మరపురాని మధురం.. ఘంటసాల గానం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
“ధారుణి రాజ్యసంపద మదంబున…” అంటూ ఆదికవి నన్నయ్య పలికించిన పద్యాన్ని, నటరత్న యన్.టి.రామారావు అభినయానికి అనువుగా ఆలపించినా, “కుడి ఎడమైతే… పొరబాటు లేదోయ్…” అంటూ నటసమ్రాట్ ఏ.నాగేశ్వరరావు నటనకు ప్రాణం పోసినా- వాటిలో తనదైన గళమాధుర్యం నింపుతూ ఘంటసాల వేంకటేశ్వరరావు సాగారు. ఘంటసాలను స్మరించిన ప్రతీసారి ఆ మహానటులిద్దరూ గుర్తుకు రాకమానరు. ఆ ఇరువురి అభినయాన్ని గుర్తు చేసుకున్న సమయాల్లో ఘంటసాల మాస్టర్ జ్ఞప్తికి రావలసిందే! నటరత్న, నటసమ్రాట్ అభినయవైభవంలో ఘంటసాల గానానికీ ప్రత్యేకమైన భాగముందని చెప్పవచ్చు.
యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’ చిత్రంలో ఆయన అభినయానికి తగిన రీతిలో గళవిన్యాసాలు చేశారు ఘంటసాల. అదే చిత్రానికి మరపురాని బాణీలు సమకూర్చి మురిపించారాయన. ఆ సినిమా జైత్రయాత్రతోనే ఘంటసాల వారి సంగీతం సైతం విజయయాత్ర ఆరంభించింది అంటే అతిశయోక్తి కాదు. ఏయన్నార్ ను ట్రాజెడీ కింగ్ గా మలచిన ‘దేవదాసు’లోని పాటల్లోనూ ఘంటసాల గానానికే పెద్ద పీట వేయవలసి వస్తుంది. అందుకే ఆ ఇద్దరు మహానటులు తమ అభినయానికి ఘంటసాల గానం ఆత్మ అన్నారు.
Also Read
యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ నవరసభరిత పాత్రల్లో జీవించారు. ప్రతి రసంలోనూ ఘంటసాల గానం వారితో పయనం చేయడం విశేషం. హాస్యమైనా, భయానకమైనా, బీభత్సమైనా, రౌద్రమైనా, శాంతమైనా, శృంగారమైనా, వీరమైనా, కరుణయైనా, అద్భుతంగా పలికించి పులకింప చేశారు నటరత్న, నటసమ్రాట్. ఆ రసాలన్నిటా ఘంటసాల గాత్రమూ వారి అభినయానికి తోడుగా సాగింది. ఇక ఈ ఇద్దరూ భక్తిరసం కురిపించిన సమయంలోనూ ఘంటసాల గానమే దన్నుగా నిలచింది.
పౌరాణికాలలో తెలుగువారి ప్రతిభ అనితరసాధ్యం అని అందరికీ తెలుసు. పౌరాణిక చిత్రాలను తెరకెక్కించడంలోనూ మన తెలుగువారిదే పైచేయి! ముఖ్యంగా పౌరాణిక చిత్రాలలోని పద్యాలు ఘంటసాల గళంలో అమృతమయమై పోయాయనే చెప్పాలి. తెలుగువారిని విశేషంగా అలరించిన పౌరాణిక చిత్రరాజం యన్టీఆర్ శ్రీరామునిగా నటించిన ‘లవకుశ’. ఈ చిత్రంలోని అన్ని పాటలూ విశేషాదరణ పొందాయి. వాటిని మధురంగా మార్చింది ఘంటసాల సంగీతమనే చెప్పాలి. యన్టీఆర్, ఏయన్నార్ నటించిన పౌరాణికాలు “మాయాబజార్, భూకైలాస్, శ్రీకృష్ణార్జున యుద్ధం” చిత్రాలలోనూ ఘంటసాల గళమే ఇరువురి అభినయానికి ప్రాణం పోసింది. ఇక ‘భూకైలాస్’లో అయితే “దేవ దేవ ధవళాచల మందిర…” అంటూ ఆరంభమయ్యే ఒకే పాటలో ఇద్దరికీ ఘంటసాల నేపథ్యగానం చేయడం మరింత విశేషం! తెలుగు చిత్రసీమకు యన్టీఆర్, ఏయన్నార్ రెండు కళ్ళు అంటారు. ఆ రెండు కళ్ళలో కాంతిని నింపింది ఘంటసాల గానమే అని మరువరాదు.
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి