దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న క్రేజీ మల్టీస్టారర్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం అక్టోబర్ 13, 2021 విడుదల కానుంది. కాగా, షూటింగ్ ఇంకా సెట్స్ మీదే ఉండటంతో విడుదల ఆలస్యం అవుతుందనే ప్రచారం జరుగుతోంది. అయితే, చెప్పిన తేదీకే ఈ చిత్రాన్ని థియేటర్లోకి తీసుకొచ్చేందుకు రాజమౌళి గట్టిగానే ప్రయాణిస్తున్నారు.…
‘దేవి’, ‘పెదరాయుడు’ చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర, శ్రద్ధా దాస్, అజయ్, ఆమని, సాహితీ అవంచ, ‘వైశాలి’ ఫేమ్ నందన్ ప్రధాన తారలుగా రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘అర్థం’. ఈ సినిమాను రాధికా శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ఈ మూవీ తెరకెక్కింది. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దీనికి రచయిత, దర్శకుడు. ప్రముఖ సంగీత దర్శకులు తమన్…
ఎనిమిదేళ్ళ క్రితం రాజ్ తరుణ్ ను ‘ఉయ్యాలా జంపాలా’ చిత్రంతో పరిచయం చేశాడు నాగార్జున. ఆ తర్వాత ఐదేళ్ళకు రాజ్ తరుణ్ తోనే ‘రంగుల రాట్నం’ మూవీని ప్రొడ్యూస్ చేశాడు. మళ్లీ ఇప్పుడు ముచ్చటగా రాజ్ తరుణ్ తో మూడో సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు నాగార్జున. హడావుడీ లేకుండా మొదలైన ఆ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుందట. 2016లో రాజ్ తరుణ్ హీరోగా ‘సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలు’ చిత్రాన్ని…
ప్రముఖ కమెడియన్ శ్రీనివాసరెడ్డి ఇప్పుడు హీరోగానూ పలు చిత్రాలలో నటిస్తున్నాడు. మరికొన్ని సినిమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే శ్రీనివాసరెడ్డి నటించిన ‘ముగ్గురు మొనగాళ్ళు’ చిత్రం విడుదలైంది. ‘ప్లాన్ బి’ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో అతను కీలక పాత్ర పోషించిన మరో సినిమా ‘హౌస్ అరెస్ట్’ ఈ నెల 27న విడుదల కాబోతోంది. సినిమా పంపిణీ రంగంలో ఉన్న కె. నిరంజన్ రెడ్డి చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి, తొలియత్నంగా ‘హౌస్ అరెస్ట్’…
ఆది సాయికుమార్ హీరోగా, వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో ‘కిరాతక’ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో కొన్ని నెలల క్రితం నాగం తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఆది సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోందంటూ కొద్ది రోజుల క్రితం పోస్టర్స్ నూ రిలీజ్ చేశారు. అంతేకాదు… ఆగస్ట్ 13 నుండి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలవుతుందని, పూర్ణ ఇందులో పోలీస్ అధికారిగా కీలక పాత్ర పోషించబోతోందని ప్రకటించారు. కానీ ఆగస్ట్ 13న ఆ సినిమా…
సునీల్, ధన్‌రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ ‘బుజ్జి ఇలా రా’. సైకలాజికల్ థ్రిల్లర్.. అనేది మూవీ ట్యాగ్‌లైన్. దీనిని బట్టే సినిమా జానర్ ఏమిటనేది అర్థమవుతుంది. చాందిని అయ్యంగార్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ కొద్ది రోజుల క్రితం విడుదలై, మంచి స్పందనను రాబట్టుకుంది. తాజాగా ఈ సినిమాలో సీఐ కేశవ్ నాయుడు పాత్రలో నటిస్తున్న ధన్‌రాజ్ పాత్రకు సంబంధించిన లుక్‌ను ప్రముఖ హీరో సందీప్ కిషన్ విడుదల చేశారు. ‘గరుడవేగ’ అంజి…
ప్రస్తుత ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిధులు దుర్వినియోగానికి పాల్పడ్డారని నటి హేమ ఆరోపించడంతో టాలీవుడ్లో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిధులను దుబారా చేస్తున్నారని, రూ. 5 కోట్లలో రూ. 3 కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. హేమ ఆరోపణలపై నరేశ్‌తో పాటు ‘మా’ జనరల్ సెక్రటరీ జీవితా రాజశేఖర్ తీవ్రంగా తప్పుపట్టారు. ‘మా’ ప్రతిష్ఠను దిగజార్చేలా మాట్లాడిందని క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ చేయడంతో హేమకు నోటీసులు జారీ అయ్యాయి. ఆమెను వివరణ ఇవ్వాలని క్రమశిక్షణ…
నటుడిగా, దర్శకుడిగా తన ప్రత్యేకతను చాటుకుంటోన్న అవసరాల శ్రీనివాస్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 101 జిల్లాల అందగాడు. బట్టతల ఉండే యువకుడు గొత్తి సత్యనారాయణగా అవసరాల శ్రీనివాస్ నటించిన ఈ చిత్రంలో, ఆయన ప్రేయసి పాత్రలో రుహానీ శర్మ నటించారు. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ద్వారా రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్, ఎస్వీసీ-ఎఫ్ఈఈ బ్యానర్స్‌పై దిల్‌రాజు, డైరెక్టర్ క్రిష్ సమర్పణలో శిరీష్,…
సుధీర్ బాబు, ఆనంది ప్రధాన పాత్రల్లో పలాస 1978 ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో 70mm ఎంటర్టైన్మెంట్ పతాకంపై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. ఆగస్ట్ 27న ఈ సినిమా థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ఫస్ట్ లుక్, సుధీర్ బాబు ఇంట్రడక్షన్ టీజర్, పాటలకు చక్కటి స్పందన లభించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరిగిందట.…
సినీ పరిశ్రమలో సమస్యల పరిష్కారంపై చర్చకు మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించారు ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఈమేరకు రాష్ట్ర సమాచార శాఖ మంత్రి పేర్ని నాని, చిరుతో ఫోన్ లో మాట్లాడారు. సినీపెద్దలతో కలిసి వచ్చి ప్రస్తుత సిని ఇండస్ట్రీ, థియేటర్ సమస్యలను వివరించాల్సిందిగా చిరంజీవిని ఏపీ ముఖ్యమంత్రి తరపున మంత్రి పేర్ని నాని ఆహ్వానించారు. ఈ కీలక భేటీలో ప్రస్తుతం ఉన్న థియేటర్ల సమస్య గురించి.. టిక్కెట్ రేట్ల గురించి సినీ కార్మికుల బతుకు…