నాగచైతన్య ‘లవ్ స్టోరీ’తో ఆరంభం
హీరోగా టాప్ లీగ్ లోకి వెళ్లాలనుకుంటున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఇక కెరీర్ ఆరంభం నుంచి సినిమాలతో బిజీగా ఉన్నా బిజినెస్ పైనా దృష్టి పెట్టాడు. రౌడీ బ్రాండ్ పేరుతో దుస్తుల వ్యాపారం ఆరంభించి సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు ఇతర హీరోల తరహాలో థియేటర్ వ్యాపారంలోనూ తనదైన ముద్ర వేసేందుకు అడుగు ముందుకు వేశాడు. డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ వారితో చేతులు కలిపి మల్టీప్లెక్స్ వ్యాపారంలోకి అడుగుపెట్టాడు.
మహేష్, అల్లు అర్జున్, ప్రభాస్ బాటలో థియేటర్ నిర్మాణం చేపట్టాడు. ఏషియన్ సినిమాస్ విజయ్ స్వస్థలం మహబూబ్ నగర్ లో త్రీ స్కీన్ తో మల్టీప్లెక్స్ ను నిర్మించింది. గతంలో అక్కడ తిరుమల థియేటర్ ఉండేది. ఇప్పుడు ఆ ప్రాంగణంలో మల్టీప్లెక్స్ నిర్మించాడు. దీనికి AVD సినిమాస్ అనే పేరు పెట్టారు. AMB ఏషియన్ మహేశ్ బాబులా AVD ఏషియన్ విజయ్ దేవరకొండ అన్నమాట. ఈ మల్టీప్లెక్స్ ను 24వ తేదీన నాగచైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’తో ఆరంభించనున్నారు.
నిజానికి ‘వకీల్ సాబ్’తో ఆరంభించాలనుకున్నా కుదరలేదు. విజయ్ దేవరకొండ, సునీల్ నారంగ్ ఇటీవల AVD సినిమాస్ లో ప్రత్యేక పూజలు చేశారు. ఏషియన్ సినిమాస్ తర్వాత అల్లు అర్జున్ తో కలసి అమీర్ ఏఏఏ మల్టీప్లెక్స్ ని ప్రారంభించనుంది. ఇక విజయ్ దేవరకొండ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ‘లైగర్’ చేస్తున్నాడు. ఇటీవల విడుదల చేసిన విజయ్ లుక్ కి అందరూ ఫిదా అయ్యారు. మరి కొత్తగా థియేటర్ రంగంలో కి అడుగు పెడుతున్న విజయ్ అక్కడా సక్సెస్ కావాలని కోరుకుందాం.