Shalu Chourasiya: మరోసారి వార్తలోకి ఎక్కారు నటి చౌరాసియా.. కేబీఆర్ పార్క్‌లో తనను వేధింపులకు గురిచేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు.. నన్ను ఓ యువకుడు వేధించాడని ఫిర్యాదు చేసింది నటి చౌరాసియా .. వాకింగ్ చేస్తుంటే యువకుడు వెంట పడ్డాడని తన ఫిర్యాదులో పేర్కొంది.. అయితే, ఈ ఘటనతో రంగంలోకి దిగిన పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలించారు.. నటి చౌరాసియా వెంట ఎవరూ పడలేదని తేల్చారు పోలీసులు.. ఈ వ్యవహారంలో చౌరాసియా కు కౌన్సిలింగ్ చేసి పంపించారు బంజారాహిల్స్ పోలీసులు.. అయితే, నవంబర్ 17, 2021లో ఇదే తరహాలో దాడి జరిగిందని ఫిర్యాదు చేశారు చౌరాసియా.. ఈ ఘటన అప్పట్లో కలలం రేపింది.. ఇక, తాజా ఘటనపై బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నటీ చౌరాసియా జాకింగ్ చేసుకుంటా వెళ్తుంటే వెనకనుంచి ఫాలో చేశాడని ఫిర్యాదు ఇవ్వడం జరిగింది.. విచారించి చూడగా అతను కూడా జాగింగ్ చేస్తున్నాడని పోలీసులు నిర్ధారించారు.. అతడిని విచారించి, ఎక్కడుంటారని పూర్తి వివరాలు తెలుసుకొని వదిలేశామని తెలిపారు.
Read Also: Election Updates: త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం
అయితే, గతంలోనూ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు బయట వాకింగ్‌కు వచ్చిన సినీనటి షాలూ చౌరాసియాపై గుర్తు తెలియని వ్యక్తి దాడికి పాల్పడ్డాడు.. రాత్రి 8.40 గంటల సమయంలో వాకింగ్ చేస్తున్న షాలూను కొంతదూరం ఫాలో అయ్యాడు. ఆ తర్వాత జూబ్లీహిల్స్ రోడ్ నెం 92లోని స్టార్‌బక్స్ ఎదురుగా నిర్మానుష్య ప్రాంతం వద్ద దాడికి దిగాడు. ఆమె కేకలు పెట్టకుండా నోటికి గుడ్డలు అడ్డుపెట్టి.. పక్కనే ఉన్న బండరాయికి అదిమిపెట్టాడు.అతడ్ని బలంగా ప్రతిఘటించిన నటి.. పక్కనే ఉన్న గేటు వైపు పరిగెత్తింది. స్టార్ బక్స్ వద్ద పనిచేస్తున్న కొందరు డ్రైవర్ల సాయంతో జరిగిన విషయాన్ని తల్లికి ఫోన్ చేసి చెప్పింది. స్థానికులు డయల్ 100కు ఫోన్ చేయగా, బంజారాహిల్స్ పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి.. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు.. కేవలం ఆభరణాలు, సెల్‌ఫోన్ కోసమే దాడికి పాల్పడ్డాడా..లేక మరేదైనా కారణం ఉందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేశారు..
Read Also: Leela Pavithra: నేడు లీలా పవిత్ర అంత్యక్రియలు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
ఈ దాడి కేసులో పోలీసుల విచారణలో అనేక విషయాలు వెలుగు చూశాయి. నటిపై దాడికి తెగబడింది సైకో అని భావించారు.. దుండగుడు నటిపై దాడి చేసి ఆమెను బలవంతంగా పొదల్లోకి లాక్కెళ్లే ప్రయత్నం చేశాడని గుర్తించారు. నటి పెదవులు, మెడపై దాడి కూడా చేసినట్లు తెలిపారు. నటి పట్ల దుండగుడు అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులు తెలిపారు. ఇక, నిందితుడు వదిలి వెళ్లిన పౌచ్ తో వేలి ముద్రలు కనిపెట్టి, నిందితుడి డ్రెస్, షూస్ తో పాటు ఫోన్ లొకేషన్ ఆధారంగా, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు. నటిపై దాడి చేసిన వ్యక్తి పేరు బాబుగా గుర్తించారు. హైదరాబాద్ కృష్ణానగర్లో బాబు నివాసం ఉంటాడని.. సినిమాల్లో లైట్ మేన్ గా పనిచేస్తున్నట్లు తెలిపారు. గతంలో.. ఈ ఘటన జరగగా.. ఇప్పుడు మరోసారి నటి చౌరాసియా పోలీసులకు ఫిర్యాదు చేశారు.