Tollywood Progress Report: ఈ మాసం ‘సార్’ దే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tollywood: ఈ యేడాది జనవరిలో అనువాద చిత్రాలతో కలిపి కేవలం 15 సినిమాలు విడుదల కాగా.. ఫిబ్రవరి నెలలో మొత్తం 22 సినిమాలు థియేటర్లలో సందడి చేశాయి. అందులో 19 స్ట్రయిట్ చిత్రాలు, మూడు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి.
ఫిబ్రవరి మొదటి వారాంతంలో ఆరు చిత్రాలు విడుదల కాగా సందీప్ కిషన్ నటించిన ‘మైఖేల్’పై పలువురు భారీ ఆశలు పెట్టుకున్నారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలో విడుదలైన ఈ సినిమా ఆ ఆశలను వమ్ము చేసింది. అదే వారం వచ్చిన ‘ప్రేమదేశం, రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం, సువర్ణ సుందరి’ తదితర చిత్రాలు సైతం పెద్దంత మెప్పించలేకపోయాయి. అయితే హాస్యనటుడు సుహాస్ హీరోగా రూపుదిద్దుకున్న ‘రైటర్ పద్మభూషణ్’ వినోదంతో పాటు సందేశాన్ని అందించి, పలువురిని ఆకట్టుకుంది. ఈ చిత్రానికి విమర్శకుల ప్రశంసలూ దక్కాయి. ఇక మలయాళ రీమేక్ గా వచ్చిన ‘బుట్టబొమ్మ’ తెలుగువారిని మాత్రం మెప్పించలేకపోయింది.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Swara Bhasker: ‘‘రామ మందిర తీర్పుతో బాధపడ్డా.. షారుఖ్, సల్మాన్‌లకు క్షమాపణలు’’.. స్వరా భాస్కర్ మరో వివాదం..
- Udaya Bhanu: 'పీఆర్' పాలిటిక్స్..ఉదయభాను బాధ కరెక్టే, కానీ తప్పదు?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
సెకండ్ వీకెండ్ లో కన్నడ అనువాద చిత్రం ‘శివ వేద’తో పాటుగా ఏడు స్ట్రయిట్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన ‘అమిగోస్’కు రిలీజ్ ముందు పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. కానీ సినిమా మాత్రం ఆ స్థాయిలో విజయాన్ని సాధించలేదు. జనవరిలో ‘వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య’తో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న మైత్రీ మూవీమేకర్స్ సంస్థకు ‘అమిగోస్’ హ్యాట్రిక్ ను అందించలేకపోయింది. ఇక త్రిగుణ్, అవికాగోర్ జంటగా నటించిన ‘పాప్ కార్న్’, బాబీ సింహా హీరోగా నటించిన ‘వసంత కోకిల’ చిత్రాలు కూడా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి.
థర్డ్ వీకెండ్ లో వచ్చిన ధనుష్ ‘సార్’ చిత్రం చక్కని విజయాన్ని అందుకుని ఈ నెలలోనే సూపర్ హిట్ చిత్రంగా నిలిచింది. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. సినిమాకు డివైడ్ టాక్ వచ్చినా ధనుష్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కారణంగా తమిళంలోనూ, కథలోని విలువల కారణంగా తెలుగులోనూ మూవీ పాసైపోయింది. అంతే కాదు… ఫస్ట్ వీకెండ్ లో రూ. 50 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సార్’, 25వ తేదీకి వరల్డ్ వైడ్ రూ. 75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. సో.. ఈ నెలలో సితార ఎంటర్ టైన్ మెంట్స్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చిందని చెప్పాలి. ఈ సంస్థ నుండి వచ్చిన ‘బుట్టబొమ్మ’ పరాజయం పాలు కాగా ఆ లోటును ‘సార్’ సక్సెస్ తీర్చేసింది. ఇక ‘సార్’తో పాటు వచ్చిన కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’కు పాజిటివ్ టాక్ వచ్చినా… కలెక్షన్లు మాత్రం ఆ స్థాయిలో రావడం లేదు. అయితే… జీఎ 2 బ్యానర్ లో వచ్చిన ఈ సినిమా ఆడియెన్స్ నుండి ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్ గా పేరు తెచ్చుకుంది. ఈ నెల లాస్ట్ వీకెండ్ లో మూడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో ‘కోనసీమ థగ్స్’ మాత్రమే ఫర్వాలేదనిపించుకుంది. ఏదేమైనా… ఫిబ్రవరిలో విడుదలైన 22న చిత్రాలలో లాభాలు గడించిన చిత్రాలు రెండు, మూడు మించి లేకపోవడం బాధాకరం!!
తాజావార్తలు
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!