ఆర్‌ఆర్‌ఆర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇస్తోంది బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్. ఇందులో చరణ్ కి జోడీగా నటిస్తోంది ఆలియా. అయితే ఆలియా టాలీవుడ్ లో మరో సినిమాకు ఓకె చెప్పిందట. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం జూనియర్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న సినిమాలో ఆలియా నటించబోతోందట. ఎన్టీఆర్ నటిస్తున్న 30 వ చిత్రమిది. దీని కోసం అద్భుతమైన కథను రెడీ చేశాడు కొరటాల. ఎప్పటిలాగే తనదైన సోషల్ మెసేజ్ మిస్ కాకుండా పవర్ ఫుల్ సబ్జెక్ట్ తయారు చేశాడు. ఇందులో ఎన్టీఆర్ విద్యార్థిగాను, ఓ కంపెనీ సిఇవోగాను కనిపిస్తాడట. ఇంతకు ముందు జూనియర్, కొరటాల కలయికలో ‘జనతా గ్యారేజ్’ వచ్చి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు వీరిద్దరి కలయికలో రానున్న సినిమాను దసరాకి పూజతో మొదలవుతుందట. రెగ్యులర్ షూటింగ్ నవంబర్ నుంచి జరుగుతుంది. భారీ బడ్జెట్‌తో పాన్-ఇండియా స్థాయిలో రూపొందే ఈ సినిమాను నందమూరి కళ్యాణ్ రామ్ తో కలసి ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ పతాకంపై మిక్కిలినేని నిర్మిస్తారు.