టాలీవుడ్ నటుడు సాయిధరమ్ తేజ్ కోలుకుంటున్నారని అపోలో ఆసుపత్రి వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సాయిధరమ్ తేజ్ స్పృహలోనే ఉన్నారని పేర్కొన్నారు. వెంటిలెటర్ తొలగించామని, సొంతంగానే శ్వాస తీసుకుంటున్నారని చెప్పారు. మరికొద్ది రోజులు సాయిధరమ్ తేజ్ ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకుంటారని వివరించారు. గత ఆదివారం సాయి ధరమ్ తేజ్‌కు వైద్యులు కాలర్ బోన్ సర్జరీని నిర్వహించారు. ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగవుతున్నదని వైద్యులు వివరించారు.
సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి వద్ద స్పోర్ట్స్ బైక్‌పై వెళ్తూ ప్రమాదానికి గురైయ్యాడు. అప్పటినుంచి జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.