జాతీయ ఉత్తమ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల ధనుష్ తమిళ చిత్రం షూటింగ్ లో పాల్గొన్న సమయంలో పొరపాటున జారిపడటంతో భుజానికి గాయమైంది. చేతి ఎముక చిట్లడంతో హుటాహుటిన హైదరాబాద్ వచ్చి డాక్టర్ గురవారెడ్డి సమక్షంలో ఆపరేషన్ చేయించుకున్నారు. ప్రస్తుతం ఆయన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. రేపు ఆగస్ట్ 15 దేశ స్వాతంత్ర్య దినోత్సవం! ఆ సందర్భంగా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకూ అవకాశం ఉన్నవాళ్ళంతా జెండా ఎగరేస్తారు లేదా ఎవరైనా ఎగరేసిన జాతీయ జెండాకు వందనం…
బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా కెఎస్ క్రియేషన్స్ పతాకంపై బోడెంపూడి కిరణ్ కుమార్ సమర్పణలో తెరకెక్కిన సినిమా ‘బజార్ రౌడి’. వసంత నాగేశ్వరరావు దర్శకత్వంలో సంధిరెడ్డి శ్రీనివాసరావు నిర్మించారు. ఇప్పటికే ఫస్ట్ లుక్, టీజర్ తో ఆకట్టుకున్నాడు ‘బజార్ రౌడీ’. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. U/A సర్టిఫికేట్ తో రానుంది. పెద్దలు, పిల్లలు అందరూ సినిమా చూడొచ్చని సెన్సార్ వారు చెప్పారని, సినిమా చూస్తున్నంత సేపు హాయిగా నవ్వుకోవచ్చని యూనిట్ అంటోంది. మరుధూరి…
‘పాగల్’… హీరో విశ్వక్ సేన్ చేసిన సినిమాలు వేళ్ళమీద లెక్కబెట్టవచ్చు. వాటిలో హిట్స్ అంటే ఒక్క ‘హిట్’ మాత్రమే. అదీ ఓ మాదిరి హిట్. అంతకు ముందు చేసిన వాటిలో ‘ఫలక్ నుమా దాస్’ సో..సో. అయితే ఇతగాడి మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. ఇటీవల అతను పాల్గొన్న వేడుకల్లో స్పీచెస్ వింటే అది ఇట్టే అర్థం అవుతుంది. అప్పుడే తానో సూపర్ స్టార్ అయినట్లు ఫీలవుతుంటాడు. విజయ్ దేవరకొండ స్థాయిలో ఇమేజ్ వచ్చినట్లు బిల్డప్ ఇస్తుంటాడు.…
టాప్ హీరోల సినిమాలు ఆది నుంచీ అంతం దాకా క్రేజీగానే సాగుతుంటాయి. ఇక ఇప్పుడు పవన్ , రానా మల్టీ స్టారర్ టాలీవుడ్ లో పెద్ద హాట్ టాపిక్ గా మారిపోయింది. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోశియమ్’ రీమేక్ గా తెలుగు తెరపైకి వస్తోన్న సినిమాకి జనాల్లో ఆసక్తికేం కొదవలేదు. అయితే, పవర్ స్టార్ ఫ్యాన్స్ మాత్రం ఓ రేంజ్లో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే, ‘గబ్బర్ సింగ్’ తరువాత మరోసారి పోలీస్ వేషంలో దర్శనమిచ్చాడు పీకే! ఆ…
యువీ కాన్సెప్ట్స్, మాస్ మూవీ మేకర్స్ సంస్థలు మారుతి దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమా ‘మంచి రోజులు వచ్చాయి’. ఈ చిత్రం ఫస్ట్ లుక్‌తో పాటు టీజర్ కూడా రిలీజ్ అయింది. ‘ఏక్ మినీ కథ’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శోభన్ ఇందులో నటిస్తున్నాడు. మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. ‘టాక్సీవాలా’ తర్వాత యస్.కె.ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా నుంచి ‘సోసో గా ఉన్న’ సాంగ్ ప్రోమో విడుదలైంది. సెన్సేషనల్…
సమంత ప్రధాన పాత్రలో గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘శాకుంతలం’. ఈ మైథలాజికల్ డ్రామాను గుణటీమ్ వర్క్ తో కలసి దిల్ రాజు ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. కాళిదాసు రాసిన శకుంతల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో శకుంతలగా సమంత నటిస్తోంది. గురువారంతో శకుంతలగా నటిస్తున్న సమంత పాత్ర చిత్రీకరణ పూర్తయింది. ఈ సందర్భంగా సమంతకు యూనిట్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఇటీవల భరతునిగా నటించిన అల్లు అర్జున్ కుమార్తె అర్హకు వీడ్కోలు చెప్పిన సినిమా యూనిట్ ఇప్పుడు…
ఈ ఏడాది ‘నాంది’తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్ హీరోగా ‘తిమ్మరుసు’తో సక్సెస్ సాధించిన ఈస్ట్ కోస్ట్ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సభకు నమస్కారం’. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగాపరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగాప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావుకెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్…
నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పేజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా రూపొందుతోంది. ‘కుమారి 21 ఎఫ్’ వంటి హిట్ తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తీస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా డబ్బింగ్ కూడా మొదలైంది. నిఖిల్ సిద్ధార్థ్…
ఆల్కహాల్ తాగితే జరిగే పరిణామాల గూర్చి ‘బ్రాందీ డైరీస్’ చిత్రంలో చూపించబోతున్నాడు డైరెక్టర్ శివుడు. గరుడ శేఖర్, సునీత సద్గురు జంటగా నటించారు. కలెక్టీవ్ డ్రీమర్స్ పతాకంపై లేళ్ల శ్రీకాంత్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 13న విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు శివుడు మాట్లాడుతూ.. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆల్కహాల్ నేపథ్యంలోనే ఉంటుంది. ప్రతి మనిషికి ఎన్నో అలవాట్లు ఉంటాయి. వాటిలో ఆల్కహాల్‌ని మాత్రమే ఎందుకు ద్వేషిస్తున్నారు. నా…
ఈ యేడాది మార్చి మొదటి వారంలో ‘షాదీ ముబారక్’ మూవీతో జనం ముందుకు వచ్చిన ఆర్. కె. సాగర్ ఇప్పుడు ‘ది 100’ పేరుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీతో రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ బుధవారం విడుదల చేసింది. ఆసక్తికరమైన టైటిల్‌తో రూపొందనున్న ది 100 సినిమాలో ఆర్.కె. సాగర్.. విక్రాంత్ అనే ఐపీయస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. ఖాకీ యూనిఫామ్‌లో చేతిలో…