమస్యలకు చెక్.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయాలు
-
Cigarette Price Hike: సిగరెట్ ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు.. కొత్త రేట్లు ఇవే..
-
Sharanya: ‘లైఫ్ ఆగమాగం చేశారు.. బాబును జాగ్రత్తగా చూసుకోండి’ ఈశ్వర్ సాయి భార్య ఆత్మహత్యాయత్నం..
-
Saudi Arabia: సౌదీ F-15ను కూల్చేశాం, మక్కాపై దాడి చేయలేదు.. హౌతీల సంచలన ప్రకటన..
-
Hyderabad: బ్యాచిలర్లకు గుడ్ న్యూస్.. వినాయక చవితి అన్నదానాల కోసం సరికొత్త వెబ్సైట్.. పూర్తి వివరాలు ఇవే..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!