Dhurandhar 2 : ఇండియన్ సినిమా పవర్ అంటే ఇది! 45కు పైగా దేశాల్లో టాప్ ట్రెండింగ్‌లో నిలిచిన ‘ధురంధర్ 2’..
- 48 గంటల్లోనే 312 మిలియన్ల వ్యూస్ సాధించిన 'ధురంధర్ 2' యూట్యూబ్ చార్ట్‌లలో రికార్డుల దుమ్మురేపుతున్న భారతీయ సినిమా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dhurandhar 2 : భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరోసారి చాటిచెబుతోంది ‘ధురంధర్ 2’. చాలా కాలం తర్వాత ఒక బాలీవుడ్ సినిమా కోసం యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులతో పాటు అంతర్జాతీయ స్థాయిలో మూవీ లవర్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోందంటే, అది ఈ చిత్రం సృష్టించిన ఇంపాక్ట్ అని చెప్పక తప్పదు. మార్చి 7న జియో స్టూడియోస్ విడుదల చేసిన ఈ చిత్ర ట్రైలర్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
READ ALSO: Egg Prices Fall: కోడి గుడ్డు ధర భారీగా పతనం..
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
45 దేశాల్లో ట్రెండింగ్..
విడుదలైన కేవలం 48 గంటల్లోనే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో కలిపి 312 మిలియన్ల వ్యూస్ సాధించి ఈ ట్రైలర్ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం భారత్‌లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా 45కు పైగా దేశాల్లో యూట్యూబ్ చార్ట్‌లలో నంబర్ 1 స్థానంలో ట్రెండింగ్ అవుతూ గ్లోబల్ అటెన్షన్‌ను సొంతం చేసుకుంది ఈ సినిమా. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ జస్కిరత్ సింగ్ రంగీ, హమ్జా అలీ మజారి అనే రెండు భిన్నమైన షేడ్స్ ఉన్న పాత్రల్లో కనిపిస్తుండటం సినిమాపై అంచనాలను రెట్టింపు చేసింది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో యాక్షన్ సీక్వెన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
రణవీర్ సింగ్‌తో పాటు ఈ చిత్రంలో భారీ తారాగణం అలరించనుంది. ఈ సినిమాలో ఆర్.మాధవన్.. అజయ్ సన్యాల్‌గా వ్యూహాత్మక మాస్టర్‌మైండ్ పాత్రలో కనిపించనున్నారు. ఎస్‌పీ చౌధరి అస్లాంగా పవర్‌ఫుల్ రోల్‌లో సంజయ్ దత్ మెరవనున్నారు. ఐఎస్ఐ మేజర్ ఇక్బాల్‌గా విలన్ పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనున్నారు. ‘ఉరి: ద సర్జికల్ స్ట్రైక్’ ఫేమ్ ఆదిత్య ధర్ ఈ హై-ఆక్టేన్ స్పై యాక్షన్ చిత్రానికి కథ, దర్శకత్వం వహించారు. జియో స్టూడియోస్ సమర్పణలో, B62 స్టూడియోస్ బ్యానర్‌పై జ్యోతి దేశ్‌పాండే, లోకేష్ థర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ కానుంది.
READ ALSO: Belagavi Honeytrap: లాడ్జీకి పిలిచి ఆ పని చేయమని చెప్పేది.. కట్ చేస్తే అందినకాడికి దోచుకుంది!
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?