యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా ‘శేఖర్’. ‘మ్యాన్ విత్ ద స్కార్’ అనేది ఉపశీర్షిక. లలిత్ దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్య ప్రొడక్షన్స్, పెగాసస్ సినీ కార్ప్ పతాకాలపై ఎమ్.ఎల్.వి. సత్యనారాయణ, శివాని, శివాత్మిక, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మిస్తున్నారు. అరకులో బుధవారం తాజా షెడ్యూల్ మొదలైంది. దీంతో 75 శాతం చిత్రీకరణ పూర్తి కానుంది. దర్శకుడు లలిత్ మాట్లాడుతూ “కరోనా సెకండ్ వేవ్ కారణంగా చిత్రీకరణకు విరామం వచ్చింది. ఈ రోజు అరకులో…
యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ యాక్షన్ సినిమాలను చేయడానికి చాలా ఆసక్తిని చూపుతుంటారు. తెలుగు బ్లాక్బస్టర్ మూవీ ఛత్రపతి రీమేక్ ద్వారా సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ యంగ్ హీరో ఎగ్జయిటింగ్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. స్టూవర్టుపురం దొంగ పేరుతో బెల్లంకొండ సురేశ్ ఓ చిత్రాన్ని అనౌన్స్ చేస్తూ టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. 1970 కాలంలో స్టూవర్టుపురం ప్రాంతానికి చెందిన ప్రముఖ గజదొంగ…
లాస్ ఏంజెల్స్ టాకీస్ పతాకంపై కిషన్ సాగర్ దర్శకత్వంలో అల్లూరి సూర్యప్రసాద్, సంధ్య రవి సంయుక్తంగా నిర్మించిన ప్రేమకథా చిత్రం ‘మౌనమ్’. పవర్ ఆఫ్ సైలెన్స్ అన్నది ట్యాగ్ లైన్. ‘మల్లెపువ్వు’ ఫేమ్ మురళీ, ‘వరుడు’ ఫేమ్ భానుశ్రీ జంటగా నటించిన ఈ సినిమాకు ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘మణిరత్నం ‘మౌనరాగం’ తరహాలో రూపుదిద్దుకున్న…
యంగ్ హీరో శ్రీ విష్ణు హీరోగా కామెడీ నేపథ్యంలో వస్తున్న సినిమా ‘రాజ రాజ చోర’. ఈమధ్య కాలంలో వచ్చిన శ్రీ విష్ణు సినిమాలన్ని కామెడీ నేపథ్యంలోనే సాగుతున్నాయి. ఆయన నటించిన సినిమాల్లో ‘బ్రోచేవారెవరురా’ మంచి క్రైమ్ కామెడీ సినిమాగా మిగిలింది. అప్పటినుంచి శ్రీ విష్ణు ఒక్కో మెట్టు ఎక్కుతూ వస్తున్నాడు. ప్రస్తుతం ‘రాజ రాజ చోర’ సినిమా కూడా పోస్టర్లు, టీజర్ తో అలాంటి బజ్ క్రియేట్ చేస్తుంది. శ్రీ విష్ణు సరసన మేఘా ఆకాష్,…
కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో జూలై 23 నుండి సినిమాలు విడుదల కావడం మొదలైంది. ఆ శుక్రవారం ‘నేరగాడు’ అనే తమిళ డబ్బింగ్ మూవీ విడుదలైతే, జూలై 30న ‘తిమ్మరుసు’లో కలిపి ఐదు చిత్రాలు విడుదలయ్యాయి. అయితే ‘తిమ్మరుసు’ మూవీ మాత్రమే ఫర్వాలేదనిపించింది. ఇక ఆగస్ట్ ఫస్ట్ వీకెండ్ లో డబ్బింగ్ తో కలిసి ఏడు సినిమాలు రిలీజ్ అయ్యాయి. విశేషం ఏమంటే… ఇందులో ‘ఎస్. ఆర్. కళ్యాణ మండపం’ సూపర్ హిట్ అయిపోయింది.…
మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు తీవ్రమైన ఆరోపణలు చేస్తుండటంతో ఈసారి ఎన్నికలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తాజాగా నటి హేమకు ‘మా’ క్రమశిక్షణ సంఘం నోటీసులు జారీ చేసింది. ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేష్పై చేసిన ఆరోపణలకు వివరణ కోరుతూ హేమకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.మా ఎన్నికలు జరకుండా చేసి, అధ్యక్షుడిగా కొనసాగాలని నరేష్ పావులు కదుపుతున్నారని ఆమె ఆరోపించింది. అంతేకాక ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ నటి హేమ…
మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన ‘సర్కారు వారి పాట’ బర్త్ డే బ్లాస్టర్ యు ట్యూబ్ ను షేక్ చేసింది. సర్కారు వారి బ్లాస్టర్ అభిమానులనే కాదు.. సాధారణ ప్రేక్షకులను కూడా విశేషంగా ఆకట్టుకుంది. దీంతో టాలీవుడ్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. విడుదలైన 24 గంటల్లో 25.7 మిలియన్ వ్యూస్ సాధించి మొదటి స్థానంలో నిలిచింది. అలాగే 754K లైక్స్ కూడా రాబట్టడం విశేషం. కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశురామ్ దర్శకత్వంలో…
జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ కాలికి గాయమైంది. పొరపాటున జారి పడటంతో కాలికి చిన్నపాటి ఫ్యాక్చర్ అయ్యిందని స్వయంగా ప్రకాశ్ రాజ్ ట్వీట్ చేశారు. మిత్రుడు డాక్టర్ గురవారెడ్డి చేత సర్జరీ చేయించుకోవడానికి విమానంలో హైదరాబాద్ కు బయలు దేరినట్టు ప్రకాశ్ రాజ్ చెప్పారు. కంగారు పడాల్సింది ఏమీ లేదని, తాను బాగానే ఉన్నానని ప్రకాశ్ రాజ్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలను వచ్చే నెల రెండోవారం…
‘మా’ ఎన్నికలు చర్చనీయాంశంగా మారడంతో ఎట్టకేలకు మెగాస్టార్ స్పందించారు. గతంలో ఎన్నడూ లేనంతగా మా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న సభ్యులు ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పోటీదారుల మధ్య చీలిక రావటం, ఎన్నడూ లేనంతగా పోటీదారుల సంఖ్య పెరుగుతుండటంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, హేమ, బాలకృష్ణ, జీవిత, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ వ్యాఖ్యలతో ‘మా’ ఎన్నికలు వివాదంగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్…
గత కొన్ని రోజులుగా హిందూ ధార్మిక సంస్థల ప్రతినిధులు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, నిర్మాతల మండలి, దర్శకుల సంఘం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ‘ఇప్పుడు కాక ఇంకెప్పుడు’ చిత్రంలో భజ గోవిందం పదాన్ని ఎరోటిక్ సీన్స్ నేపథ్యంలో వాడారని, దాన్ని వెంటనే తొలగించాలని, లేకపోతే తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్స్ లోనూ కేసులు పెట్టారు. దాంతో దర్శకుడు యుగంధర్ తన ప్రమేయం లేకుండా ఆ పదం పొరపాటున ట్రైలర్ లో చేరిందని బేషరతుగా…