(జూలై 4 సత్యదేవ్ బర్త్ డే సందర్భంగా…) వైజాగ్ లో పుట్టి, విజయనగరంలో ఇంజనీరింగ్ చదివి, బెంగళూర్ లో సాఫ్ట్ వేర్ జాబ్ చేసి… హైదరాబాద్ లో నటుడిగా స్థిరపడ్డాడు సత్యదేవ్. అందరిలా అతను కేవలం నటుడు కాదు… విలక్షణ పాత్రలు చేస్తున్న సలక్షణ నటుడు. జూలై 4, 1989లో పుట్టిన సత్యదేవ్ ఇవాళ 33వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాడు. నటుడు కావాలనే కోరికతో తీవ్రమైన ప్రయత్నాలు చేసి, ఒకటి రెండు సినిమాల్లో ఇలా కనిపించి అలా…
భారత ప్రభుత్వం తాజాగా చేసిన సినిమాటోగ్రఫీ సవరణ వల్ల భావ ప్రకటనా స్వేచ్ఛకు భారీ దెబ్బ తగలనుంది. దీనివల్ల 1952 నాటి సినిమాటోగ్రఫీ చట్టాన్ని అనుసరించి సెన్సార్ బోర్డ్ క్లీన్-చిట్ ఇచ్చిన చిత్రాలను తిరిగి కేంద్ర ప్రభుత్వం సినిమాలను రీఎగ్జామ్ చేసే అధికారం రానుంది. అంటేపరోక్షంగా సెన్సార్ బోర్డు నుండి క్లియరెన్స్ పొందిన ఏ చిత్రంనైనా నిషేధించటం లేదా చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికి ఏర్పడుతుంది. ఈ బిల్లుకు వ్యతిరేకంగా వివిధ సినీ పరిశ్రమలకు చెందిన పలువురు…
సీనియర్ స్టార్ హీరోలలో యమజోరుగా ఉంది విక్టరీ వెంకటేశే! ఈ యేడాది ద్వితీయార్థంలో వెంకీమామ నటిస్తున్న మూడు చిత్రాలు బ్యాక్ టు బ్యాక్ విడుదల కాబోతున్నాయి. సెన్సార్ ను కూడా పూర్తి చేసుకున్న తమిళ ‘అసురన్’ తెలుగు రీమేక్ ‘నారప్ప’ అతి త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ చివరి దశలో ఉన్న మలయాళ రీమేక్ ‘దృశ్యం -2’ సైతం ఓటీటీ వైపే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. అయితే… వీటి స్ట్రీమింగ్…
(జూన్ 30న అల్లరి నరేశ్ పుట్టినరోజు) మొదట్లో పెన్నూ, పేపర్ పట్టుకొని స్క్రిప్ట్ రాయాలి, డైరెక్షన్ చేయాలి అంటూ ఇ.వి.వి.సత్యనారాయణ చిన్న కొడుకు నరేశ్ ఆరాటపడేవాడు. అయితే అప్పటికే తండ్రి దర్శకత్వం వహించిన ఒకట్రెండు సినిమాల్లో బాలనటునిగా దర్శనమిచ్చాడు. కానీ, ఇ.వి.వి. మాత్రం తన పెద్దకొడుకు రాజేశ్ ను హీరోని చేయాలని ఆశించారు. కానీ, తొలుత తెరపై కనిపించిన నరేశ్ నే నటన ఆవహించింది. నటునిగా సక్సెస్ దరి చేరింది. ఈ తరం హీరోల్లో అతివేగంగా యాభై…
(జూన్ 30న నటదర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ బర్త్ డే) తెలుగు సినిమా రంగంలో ఎవరికైనా సమస్య వచ్చినా, కష్టం వచ్చినా అప్పట్లో మదరాసులోని యన్టీఆర్ ఇంటి తలుపు తట్టేవారు. తెలుగు సినిమా పరిశ్రమ హైదరాబాద్ కు మారిన తరువాత ఆ స్థానాన్ని దాసరి నారాయణరావు ఆక్రమించారు. ఏ సమయంలో దాసరి ఇంటి తలుపు తట్టినా, తమకు న్యాయం జరుగుతుందని సినిమా రంగంలో ఎంతోమంది ఆశించేవారు. దాసరి ఉన్న రోజుల్లోనే అదే తీరున నేనున్నానంటూ చిత్రపరిశ్రమలోని కార్మికులను ఆదుకున్నవారిలో…
టాలీవుడ్ తార నివేథా థామస్ మొదటి సినిమా ‘జెంటిల్ మెన్’ తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరువాత వచ్చిన అవకాశాలతో టాలీవుడ్ లో తన మార్క్ అందంతో ఆకట్టుకుంటుంది. రీసెంట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో నటించిన ఆమెకు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘శాకిని ఢాకిని’చిత్రంలో రెజీనా కసాండ్రతో కలిసి నటిస్తోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇదిలావుంటే, తాజాగా నివేథా థామస్ గాయనిగా గీటార్…
తెలుగమ్మాయి ఈషా రెబ్బా అందం, అభినయంతో తన ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. స్టార్ హీరోయిన్గా ఎదగలేకపోయినా ఈషా మాత్రం స్టార్ డమ్ కోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తోంది. తరచుగా సోషల్ మీడియాలో హాట్ స్టిల్స్తో సందడి చేసే ఈ బ్యూటీకి చాలా మంది అభిమానులే ఉన్నారు. అయితే తాజాగా ఈషా భుజంపై ఎర్రగా కందిన గాయం నెటిజన్స్ కి కనిపిస్తుంది. ఇంకేముంది.. తెగ కామెంట్స్ తో ఏమైంది అంటూ అడుగుతున్నారు. వ్యాక్సినేషన్ కారణంగా గాయం అయ్యి…
అందాల కథానాయిక పూర్ణ, అర్జున్ అంబటి, రాకేందు మౌళి ప్రధాన పాత్రదారులుగా కళ్యాణ్ జి. గోగణ దర్శకత్వంలో రిజ్వాన్ నిర్మిస్తోన్న’సుందరి’ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను జరుపుకుంది. దీనికి సెన్సార్ సభ్యులు ‘యు/ఎ’ సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు కళ్యాణ్ జి గోగణ మాట్లాడుతూ, ”నాకు మాస్ హీరో సెంట్రిక్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. లాక్డౌన్ టైంలో ఏదైనా డిఫరెంట్ కాన్సెప్ట్ ఫిల్మ్ చెయ్యాలని అనుకున్నాను. అప్పుడు లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ చేస్తే బాగుంటుందని…
శర్వానంద్, సిద్ధార్థ్ కథానాయకులుగా దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘మహా సముద్రం’.. అను ఇమ్మాన్యుయేల్, అదితీరావు హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటోంది. ఓ గాఢమైన ప్రేమకథతో రూపొందుతోన్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ కు కూడా అధిక ప్రాధాన్యత ఉండనున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో ‘గరుడ’ రామ్ కనిపించనున్నారు. తాజాగా ఆయన పోషిస్తున్న ‘ధనుంజయ్’ పాత్రను తెలియజేస్తూ…