హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ప్రముఖ సంగీత దర్శకులు ఇళయరాజా లైవ్ కన్సర్ట్ ను నిర్వహించారు. శనివారం సాయంత్రం 6:30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు రెడ్ కార్పెట్ ఈవెంట్ కార్యక్రమం కొనసాగింది. ఇళయరాజా దర్శకత్వం వహించిన సినిమాలలోని అలనాటి మధురమైన పాటలను ఆయన ముందే గాయనీ గాయకులు వీనులవిందుగా ఆలపించారు. ఇళయరాజా పాటలు శ్రోతలను ఉర్రూతలూగించాయి. సినీరంగ ప్రముఖులు రాజా సర్ కి అభినందన పేరుతో సంగీత దర్శకుడు ఇళయరాజాకు సన్మానం చేశారు.
Read Also: Cyber Fraud: అక్షరం మార్చి అక్షరాల కోటి రూపాయలు కొట్టేశారు
తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితుల ఆశీర్వచనాలతో ఆయనను ఘనంగా సత్కరించారు. ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, సంగీత దర్శకులు, గాయనీగాయకులు ఇళయరాజాను శాలువాతో సన్మానించారు. దర్శకుడు కోదండరామిరెడ్డి, నిర్మాత అశ్వినీదత్, సంగీత దర్శకులు మణిశర్మ, ఆర్.పీ.పట్నాయక్, పాటల రచయిత హరిరామజోగయ్య శాస్త్రి, నిర్మాత సీ.కళ్యాణ్, నడుడు మురళీమోహన్, ప్రముఖనటి మృణాల్ ఠాకూర్, గాయని సునీత, నటుడు రఘుబాబులు ఇళయరాజాను సన్మానించారు. ఇళయరాజా 80ఏళ్లలోకి అడుగుపెడుతున్న సందర్బంగా 80 ఏళ్ల లోగోను ప్రముఖ రచయితా విజయేంద్రప్రసాద్ రిమోట్ తో ఆవిష్కరించారు. కమ్మని సంగీతం..ఎంత విన్నా…వినాలనిపించే సాహిత్యం ఇళయరాజా పాటల్లో ఉంటుందని అని సినీ ప్రమఖులు ఇళయరాజాని కొనియాడారు.
Read Also: Top Headlines @9AM: టాప్ న్యూస్