ప్రముఖ నటుడు కమల్ హాసన్ కొవిడ్ 19 బారిన పడ్డారు. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు. అంతేకాదు ‘కరోనా మహమ్మారి ఇంకా మన మధ్యే ఉందని, దానితో జాగ్రత్తగా ఉండాల’ని కమల్ హాసన్ సూచించారు. సోమవారం మధ్యాహ్యం కమల్ హాసన్ తాను హస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న విషయాన్ని స్వయంగా ట్వీట్ చేశారు. ‘యూ.ఎస్. ట్రిప్ నుండి తిరిగి వచ్చాక కాస్తంత దగ్గు వచ్చిందని, పరీక్షలు నిర్వహించగా ఇన్ ఫెక్షన్ ఉందని వైద్యులు నిర్థారించారని అన్నారు.…
ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ కు మొదటి నుండి సినిమాలలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇవ్వడం అలవాటే. అయితే గత కొంతకాలంగా ఆయన పూర్తి స్థాయి నటుడిగా మారిపోయాడు. సినిమాలతో పాటు వెబ్ సీరిస్ ల లోనూ కీలక పాత్రలు పోషిస్తూ, నటుడిగా తనకంటూ ఓ గుర్తింపును తెచ్చుకుంటున్నాడు. తాజాగా సందీప్ కిషన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘మైఖెల్’ చిత్రంలోనూ గౌతమ్ వాసుదేవ మీనన్ ఓ కీలక పాత్ర పోషించబోతున్నాడు. ఈ విషయాన్ని చిత్ర…
ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులందరూ ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 7 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలైపోయాయి. ఇక ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన…
మలయాళ నటుడు మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మరక్కార్.. అరేబియా సముద్ర సింహం’. మలయాళ దర్శకుడు దర్శన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఎంతోమంది అగ్రతారలు నటించారు. యాక్షన్ కింగ్ అర్జున్, మంజు వారియర్, సుహాసిని, కళ్యాణి ప్రియదర్శిని, కీర్తి సురేష్, సిద్ధిఖ్, సురేశ్ కృష్ణ , ప్రణయ్ మోహన్ లాల్ తదితరులు ఈ సినిమాలో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా…
మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా కన్నా నిర్మాతగానే విజయం సాధించిందని చెప్పాలి. పెళ్లి తరువాత నిహారిక నిర్మాతగా మారి ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్ నిర్మించిన విషయం తెలిసిందే.. జీ5 లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకొని హిట్ గా నిలిచింది. ఇకపోతే ఈ విజయాన్ని నిహారిక తమ యూనిట్ తో సెలబ్రేట్ చేసుకొంది. ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడిన ఆమె తన కుటుంబం గురించి…
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి…
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం షూటింగ్లకు గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. ఇటీవల ఆయన చేతికి గాయం కావడంతో కొద్దిరోజులు రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో ఎన్టీఆర్ కి ఖాళీ దొరికింది. దీంతో ఫ్యామిలీతో వెకేషన్ ప్లాన్ చేశాడు ఎన్టీఆర్.. తన కుటుంబంతో స్విట్జర్లాండ్ కు బయలుదేరాడు. ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ విమానాశ్రయంలో భార్య పిల్లలతో కలిసి కనిపించాడు.ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. అయితే ఈ వెకేషన్ ఎన్ని రోజులు అనేది తెలియాల్సి…
నందమూరి బాలకృష్ణ నేడు మీడియా ముందుకు వచ్చి చంద్రబాబు ఘటనపై స్పందించిన విషయం తెలిసిందే. తమ కుటుంబంపై, ఆడవారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని ఆయన మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. అయితే ఆ మీడియా సమావేశంలో అందరి కళ్ళు బాలకృష్ణ ఎడమ చేతి మీదనే ఉన్నాయి.. ఆయన చేతికి కట్టు కట్టుకొని కనిపించారు. దీంతో బాలయ్యకు ఏమైంది..? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ఆరు నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య.. అక్టోబర్ 31న…
స్టార్ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ట్రెండ్ సృష్టిస్తోంది. నాగ చైతన్యతో విడనుకుల తరువాత అమ్మడు అందాల ఆరబోతకు గేట్లను ఎత్తేసిన విషయం తెలిసిందే.. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానుల మనసులను దోచుకొంటుంది. ఇక తాజాగా సామ్ న్యూ ఫోటో షూట్ నెట్టింట వైరల్ గా మారాయి.. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ ఫిట్ లో సామ్ సెగలు రేపుతోంది. కవ్వించే చూపులతో సామ్ మంటలు పుట్టిస్తోంది. తెల్లటి కొలనులో నల్లటి కలువులా కనిపించి కాకా…
సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ ఆరోగ్యం విషమించింది. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఈరోజు ఉదయం అపోలో ఆసుపత్రిలో జాయిన్ చేశారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని, 24 గంటలు గడిస్తేనే ఏమి చెప్పలేని వైద్యులు తెలిపారు. ఆయనకు వెంటిలేటర్ పైనే చికిత్స అందజేస్తున్నామని, ఆయనను కాపాడడానికి డాక్టర్స్ అందరు తమ వంతు కృషి చేస్తున్నారని హెల్త్ బులిటిన్ ద్వారా తెలిపారు. కైకాల ఆరోగ్యం బాగుపడాలని, ఆయన మంచిగా కోలుకోవాలని అభిమానులు…