Sri Lanka Fuel Crisis: శ్రీలంక ను కుదిపేస్తున్న ఇంధన కొరత.. పనిదినాలు కుదింపు..
- శ్రీలంకను కుదిపేస్తున్న ఇంధన కొరత..
- ముందు జాగ్రత్తగా పలు చర్యలు తీసుకుంటున్నట్లు లంక ప్రభుత్వం..
- శ్రీలంకలో ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి అదనపు సెలవు..
- వారానికి నాలుగు రోజుల పని విధానం అమలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sri Lanka Fuel Crisis: ఇంధన కొరత చాలా దేశాలను వేధిస్తోంది.. ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వారానికి ఐదు రోజులుగా ఉన్న పని దినాలను నాలుగు రోజులకు కుదిస్తూ కొత్త విధానాన్ని ప్రకటించింది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ప్రతి బుధవారం సెలవు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ కొత్త విధానం మార్చి 18 నుంచి అమలులోకి రానుంది.
ఇంధన వినియోగం తగ్గించడమే లక్ష్యం
దేశంలో ప్రస్తుతం పెద్దగా ఇంధన కొరత లేదని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, భవిష్యత్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ముందస్తు చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యోగుల రాకపోకల్లో ఇంధన వినియోగం తగ్గించడమే ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ ఉద్యోగులు వారానికి నాలుగు రోజులే పని చేయాల్సి ఉంటుంది. మిగిలిన నాలుగు రోజుల్లో ఎంతమంది ఉద్యోగులు కార్యాలయాలకు హాజరు కావాలన్నది ఆయా శాఖాధిపతులు నిర్ణయిస్తారు.
Also Read
- Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
- US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
- Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి
అయితే, ఆరోగ్య రంగం, ఓడరేవులు, నీటి సరఫరా వంటి అత్యవసర సేవలు మాత్రం అన్ని రోజులు కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. మరోవైపు.. ఈ నిర్ణయం పాఠశాలలు, కళాశాలలకు కూడా వర్తించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అవసరమైతే విశ్వవిద్యాలయాల్లో ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. అదేవిధంగా ప్రభుత్వ వేడుకలను కూడా తాత్కాలికంగా నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
తాజావార్తలు
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
-
Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ ‘విరాట్ గర్జన’.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
-
Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
-
LPG Subsidy: సిలిండర్ బుక్ చేసుకునేవారికి శుభవార్త.. రూ.300 సబ్సిడీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!